सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

సేంద్రీయ సేద్యంతో సంపద

మధ్యప్రదేశ్

parivartan-img

దగైవాడకి సుస్వాగతం. మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో అలోక ఊరి నుంచి 35 కి.మీj దూరంలో ఉన్న ఓ కుగ్రామం. ఈ చిన్న గ్రామం అధునాతన వ్యవసాయ  పద్దతిలో ఓ ప్రత్యేక స్థానాన్ని చేజిక్కించుకుంది. అత్యుత్తమైన సాగునీటి వనరులతో (26 బావులు మరియు 35 నీటిని అవరోధించే గట్లు/ ఆనకట్టలు) వాణిద్య పంటలైన టొమాటో, క్యాబేజీ మరియు అనేక పంటలతో తులతూగుతూ, ఇంటింటినీ ధనరాసులతో నిండి అలరారుతోంది. ఇదంతా ఒక్క  జంట  సాంఘిక సేవా తత్పరత మూలంగా సాధ్యమైంది.

32 సంవత్సరాల క్రితం 1985లో మోహన్ రావు ఘేఇసాస్ ,ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ ద్విపట్టాతో తన సామర్థ్యం చూపించారు. ఉత్సాహం లోను కార్యశీలత లోనూ వారికి సమ ఉజ్జీ అయిన అర్ధాంగి శ్రీమతి స్మిత. వీరిద్దరూ కలిసి 55 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం రూపురేఖలు మార్చేశారు. మొట్టమొదటి సారిగా ఆర్ యస్ యస్  స్వయంసేవక్ గా  మోహన్ రావు గారు గ్రామంలో అడుగు పెట్టినప్పుడు  అందరూ దీనావస్థలో  ఉన్నారు. దయనీయంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేటట్టు చేశారు. భూమి బీడు వారి బంజరుగా ఉంది. వ్యవసాయానికి సాగునీటి కొరత.5 కి.మీ దూరంలో ఉన్న ఓ చిన్న సరస్సు తప్ప ఏమీలేదు. ముసలివాళ్ళని, మహిళలని , పిల్లలని వదిలి యువకులంతా 9 నెలలు గ్రామం వదిలి బయట పనులకి వెళితే గానీ బ్రతికే  వెసులుబాటు లేదు.

అట్లాంటి దుర్భర పరిస్థితిలో"సుయష్ ఛారిటబుల్ ట్రస్ట్ " సౌజన్యంతో, మోహన్ రావుగారు స్మితగారు " "గోమయంతో సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి పథకం " అనే ఊహాత్మక నమూనాను రూపొందించారు. ఆర్ యస్ యస్ పెద్దలచే పాలకుడిగా నియమింపబడి మోహన్ రావు గారు

"అలోక వనవాసి కల్యాణ ఆశ్రమం"లోని విద్యార్ధుల పొలాలలో ఆ పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఎప్పుడైతే ఒక ఎకరం బంజరు భూమి నుంచి ఒక్కో కుటుంబ వార్షిక ఆదాయం 40,000 ముట్టిందో అప్పుడు ఆ పథకాన్ని చుట్టుపక్కల గ్రామాలకి విస్తరింప చేసారు. ట్రస్ట్ స్వచ్ఛంద సేవాదారులు, గ్రామస్తులందరికీ నాణ్యమైన విత్తనాలని ఎలా పెంపుచేయాలో మరియు ఆవు మూత్రం నుంచి సమగ్ర సస్యరక్షణ ఎరువును ఎలా తయారు చేస్తారో నేర్పించారు. అలాగే వర్షపు నీటిని వినియోగానికి క్రమబద్ధీకరించే విధానాలను(అనగా బావులు తవ్వటం, కాలువ గట్లు కట్టడం) నేర్పారు . ఈ విధంగా సాగురంగం నిలదొక్కుకునే పనులు నేర్పి, ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలిచే అవకాశం కల్పించారు. పక్క గ్రామమయిన మేల్ఘాట్ లో బాపూకాలే మరియు శ్యామ బౌల్ సారేలు ఒక ఎకరం భూమిలో 10 క్వింటాళ్ల  సోయాబీన్స్ మరియు  1 క్వింటాల్ జొన్న పండించి 47,000 సంపాదించారు. అలాగే మోతీలాల్ బావ్నే అనే బిబా గ్రామస్థుడు ఒక గట్టు కట్టి నలుగురు రైతులకి నీటి సహకారం అందించాడు. వారంతా రబీ పంటలో ఎకరానికి 18000 సంపాదించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం చేసిన "సుయష్ చారిటబుల్ ట్రస్ట్ " వారికి మొట్టమొదటి " నానాజీ దేష్ ముఖ్ " అవార్డు అందజేశారు. ఈ రోజు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛతిస్ ఘడ్ మరియు ఒరిస్సా లో 2600 గ్రామాలలోని అనేక వేల మంది కర్షకులు ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని చేపట్టి స్థితిమంతులైయ్యారు.


నిస్సారమైన నేలకు జీవం పోసిన మోహన్ రావు స్మిత దంపతుల వినూత్న సేంద్రియ వ్యవసాయ పద్ధతి విస్తృతంగా రైతులలో అవగాహన పెంపొందించి, లేమి నుంచి కలిమి బాట పట్టించింది. ఈ ప్రయాణం నల్లేరు మీద నడకలాగా సాగలేదు. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రాధమిక దశ లోనే, స్వచ్ఛంద సేవాధారులకి, ఉంబరపాడు గ్రామస్థుల నుంచీ  ఎంతో  ప్రతిఘటన వచ్చింది. ఆ గ్రామస్థులు తమ సాగునీటి సమస్యకు పరిష్కారం చూపించే వరకూ సేవాధారుల మాట కూడా వినమని నియమం పెట్టారు. వారి సలహాలు  పెడచెవిన పెట్టారు. కానీ అదే గ్రామస్థులు ఇప్పుడు గర్వపడుతున్నారు. ప్రత్యేకంగా పలు టీవీ ఛానల్ వాళ్ళు, 3 ఎకరాలలో స్ట్రాబెర్రీ సాగుబడి చేసి విశేషంగా 1,60,000 సంపాదించిన ఎక్నాధ్ గైక్వాడ్ ని ఇంటర్యూ చేసినప్పుడు వారి సంతోషం అంబరాన్ని తాకింది.

మొదట్లో నాణ్యమైన విత్తనాల సేకరణకీ, బావులు తవ్వటం వంటి సేద్యపు పనులకీ గ్రామస్తులందరికీ ట్రస్ట్  వారు ఆర్ధిక సహాయం అప్పుగా అందించారు. కానీ ఇప్పుడు రైతులు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి స్వతంత్రంగా వారికి వారే మౌళిక వసతులు ఏర్పరుచుకుంటూ సర్వ స్వతంత్రులుగా తల ఎత్తుకొని జీవిస్తున్నారు.

985 Views
अगली कहानी