सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

వారి జీవిత పోరాట సమయంలో ఒక తోడు 'నిర్మయ్ సేవా సంస్థాన్', ముంబయి

డా. శాంతా ఠాకూర్ | ముంబై

parivartan-img

వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్

ఇక్కడ ప్రతీ కథ జీవిత పోరాటానికి సంబంధించినదే. ప్రాణాంతకమైన కేన్సర్ లాంటి వ్యాధులతో పోరాడుతున్నవారు ఇంకొన్నాళ్ళు ఈ ప్రపంచంలో ఆరోగ్యంతో జీవించాలనే ఆశతో ప్రతీ నెలా ఇక్కడకు వస్తారు. కేన్సర్ అనేది ధనవంతులకు వచ్చే వ్యాధి అని ఒక నానుడి ఉండేది, కానీ ఇప్పుడు అది పుకార్లు హద్దులు దాటి ఎంతవేగంగా వ్యాపిస్తాయో కేన్సర్ వ్యాదికూడా పేదవారి జీవితాలలో అలా వచ్చి చేరింది. పేదవారికి ఈ వ్యాధి ఒక గుదిబండలా మారి ట్రీట్మెంట్ కి స్తోమతలేక, ఈ వ్యాదిగురించి అవగాహన లేక ఒక యుద్ధమే చేయాల్సి వస్తోంది. యుద్ధం చెయ్యటానికి వారి దగ్గర అస్త్రాలు లేవుకానీ, రక్షణకొరకు వారికి దగ్గరలో నిర్మయ్ సేవా సంస్థ, ముంబై లో ఉంది.


ధారావీలో కరోనా కాలంలో మాస్ స్క్రీనింగ్ చేస్తున్న నిర్మయ్ కార్యకర్తలు.

భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై లో అదికూడా అత్యంత ఖరీదయిన ప్రాంతం, ముంబై హాస్పిటల్ కి 1 కి మీ దూరంలో, ఏకమే  పాలస్ అపార్ట్మెంట్స్ , దోబీ తలావ్ లో ఉన్న నిర్మయ్ సేవా సంస్థ, జలగాంవ్ మరియు చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే రోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక వసతి కల్పించి, ట్రీట్మెంట్ కి సహాయపడుతూ, వారి జీవితాలలో ఒక పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. శ్రీ చేతన్ నేతృత్వంలోని నిబద్దత కలిగిన స్వయంసేవకుల బృందం ద్వారా నిర్వహించబడుతున్న ఈ సంస్థ, డాక్టర్ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, అవసరమైన పరీక్షలను ఏర్పాటు చేయడం, చికిత్స పూర్తయ్యే వరకు అన్ని రకాల సహాయాన్ని అందజేస్తుంది. పేషెంట్ వచ్చినప్పటి నుంచి కోలుకునే వరకు టీమ్ వారికి అండగా ఉంటుంది.


నిర్మయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న రోగులు.

మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి అయిన శ్రీ సుశీల్ దగ్డు తన జీవితంలో "నిర్మయ్" ఒక  వరంగా  భావిస్తాడు. అతని తండ్రి, శ్రీ రామేశ్వర్ దగ్డు, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ జిల్లా (ఔరంగాబాద్) కన్వత్ తహసీల్‌లో కూలీగా పనిచేశారు. 11వ తరగతి చదువుతున్న తమ ముద్దుల కొడుకు సుశీల్‌కు మెదడులో కణితి ఉందని గుర్తించడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. కేవలం 200 కూలీ వచ్ఛే శ్రీరామేశ్వర్ ఖరీదైన వైద్యం చేయించలేకపోయారు. అదృష్టం వారి వైపు ఉండటంవల్ల వారికి "నిరమాయ్" దొరికింది. మూడు సంవత్సరాలలో, సుశీల్ తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నాడు, మొత్తం రూ. 22 లక్షలు. విశేషమేమిటంటే, "నిర్మయ్" ఆ ఖర్చులన్నీ భరించింది. ఈ రోజు, సుశీల్ తనకు లభించిన ప్రేమ మరియు మద్దతును ఇతరులకు పంచాలని  నిశ్చయించుకున్నాడు. "నిరమాయ్" తనకు చేసినట్లే డాక్టర్ అయ్యి పేద రోగులకు ఉచితంగా వైద్యం చేయాలన్నదే అతని లక్ష్యం గా మలుచుకున్నారు.


జలగావ్ నుండి ఒక కథ విందాం. 75 ఏళ్ల శ్రీ మధుకర్ దగ్డు, ఆటో డ్రైవర్ 2 సంవత్సరాల క్రితం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. "నిర్మయ్" దొరకగానే అతని అదృష్టం మారిపోయింది. పూర్తి సమయ కార్యకర్త అయిన శ్రీ సోమనాథ్ పాటిల్ సహాయంతో "నిర్మయ్" లో శ్రీ మధుకర్ సుమారు రెండు సంవత్సరాలు చికిత్స పొందారు. "నిర్మయ్" బృందం అతను కోలుకునేంత వరకు అతనికి సహకరించి, అతనిని కుటుంబంలా చూసుకుంది. చికిత్స కోసం ముంబైకి వచ్చిన సమయంలోతన ఖర్చులన్నింటినీ ప్రభుత్వ సహకారంతో "నిర్మయ్" సంస్థ భరించింది.

కొన్ని సంవత్సరాలుగా నిర్మయ్ కార్యాలయంలో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి. సంస్థను స్థాపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన శ్రీ రామేశ్వర్‌జీ, జల్‌గావ్ మరియు పరిసర ప్రాంతాలలో క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద సోదర, సోదరీమణులకు ముంబైలో తగిన చికిత్స పొందేందుకు సహాయం అందించే లక్ష్యంతో 2014లో "నిర్మయ్ సేవా సంస్థాన్" స్థాపించబడింది.

"నిర్మయ్ సేవా సంస్థాన్", సంఘ్ యొక్క అప్పటి 'క్షేత్ర ప్రచారక్' శ్రీ ముకుందరావు పాంశీకర్ జీ ప్రేరణతో మరియు అప్పటి గౌరవ ఆరోగ్య మంత్రి శ్రీ గిరీష్ మహాజన్ జీ కృషితో, ప్రారంభమయి 2014 నుండి, ముంబైలోని వేలాది మంది రోగులకు సహాయం అందిస్తోంది. అదనంగా, ఈ సంస్థ ద్వారా జల్గావ్ జిల్లాలోని వివిధ గ్రామాలలో 140కి పైగా వైద్య శిబిరాల్లో 2 లక్షల మందికి పైగా రోగులు ప్రాథమిక చికిత్స పొందారు.

ముంబయికి రోగులను తీసుకురావడం మరియు ఆసుపత్రి విజిట్స్ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా  టాటా మెమోరియల్ హాస్పిటల్ వంటి ప్రసిద్ధ ఆసుపత్రికి వెళ్లడం ఒక పెద్ద సవాలు, "నిర్మయ్" కి వచ్చే చాలా మంది ప్రజలు కార్మికులు లేదా రైతులు, వీరిలో చాలా మంది ఆసుపత్రి విచారణలు, విధానాలు తమ సొంతంగా నెరవేర్చడానికి భయపడతారు. అటువంటి పరిస్థితులలో, "నిర్మయ్" లో ఉన్న కార్యకర్తలు వారికి సహాయకులు, స్నేహితులు మరియు మార్గదర్శకులుగా మారతారు. వారు రోగులకు రిజిస్ట్రేషన్ నుండి సరైన వైద్యుడిని ఎంచుకోవడం, అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, పరీక్షలు చేయించుకోవడం మరియు చికిత్స కోసం ప్రభుత్వ సహకారాన్ని ఏర్పాటు చేయడం వరకు సహాయం చేస్తారు.

అంతేకాకుండా, ఈ సంస్థ సీరియస్ గా ఉన్న రోగులకు అవసరమైతే వారు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఉచిత ఆంబులెన్స్ సేవలను కూడా అందిస్తుంది. గత సంవత్సరంలోనే 48 మంది రోగులకు రూ.74,96,334/- అందించినట్లు "నిర్మయ్" ట్రస్టీ శ్రీ యోగేశ్వర్ గార్గే చెప్పారు. ఈ నిధులలో కొంత ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి, మరికొంత "నిర్మయ్ ట్రస్ట్" నుండి మరియు మిగిలినవి ప్రజల సహాయం వలన ఏర్పాటు చేయబడ్డాయి.

'COVID-19' మహమ్మారి సమయంలో, సంస్థ 1280 క్లినిక్‌లను ప్రారంభించింది మరియు 27 ఆసుపత్రులలో వివిధ సేవలను అందించింది. మాస్క్‌లు, శానిటైజర్లు, మందులు మరియు ఆక్సిమీటర్‌లను పంపిణీ చేయడంతో పాటు, ధారావి లో జరిగిన మాస్ స్క్రీనింగ్ లో పూర్తి సమయ కార్యకర్తలు కూడా కీలక పాత్ర పోషించారు.

"నిర్మయ్ సేవా సంస్థాన్" మన వెనుకబడిన సోదర సోదరీమణులకు ఒక సూర్య కిరణం లా నిలుస్తోంది. వారు అనేక వ్యక్తులు మరియు కుటుంబాల జీవితాలలో గణనీయమైన మార్పును కొనసాగిస్తున్నారు, వారి కష్ట సమయాల్లో ఆశ తో పాటు సహాయాన్ని అందిస్తున్నారు.

159 Views
अगली कहानी