सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

విద్య అనే సూర్యుడి మార్పు అనే కిరణాలు దాతార్ కు తాకినవేళ

కిషన్ మర్ల | ఉత్తర ప్రదేశ్

parivartan-img

సింగిల్ టీచర్ స్కూల్, దాతర్ నగర్

ఈరోజు గ్రామం అంతా చాలా ఆహ్లాదంగా వుంది. గ్రామంలోని వాతావరణంలో భిన్నమైన స్ఫూర్తి నెలకొంది. ప్రతి ఇంటిని పండుగ రోజులానే చాలా శ్రద్దగా శుభ్రం చేశారు. కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే, దీనికి భిన్నంగా మామూలు రోజుల్లో దాదాపుగా ఊరిలో అన్ని ఇళ్లలో పచ్చి మద్యం తయారు చేయడం వల్ల ఇక్కడి వాతావరణంలో దుర్వాసన ఉండేది. అయితే రోజు గ్రామస్తులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఝాన్సీ నగర్ ఎస్ఎస్పీ దేవ్కుమార్ ఆంటోనీ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాతర్ అనే చిన్న గ్రామానికి రాబోతున్నాడు. చాలా నిజాయితీ గల అధికారి అని పేరుగాంచిన ఆంటోనీ, రోజు మద్యం అమ్మేవారిని పట్టుకోవడానికో  లేదా ఎదో నేరస్థుడిని కటకటాల వెనక్కి పంపడానికో  ఇక్కడకు రావడం లేదు, మద్యపానం అమ్మకం మరియు సేవించడం రెండింటినీ విడిచిపెట్టిన దాతర్ యువకులను సన్మానించడానికి వారు వచ్చారు. నిజానికి, ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదుఅక్రమ మద్యం వ్యాపారంతో పేరు పొందిన కబుత్రా సొసైటీ ప్రజలు, నేడు అదే సమాజంలోని కొంతమంది యువకులు అక్రమ మద్యం వ్యాపారం మరియు సేవించడం విడిచిపెట్టినందుకు గౌరవించబడుతున్నారు.


సంఘ్ స్వయంసేవకులతో నిర్వహించబడుతున్న 'సేవా సమర్పణ్ సమితి' గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా  చేసిన కృషి ఫలితంగా అద్భుతమైన మార్పు వచ్చింది. సేవా సమర్పణ్ సమితి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వన్ టీచర్ స్కూల్, కబుత్రా సమాజంలోని పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసింది.

రాజ్కుమార్ ద్వివేది 10 సంవత్సరాల క్రితం మే 2007లో మొదటిసారి దాతర్కు వచ్చిన రోజును నేటికీ మరచిపోలేదు. అప్పుడు కాబూత్ర సమాజం నుండి ఎవరూ వారిని తమ గుడిసెకి తీసుకెళ్లడానికి సిద్ధంగా లేరు. అయన ఇక్కడ పిల్లలకు చదువు చెప్పాలి అనుకున్నాడు, కాని వారి తల్లిదండ్రులు దానికి సిద్ధంగా లేరు. చాలా ప్రయత్నాల తర్వాత, రాజ్కుమార్ జీ గ్రామంలో చదువు తప్ప మరేవిషయంలోనూ తలదూర్చకూడదు అనే షరతుపై అయన చదువు చెప్పడం ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు కజ్జా (కబుత్ర ప్రజలు కాకుండా ఇతర వ్యక్తులు) ని నమ్మేవారు కాదు. ఇది కాకుండా, కబుత్ర తెగ యొక్క నేర చరిత్ర కూడా వారిని సమాజంలోని ఇతర వ్యక్తుల నుండి వేరు చేసింది. ఝాన్సీ, దాని పరిసర ప్రాంతాల ప్రజలు కబుత్ర ప్రజలు అంటే భయపడేవారని, కబుత్ర ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలకు ఆనుకుని ఉన్న పొలాల్లో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయనే అభిప్రాయం ఉండేది. సాధారణంగా చదువుకోవడానికి పేదరికం అతిపెద్ద అడ్డంకి. కానీ ఇక్కడ సమస్య వేరు. కబుత్రా తెగ మరియు సమాజంలోని మిగిలిన వారి మధ్య శతాబ్దాల నాటి అపనమ్మకం సమస్యకు అసలు మూల కారణం. పూర్వకాలంలో ఆలయాల్లో సామూహిక ఉత్సవాల్లో పాల్గొనడానికి కూడా వారికి  అవకాశం ఇవ్వలేదు. గతంలో సమాజం ద్వారా వంచించబడిన కబుత్రా ప్రజలకు నేర కార్యకలాపాలకు పాల్పడడం తప్ప వారికి వేరే మార్గం లేకుండా పోయింది. అయితే వారి కాలనీలో చదువుల సూర్యుడు ఉదయించగానే దాతార్ లో మార్పు అనే కిరణాలు పడ్డాయి. కొన్ని సంవత్సరాలలో దాతార్ లో ప్రతిదీ మారిపోయింది. బీఎస్సీ 2 సంవత్సరం చదువుతున్న ఆశిష్ మనోరియా తన పేరుతో కబుత్రా ఇంటిపేరును చేర్చుకోవాలనుకోలేదు. మద్యం సేవించడం మాత్రమే కాకుండా మద్యం అమ్మడం కూడా మానేసిన  వారిలో అతని కుటుంబం కూడా వుంది. గ్రామంలోనే హార్డ్వేర్ దుకాణం నడుపుతున్న అనిల్ మనోరియా మాట్లాడుతూ.. తాను అక్రమ మద్యం వ్యాపారాన్ని వదిలేస్తానని కలలో కూడా అనుకోలేదు అని అన్నారు.


 

చరిత్రను పరిశీలిస్తే, కబుత్రా జాతివారు చాలా వంచనకు గురయ్యారు. ఒకప్పుడు వారిని చూడగానే కొట్టేవారు. దుకాణంలోను మిగతావారితో కూర్చోవడానికి వీలులేదు. దొంగతనం మరియు దోపిడీ తప్ప, ప్రజలకు తమను తాము పోషించుకోవడానికి వేరే మార్గం లేదు. తరువాత, అప్పటి గృహ మంత్రి బల్వంత్ నగేష్ దాతర్ వారిని గుర్తించి ఫిబ్రవరి 1958లో దాతర్ గ్రామాన్ని స్థాపించారు. కానీ 40 ఏళ్ల తర్వాత కూడా కబుత్రా సమాజ్ ప్రజలు ప్రధాన స్రవంతిలో భాగం కాలేకపోయారు. 2005 సంవత్సరంలో, సంఘ్ సమావేశాలలో మొదటిసారిగా, కబుత్రా సంఘం యొక్క సామాజిక స్థితి గురించి చర్చించబడింది, తర్వాత స్వయంసేవకులు సమాజం మధ్యకు వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. తీర్మానం యొక్క మొదటి దశ ఏకల్ విద్యాలయం. పాఠశాల ఇప్పుడు సేవా సమర్పణ్ సమితి ద్వారా నిర్వహించబడుతోంది.


రోజు దాతర్ నుండి 450 మంది పిల్లలు ఝాన్సీలోని వివిధ పాఠశాలలకు వెళుతున్నారు. ఇంతకు ముందు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మద్యం ప్యాకేజింగ్లో సహాయం చేసేవారు, తల్లిదండ్రులకు తెలీకుండా మద్యం తాగేవారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన క్షేత్ర సేవా ప్రముఖ్ నవ్కిషోర్ జీ ప్రకారం, కబుత్రా సమాజం ఆడపిల్లలను చదివించడానికి సిద్ధంగా లేదని, వారు 11 నుండి 14 సంవత్సరాల వయస్సులో వారికి వివాహం చేసేవారు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి 80 మంది అమ్మాయిలు చదువుకోవడానికి ఝాన్సీ వెళుతున్నారు అని అన్నారు. ఇప్పుడు కూడా కబుత్రాలు కజ్జాలకు (కబుత్రా జాతి కానీ వారు) సహాయం చేస్తున్నారు. ఝాన్సీకి చెందిన సిప్రీ బజార్ బస్తీ (ఇక్కడ కూడా సమితి యొక్క బాలసంస్కార్ కేంద్రం నడుస్తుంది) నుండి ఇద్దరు పేద అమ్మాయిలకు సమితి ద్వారా వివాహం జరిగినపుడు, కుమార్తెల వివాహానికి డబ్బు అంతా దాతర్ నుండే అందించబడింది.

 

వర్తమానం లోకి వస్తే, అక్రమ మద్యం వ్యాపారాన్ని విడిచిపెట్టిన దాతర్లోని యువకులను సత్కరించిన తర్వాత, కబుత్రా తెగ గురించి సూపర్ కాప్ SSP దేవ్ కుమార్ ఆంటోనీకి ఉన్న మొత్తం అభిప్రాయం మారిపోయింది. ఆంటోనీ కూడా యువకులను పోలీస్లో చేరమని ప్రోత్సహించారు.

401 Views
अगली कहानी