सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

చేయి చేయి కలిపి చెయ్యి అందివ్వడం

కిషన్ మర్ల | తెలంగాణ

parivartan-img

ఈరోజు తను ఎంత నియంత్రించుకున్న కన్నీరు ఆగట్లేదు, నిజానికి ఆమె కళ్లలోంచి కారుతున్నవి ఆనంద బాష్పములు, డబ్బు కోసం 20 ఏళ్ల క్రితం సీత తండ్రి తన భూమిని వడ్డీ వ్యాపారి దగ్గర తాకట్టు పెట్టారు. రోజు వడ్డీతో సహా మొత్తం రూ.60,000 చెల్లించిన తర్వాత భూమిని విడుదల చేశారు ఆలా తమిళనాడులోని కడపేరి అనే గ్రామానికి చెందిన సీత కుటుంబం అప్పుల బాధ నుంచి విముక్తి పొందింది. "శ్రీ మధురమ్మన్" స్వయం సహాయక సంఘం లో సోదరీమణులు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాకపోతే అప్పు ఎప్పటికీ తీరేది కాదు.


సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ అయిన సుందర్ లక్ష్మణ్ జీ మాట్లాడుతూ, తమిళనాడులోని వెనుకబడిన వనవాసి గ్రామాల ప్రజల సాధికారత కోసం 20 సంవత్సరాల క్రితం సేవాభారతి 'స్వయం సహాయక బృందాలను' ఏర్పాటు చేయడం ప్రారంభించింది. నేడు తమిళనాడు వ్యాప్తంగా సేవా భారతి ద్వారా వారి సంఖ్య 4000 వేలకు పైగా చేరుకుంది. ఆర్థిక సాధికారతతో పాటు, 'స్వయం సహాయక బృందాలు' కూడా సమాజంలో పరస్పరం సహకరించుకోవాలనే భావనను పెంపొందిస్తున్నాయి. అంచుకన్నడరాడ్ గ్రామానికి చెందిన రాజు గురించి చెప్పాలంటే, అతను గ్రూప్ లో చేరకపోతే బహుశా రోజు జీవించి ఉండేవాడు కాదు. కొన్నేళ్ల క్రితం అతనికి గుండెపోటు వచ్చి వెంటనే ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు, అతని కూతురికి పదిమంది గ్రూపు సభ్యులు డబ్బు ఇచ్చారు. మరోవైపు, తాడిక్కరంకోణం గ్రామానికి చెందిన ఒక వితంతువు ఇల్లు ప్రమాదవశాత్తు కాలి బూడిదైంది, అప్పుడు కూడా గ్రూప్ లో సోదరీమణులందరూ ఇంటికి అవసరమైన సామగ్రిని సేకరించి వృద్ధ తల్లి సహాయం కోసం ఒక పక్కా ఇల్లు కూడా నిర్మించారు.

భారతదేశం అంతటా ఇటువంటి 'స్వయం సహాయక బృందాల' ఏర్పాటు కోసం ఒకచోట నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సంఘ్ ప్రచారక్ సుందర్ లక్ష్మణ్ జీ ఇలా అన్నారు, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తిర్పరప్పు గ్రామంలో వెనుకబడిన కులాల మహిళలను సమూహం నుండి తొలగించాలని కుల పంచాయతీ ఆదేశించినప్పుడు, తుగ్లక్ నిర్ణయాన్ని అంగీకరించడానికి మహిళలు నిరాకరించారు. సమూహంలోని సభ్యులు కుల పంచాయితీతో గొడవ కూడా వెనుకాడలేదు

అటవీ ప్రాంతాల్లో వ్యాపించిన వడ్డీవ్యాపారుల దోపిడీకి, కుల వివక్షకు వ్యతిరేకంగా గళం విప్పిన స్వయం సహాయక సంఘాలు మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటానికీ వెనుకంజ వేయలేదు. తట్టికెరె గ్రామం నుంచి మద్యం కాంట్రాక్టును తొలగించాలని తండాకు చెందిన మహిళలు కలెక్టర్వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ను తొలగించేవరకు పోరాటం చేశారు. అదేవిధంగా మురుతంకోడ్గ్రామంలో అక్రమ మద్యం తయారీ కర్మాగారాన్ని మూసివేసి గ్రూపు సభ్యులు ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ ఆయుర్వేద ఔషధం పేరుతో అరిష్టానం అనే కల్తీ మద్యం తయారీ వ్యాపారం సాగుతోంది. అది తాగి చాలా మంది చనిపోయారు కూడా. గ్రూప్ సభ్యులు న్యాయ పోరాటం చేసి ఫ్యాక్టరీ లైసెన్స్ను రద్దు చేయించారు. 

మానవ సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న ఆధునిక యుగం లో, 'స్వయం సహాయక బృందాలు' మానవ సహకారం మరియు సోదరభావానికి కొత్త ఉదాహరణగా ఉద్భవించాయి. తమిళనాడులోని నాగర్కోయిల్ పట్టణానికి సమీపంలోని ఒక గ్రామంలో, భరత్కాళి యొక్క 23 ఏళ్ల వితంతువు కుమార్తె శాంతి పునర్వివాహాన్ని బృందం సభ్యులు

దగ్గరుండి చేయించారు, మరొక గ్రామంలో, క్యాన్సర్తో బాధపడుతున్న వ్యవసాయ కూలీ మరణించడంతో, బృందం సభ్యులు అంత్యక్రియల ఖర్చులు సమకూర్చడమే కాకుండా అనాథలైన తన కూతుళ్లు అనిత, కళ పెళ్లి చేసుకునే వరకు అన్ని విధాలా సాయం చేశారు. 

సంఘ్ యొక్క స్వయంసేవకులు భారతదేశం అంతటా "వైభవశ్రీ" పేరుతో ఇటువంటి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు, స్వయం-సహాయం, స్వావలంబన, ఆత్మగౌరవం మరియు నమ్మకం అనే సూత్రాలను అనుసరించడం ద్వారా అందరి సంక్షేమాన్ని కోరుకుంటూ అభివృద్ధి చెందడం తద్వారా వెనుకబడిన, బలహీన, అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతుంది.

260 Views
अगली कहानी