सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

కల్మషం లేని చిన్నారులు

అవంతి మర్ల | ఢిల్లీ

parivartan-img

కరోనా కాలంలో, అన్ని పాఠశాలలు మూసివేయబడినప్పుడు, పిల్లలను ఇంటి నుండి బయటకు వెళ్లి ఆడుకోవడానికి కూడా అనుమతించని సమయంలో, మొబైల్‌ ఫోన్ తో  సమయాన్ని వృథా చేయకుండా, కొంతమంది పిల్లలు ఢిల్లీ లో తమ సమయాన్ని బాగా ఉపయోగించుకునే  ఒక మార్గాన్ని  కనుగొన్నారు. పిల్లలు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కనుగొన్న మార్గం వారి జీవితంలో ఒక ప్రత్యేకత సాధించింది. లాక్డౌన్ సమయంలో ప్రారంభమైన ఢిల్లీ సేవా భారతి యొక్క "ఈచ్ వన్ టీచ్ వన్" ప్రోగ్రామ్‌తో కనెక్ట్ చేయడం ద్వారా, DPS, GD గోయెంకా, మోడ్రన్ స్కూల్, అంబేద్కర్ బస్తీ, బాల్మీకి బస్తీ, రవిదాస్ క్యాంప్, కల్కాజీ సంజయ్ క్యాంప్ బస్తీ వంటి ప్రసిద్ధ పాఠశాలల నుండి 12 వందల మందికి పైగా పిల్లలు క్యాంప్ బస్తీ, ఆన్‌లైన్‌లో పిల్లలకు నేర్పించడం, అందమైన కథలు చెప్పడం, నృత్యం నేర్పించడం, కాగితంతో చేసిన కుండీలు, పెన్ స్టాండ్ మొదలైన కళ మరియు క్రాఫ్ట్‌లలో చాలా అందమైన వస్తువులను తయారు చేయడం నేర్పించారు.


గుడిసెలలో నివసించే నిరుపేద పిల్లలను ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలతో అనుసంధానం చేయడం కోసం ఈ సేవాయాత్రను ప్రారంభించారు. వారిద్దరి మధ్య దూరాన్ని దూరం చేసి ఇద్దరి జీవితాలకు అద్భుతమైన దిశానిర్దేశం అందించడం ఈ సేవాయాత్ర యొక్క ముఖ్య ఉదేశ్యం. ఢిల్లీ సేవా భారతి ప్రావిన్షియల్ ప్రచార మంత్రి, భూపేంద్ర జీ మాట్లాడుతూ, కరోనా కాలం తరువాత,"ఈచ్ వన్ టీచ్ వన్ " కార్యక్రమం ఇప్పుడు టీన్ సేవరూపాన్ని సంతరించుకుంది,ఇందులో సేవ తర్వాత, జాతీయ భావనకూడా జోడించబడింది.

మార్చి 2020 సమయం లో భారతదేశంలో కరోనా వచ్చి అన్ని పాఠశాలలు నిరవధికంగా మూసివేయబడినప్పుడు, 50 మంది పిల్లలు ఢిల్లీ సేవా భారతి ప్రాంత సంపర్క ప్రముఖ్, నిధి అహుజాకు ఫోన్ చేసి సేవా పనిలో చేరాలని ఉందని తమ కోరికను వ్యక్తం చేశారు. అప్పటికే వారు సేవా భారతి నిర్వహించిన వేసవి మరియు శీతాకాల శిబిరాల్లో సేవా బస్తీల పిల్లలతో వారు పాల్గొన్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని స్వయంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సమయం అది. తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు మరియు ఎంతో ఉదాత్తమైన ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఈ పిల్లలను ఎలా భాగస్వామ్యం చేస్తారని అని కార్యకర్తలు ఆందోళన చెందారు. దీనికోసం నిధి జీ ఒక గూగుల్ ఫారం ను తయారు చేసారు. పిల్లల నుండి ఈచ్ వన్ టీచ్ వన్ ప్రోగ్రామ్‌ ను సేవా బస్తీలోని పిల్లలకు ఆన్‌లైన్‌లో ఎవరు బోధిస్తారు అని దరఖాస్తుల సేకరించారు.

 

1000 మందికి పైగా పిల్లలు ఈ పనికి సంతోషంగా అంగీకరించడంతో నిధి గారి ఆనందానికి అవధులు లేవు. సేవాభారతి ద్వారా, సంస్కార కేంద్రాల పర్యవేక్షక్ మరియు నిర్వాహిక్ సహాయంతో, ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించి బస్తి కి చెందిన ఓ చిన్నారిని మరో చిన్నారికి ఆన్‌లైన్‌ ద్వారా కలిసేలా చేసారు.


బోధించేవారి పేరు వాలంటీర్ అని, మరియు అభ్యాసం చేసే వారికీ ఒక పేరు ఇచ్చారు . వారానికి ఒకసారి జరిగే ఈ తరగతి స్నేహితుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి వారి మధ్య మైత్రి ని పెంచింది.

ఇప్పుడు దీప్తి దీదీ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సెషన్ నాలుగు దశల్లో జరిగిందని చెప్పారు. బడ్డీ, కథ చెప్పడం, అభిరుచి మరియు బుక్ బ్యాంక్. బడ్డీ అంటే తమ మధ్య స్నేహాన్ని ఏర్పరచుకోవడం. స్టోరీ టెల్లింగ్‌లో, వాలంటీర్ పిల్లలు తమ స్నేహితులకు కొన్ని నైతిక మరియు సైన్స్ కథలను చెప్పేవారు. హాబీ సెషన్‌లో డ్రాయింగ్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వంటి అనేక సబ్జెక్టులను ఆన్‌లైన్‌లో బోధించి, బుక్ బ్యాంక్‌లో పిల్లలకు మంచి పుస్తకాలు పంపేవారు. ఈ కార్యక్రమంలో, 11 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు రెండున్నర వేల మంది చిన్నారుల్లో స్ఫూర్తిని నింపేందుకు, వారిలో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రముఖ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, మోటివేషనల్ స్పీకర్ శివ్ ఖేడా సహా పలువురు ప్రముఖులు వీడియోలు రూపొందించి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కాలంలో ప్రారంభమైన ఢిల్లీ సేవా భారతి యొక్క ఈ బోధనా ప్రచారం ఇప్పుడు ఈ పిల్లలకు జీవితకాల తోడుగా మారింది.

ఈ పిల్లలు డిసెంబరులో మొదటిసారి ముఖాముఖి కలుసుకున్నప్పుడు శ్రీరాముడు, భరతుల  కలయికలాంటి ఈ సన్నివేశం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. సేవాభారతి యొక్క సహాయం ఎల్‌ఐసి లాగా ఉందని, “జీవితంలో మరియు జీవితం తర్వాత అని ఆర్కే పురం సేవా బస్తీకి చెందిన నీరజ్‌ చేసిన వ్యాఖ్యానం సేవాభారతి కార్యకర్తల మదిలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది.

257 Views
अगली कहानी