सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

అమ్మాయిలకు రెక్కలు ప్రసాదిస్తుంది - వైదేహి ఆశ్రమం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

రోడ్డు ప్రమాదంలో తన తల్లిదండ్రులను, తన ఎడమ కాలు మరియు కుడి చేయిని పోగొట్టుకున్న క్షణాన్ని భారతి తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేదు. కేవలం 6 సంవత్సరాల వయస్సులో ఉన్న అమాయక భారతి కోసం విధి అన్ని తలుపులు మూసివేసింది. కానీ, "చుట్టూ చీకటి ఉన్నప్పుడు, సర్వశక్తిమంతుడు అయిన ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆశ యొక్క కిరణాన్ని అందిస్తాడు". భారతి ఇప్పుడు బీకామ్‌ కంప్యూటర్ సైన్స్‌ చదువుతూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. ఎంత బలమైన ప్రతికూలత ఉన్నప్పటికీ, మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గం దిశగా, కుటుంబం అందించే సానుకూల మార్గదర్శకత్వం మీ ఓటమిని విజయంగా మారుస్తుంది.

ఆమె కుటుంబం మరెవరో కాదు "వైదేహి ఆశ్రమం, భాగ్యనగర్". భారతి జీవితానికి కొత్త దిశానిర్దేశం, విశ్వాసం, మద్దతు ఇచ్చింది. వైదేహి ఆశ్రమం కేవలం ముగ్గురు అమ్మాయిలతో ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ ఆశ్రమం రకరకాల పరిస్థితులలో బాధితులైన 205 మందికి పైగా అమాయక బాలికలకు మద్దతునివ్వడమే కాకుండా, జీవితంలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

సంఘ స్వయంసేవక్ , వైదేహి సమితి కార్యదర్శి శ్రీ బాలకృష్ణ వివరిస్తూ, దివంగత శ్రీ టి.వి.దేశ్‌ముఖ్ జీ మార్గదర్శకత్వంలో, వైదేహి సేవా సమితి 1993లో సేవా భారతి యూనిట్‌గా భాగ్యనగర్ (హైదరాబాద్)లో మహిళలు,పిల్లల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ప్రారంభమైనది. ఆరేళ్ల తర్వాత అప్పటి అఖిల భారతీయ సేవా ప్రముఖ్ శ్రీ సూర్యనారాయణరావు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ ఆశ్రమం యొక్క నూతన భవనాన్ని మాననీయ సర్ సంఘచాలకులు శ్రీ మోహన్ రావ్ జీ భగవత్ 2000 సంవత్సరంలో ప్రారంభించారు.

వివాహానంతరం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న ఉమాదేవి.. ‘‘నేను వైదేహి ఆశ్రమంలో పెరగడం నా అదృష్టం.. నా 5 ఏళ్ల కొడుకు స్కూల్ పోటీల్లో స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించి ప్రథమ స్థానం సాధించాడు. , దీని పూర్తి క్రెడిట్ వైదేహి ఆశ్రమానికి చెందుతుందన్నారు", ఎందుకంటే చిన్నతనం నుంచి నృత్యం , సంగీతం , నాటకం , అభినయం , కరాటే , ఆటలు వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈరోజు నా ముగ్గురు పిల్లలు కూడా దాని ప్రయోజనం పొందుతున్నారు.

తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి, భవిష్యత్తు చీకటిలో ఉన్నప్పటికీ, కుమారి పి రంగమ్మ తన హస్తకళ, పేపర్ క్విల్లింగ్ మరియు ముత్యాల ఆభరణాలు లండన్ వీధుల మెప్పు పొందాయి. వైదేహి ఆశ్రమం సహాయం వల్లనే ఈ ఘనత సాధ్యమైంది అని ఆమె చెప్పింది. ఈరోజు రంగమ్మ కూడా ఈ ఆశ్రమంలో చిన్న పిల్లలకి యోగా, కరాటే, డ్యాన్స్, గానం, హస్తకళలు ఇలా అన్నింటిని నేర్పిస్తోంది.


నివాసితులను ఆప్యాయతతో ఆదరిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ఈ ఆశ్రమాన్ని మొదటి నుంచి చూసుకుంటున్న వైదేహి ఆశ్రమ అధ్యక్షురాలు ఎం.సీతా కుమారి గారు, ఎంతో ఆనందంతో చెబుతూ, ‘‘ప్రతి సంవత్సరం ఒక కళ్యాణం లేదా ఏదో ఒక ఉత్సవాన్ని ఈ ప్రాంగణంలో నిర్వహిస్తారు. దీనిలో మా కుమార్తెలు (పూర్వ నివాసితులు) మరియు వారి కుటుంబాలు కూడా ఆహ్వానింపబడుతున్నాయి. వారితో పాటు వారి పిల్లలు కూడా వస్తారు అప్పుడు ఒక పెద్ద కుటుంబం కలిసినప్పుడు వున్న ఆనందంతో వికసిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇక్కడ అమ్మాయిలు సేవా భారతి నిర్వహించిన హెల్ప్ లైన్ లో ప్రత్యేక పాత్ర పోషించారు.

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేని 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల బాలికలను వైదేహి ఆశ్రమం దత్తత తీసుకుంటుంది. సంతాన సాఫల్యం, ఉన్నత విద్య, సంస్కారాలు, జీవన నైపుణ్యాభివృద్ధి మరియు వ్యక్తిత్వ వికాసం వంటి పూర్తి బాధ్యతలను తీసుకుంటూ, వారిని సమాజానికి ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆశ్రమం కృషి చేస్తుంది. నాణ్యమైన విద్యను అందించడానికి, బాలికలందరూ శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుతున్నారు. ఇక్కడ ఈ బాలికలు క్రీడలు, సైన్స్ ఫెయిర్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన వాటిలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. వారికి సంస్కృతి, నైతికత మరియు జాతీయతపై కూడా అవగాహన కల్పిస్తారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా వివాహ బాధ్యత అంతా వైదేహి ఆశ్రమందే. ఈ రోజు ఈ ఆశ్రమంలోని 21 మంది కుమార్తెలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. వైదేహి ఆశ్రమం ఆడపిల్లల పెళ్లిలో తల్లిదండ్రులు నిర్వహించే ప్రతి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది మరియు నేటికీ ఈ ఆశ్రమం వారి పుట్టిల్లు లాగా ఉంది. 2021 వరకు వైదేహి ఆశ్రమంలో పెరిగిన 45 మంది అమ్మాయిల వివాహాలు జరిగాయి.


ఒకవైపు సమాజంలో ఆడపిల్ల అస్తిత్వం అనేది పోరాటం, సవాళ్లతో కూడిన ప్రయాణం అయితే మరోవైపు వైదేహి ఆశ్రమం వంటి సంస్థలు మండే ఎండలో ఓ పెద్ద చెట్టు నీడను తలపిస్తున్నాయి. ఇలాంటి సహృదయ సంస్థలు ఈ చిన్నారులను సమాజంలో ఎదగడానికి కావలసిన అన్ని కళల్లో నిష్ణాతులను చేసే దిశలో శతవిధాలుగా కృషి చేస్తున్నాయి.

1924 Views
अगली कहानी