सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

ఆశాజ్యోతి - యమగర్వాడి - ఒక ప్రత్యేక చొరవ

యమగర్వాడి | మహారాష్ట్ర

parivartan-img

అది మహారాష్ట్ర లోని ఒక చిన్న పల్లెటూరు, పగోడు. ఆ ఊరిలో ఒక హనుమంతుని గుడి. ఎప్పటి  లాగానే  రేఖ తన  తమ్మునితో ఆ గుడి ప్రాంగణంలో కూర్చుని, ఎవరైనా దయ గల దాతలు వచ్చి తమ ఆకలికి పట్టెడు అన్నం, చలి నుండి రక్షించుకునేందుకు ఏదైనా ఆధారం చూపకపోతారా అని ఆశగా ఎదురుచూస్తుంది. పగోడా గ్రామంలో పార్థి, డోబ్రి, కోలావటి, గోండి మహారాష్ట్ర లాంటి తెగలు విరివిగా దొంగతనాలు, దోపిడీలు లాంటి అసాంఘిక పనులతో జీవనం సాగించేవారు.


రేఖ తల్లిదండ్రులు కూడా పార్ధి తెగకు చెందినవారే. వారి మరణాంతరం రేఖ బంధువులు ఎవరూ వీరిని చేరదీయ లేదు, సరి కదా, సమాజం కూడా వీరిని దూరంగానే ఉంచింది. కానీ, ఆనాడు, దైవం మానుష రూపేణా అన్నది  నిజం చేస్తూ, రేఖ ప్రార్థనలు, ఎదురుచూపులు ఫలించి, వారి జీవితానికి మరియు వారి లాంటి ఎందరో అభాగ్యుల జీవితాలకు ఆసరా ఇచ్చేందుకై ముందుకొచ్చారు RSS వరిష్ఠ కార్యకర్త , పూర్వ ప్రచారక్, శ్రీ గిరీష్ ప్రభునే, వారితో పాటుగా మహదేవ్ గైక్వాడ్, చంద్రకాంత్ ఘడేకర్ మరియూ రావు సాహెబ్ కులకర్ణి. వారి సహృదయ సహాయ సహకారాలతో రేఖతో పాటు తనలాంటి మరో 350 మంది అభివృద్ధి మండలి పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా, క్రీడలు, నటన లాంటి వివిధ రంగాల్లో స్థిర పడ్డారు. ఈ విధంగా గత పాతిక సంవత్సరాలుగా సంఘ్, ఈ పిల్లల బాధ్యతలను నిర్వహిస్తున్నది. ఇదే విధంగా మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్ తాలూకా యమఘర్ వాడి లోని స్వయంసేవకులు ఇటువంటి పిల్లలను చేరదీసి అపారమైన  సేవ చేస్తున్నారు.


 ఈ రోజున రేఖ రాష్ట్రస్థాయిలో చదరంగంలో విజేతే కాకుండా, ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఉద్యోగంలో స్థిరపడింది. రేఖ తమ్ముడు పదవ తరగతిలో 85% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అంతేకాదు, ఈ రోజున అవే తెగల నుండి వచ్చిన 32 మంది ఆడపిల్లలు వివిధ ఆస్పత్రులలో నర్సులుగా స్థిరపడ్డారు.


పార్ధి తెగకు చెందిన మరొక యువకుడు పరమేశ్వర్ కాలే, సంఘ స్వయంసేవకుల సహకారంతో హాస్టల్ లో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా అదే తెగకు చెందిన ఎంతోమంది పిల్లలకు విద్యను బోధిస్తున్నారు. అయితే ఇందరి విజయాలు ఒక్క రోజులో సాధించినవి కాదు. మేకలు కాస్తూ, పిట్టలు కొట్టుకుంటూ కాలం గడపడం, మాంసాహారం లేకుండా రోజు గడవక పోవడం, కాలకృత్యాల ధ్యాస లేకపోవడం, అవకాశం దొరికితే హాస్టల్ నుండి పారిపోవడం, అలాంటి పరిస్థితుల నుండి ఈ పిల్లలు ఈ రోజున ఒక నియమం, క్రమశిక్షణ ప్రకారం హాస్టల్లో ఉంటూ, చక్కగా యోగా, వ్యాయామాలు చేసుకుంటూ, సమయానుసారం బ్యాంకులు ఇత్యాది పోటీ పరీక్షలకు సిద్ధం అవడమే కాక ప్లంబింగ్, ఎలక్ట్రికల్ లాంటి వృత్తి విద్యలో కూడా శిక్షణ పొందుతూ, సంఘ్, సమాజం గర్వించే స్థితికి చేరుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం.

945 Views
अगली कहानी