सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

చీకటి జీవితాలలో వెలుగు నింపిన జంట

అవంతి మర్ల | మెహసానా | గుజరాత్

parivartan-img

మీఠా రామ్ గారు తన బాల్యంలోని చీకటి ఙ్ఞాపకాలను తలుచుకున్నపుడు ఎదో తెలియని ఆందోళన చెందుతారు. మెహసానాలో తన  8 ఏళ్ల అన్నయ్య, 6 ఏళ్ల తమ్ముడు పింటూ మరియు తల్లితో కలిసి, రోడ్డు పక్కన పేవ్‌మెంట్‌  పైన పడుకున్న రోజులను గుర్తుచేసుకుంటూ తాను, ఆకాశం లోకి చూస్తూ  సమాధానాలు లేని ప్రశ్నల గురించే ఆలోచిస్తూ గడిపిన ఆ నిద్రలేని రాత్రులను గుర్తుచేసుకుంటారు. ప్రతి ఉదయం నేరాలు మరియు మాదకద్రవ్యాల సుడి నుండి తప్పించుకుంటూ తాను తన  సోదరుడి చిన్న హస్తాలతో ఒక గిన్నె ను తాయారు చేసారు. ఆ గిన్నె లో కొంతమంది తిట్లు మరికొంతమంది కొన్ని నాణేలతో నింపేవారు. ఒకప్పుడు భిక్షాటన చేసే రెండు చేతులు భిల్వారాలోని దేవ్ నారాయణ్ హోటల్‌లో రుచికరమైన వంటలు తయారు చేస్తూ అందరి కడుపు నింపుతున్నాయి. ఆయన ఇది  ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు.


తన జీవితంలోని ఈ అద్భుతమైన మార్పుకు సంఘ్ స్వయంసేవక్, 66 ఏళ్ల శ్రీ జయంతిభాయ్ మరియు అయిన ఆయన సతీమణి అరుణా బెన్‌లు కారణమని మీఠారామ్ గారు చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడరు. గుజరాత్‌కు చెందిన ఈ వృద్ధ దంపతులు వరదలు, భూకంపాలు, కరోనా వంటి అనేక విపత్తులలో చాలా రోజులుగా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉంటూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సాధారణంగా ఏ వయసులో అయితే ప్రజలు సహాయంకోసం ఎదురుచూస్తారో ఆ వయసులో జయంతిభాయ్ మరియు అరుణా బెన్ లు గుజరాత్‌ మెహసానా లో "చైల్డ్ బెగ్గర్ ఫ్రీ ఎడ్యుకేటెడ్ సొసైటీ" కార్యక్రమాన్ని ఆరంభించారు. 2000 సంవత్సరం నుంచి మెహసానాలో నడుస్తున్న ఈ ప్రకల్పం కింద నేడు దాదాపు 245 టెంట్లు నిర్మించామని జయంతి భాయ్ చెప్పారు. ఒకప్పుడు అడుక్కుని పొట్టనింపుకొనే ఈ పిల్లలు ఇప్పుడు  సొసైటీ సహకారంతో ఈ గుడారాల్లో నే ఉంటూ చదువు పూర్తి చేస్తున్నారు. వారి బస మరియు చదువుకు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. ఇక్కడ నివసించే చిన్నారుల జీవితాలకు దిశానిర్దేశం చేయడంతో పాటు నేర చరిత, భిక్షాటనల నుండి దూరంగా ఉంచుతూ స్వయం సమృద్ధితో ఎదగడానికి సహాయసహకారాలు అందచేస్తున్నారు.

గుజరాత్‌కు చెందిన ప్రాంత సేవా ప్రముఖ్ అశ్విన్ జడేజా ఇలా అన్నారు

1984 నుండి 1992 వరకు, పాలన్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నగర కార్యకర్తగా ఉన్న శ్రీ జయంతిభాయ్ పటేల్ 2000 వరకు చిన్న తరహా పరిశ్రమల శాఖలో లఘు ఉద్యోగ్ భారతి లో పనిచేశారు. పాలన్‌పూర్‌లోని వివిధ్ లక్ష్య విద్యా మందిర్ విద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన పిల్లల పట్ల చాలా సున్నితంగా ఉండేవారు. ఆరావళి పర్వత శ్రేణులలో నివసించే వనవాసి పిల్లలు బాణాలు మరియు విల్లులతో వివస్త్రలుగా తిరుగుతూ ఉండటం చూసి సేవాదృక్పథం కలిగిన ఈ దంపతుల హృదయం చలించిపోయింది. ఆ సమయంలో ప్రతి సోదరి నుండి నెలకు 10 తీసుకొని సుమారు 500 మంది సోదరీమణులతో ఒక మండలి  ఏర్పాటు చేసి మురికివాడలలో పిల్లలకు బాల సంస్కార కేంద్రాలను ప్రారంభించారని అరుణా బెన్ చెప్పారు. ఆ కేంద్రం నేడు పాలన్‌పూర్‌లోని ఉత్తర గుజరాత్ పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్‌గా పిలువబడుతోంది. ప్రస్తుతం, ఇక్కడి హాస్టల్‌లో సుమారు 250 మంది వనవాసీ పిల్లలు ఉచితంగా  సమగ్ర వికాసం యొక్క ప్రయోజనం పొందుతున్నారు.


నిజమైన స్వయంసేవక్ నేత్రాలు ఎల్లప్పుడూ సేవ చేయడం కోసం వెతుకుతూనే ఉంటాయి. 2000వ  సంవత్సరంలో మెహసానాకు వచ్చిన తర్వాత, జయంతీభాయి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై అడుక్కునే పిల్లలను చూసి అయన మనస్సు కలత చెందిందిఆకలి కడుపు చేతులు చాచమని బలవంతం చేస్తుంది, లేకుంటే భిక్షాటన చేసి ఆనందించేదెవరు??? ఇలాంటి కొన్ని ప్రశ్నలను ఛేదించి, 6 నుండి 15 సంవత్సరాల వయస్సు గల వివిధ నగరాలు మరియు రాష్ట్రాల నుండి 18 మంది పిల్లలపై ఒక సర్వే నిర్వహించారు. సంప్రదింపుల ద్వారా, జిల్లా కలెక్టర్ ఆమోదంతో, ప్రభుత్వ భూమిలో 16 టెంట్లు నిర్మించబడ్డాయి, అక్కడ 45 మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో నివసించడం ప్రారంభించారు. వారికి చదువుపై అవగాహన కల్పించేందుకు తగిన పాఠశాలల్లో చేర్పించారు. నేడుభిక్షాటనను విడిచి పెట్టి ప్రతి సంవత్సరం ఈ గుడారాల నుండి 300 మందికి పైగా పిల్లలు పాఠశాలకు వెళుతున్నారు, వారికి కొత్త స్కూల్ డ్రెస్, షూస్, స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలను జయంతిభాయ్ మరియు అరుణా బెన్ చాలా ఉత్సాహంతో ఏర్పాటు చేస్తారు మరియు వారు సంవత్సరానికి ఒకసారి ఎడ్యుకేషనల్ టూర్ కి కూడా తీసుకువెళతారు. గత 20 ఏళ్లుగా అమలవుతున్న ఈ పథకం వల్ల మీఠారాంలాగా అబ్బాయిలు, అమ్మాయిలు ,కుక్‌లు, డ్రైవర్లు, ప్లంబర్లుగా మరియు మరియు వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తూ తమ కాళ్లపై తాము నిలబడి  200 మంది యువతకు స్ఫూర్తి, ధైర్యాన్ని అందించారు.తమను తాము నిలబెట్టుకుంటూ ఇతరులకు సాయపడుతూ స్వయంశక్తిగా వారు మారారు.


నేడు 10 కంటే ఎక్కువ కుటుంబాలు సొంత ఇంట్లో నివసిస్తున్నారు ఇక 22 కుటుంబాలు ఈ దిశగా కదులుతున్నాయి. సేవాభావం ఉన్న వ్యక్తికి ప్రతి రంగం స్ఫూర్తిదాయకం. ప్రతి సంవత్సరం 20,000 కంటే ఎక్కువ చెట్లను బహిరంగ ప్రదేశాల్లో నాటడం, మొదటి నుండి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం లాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం వలన  2016లో, శ్రీ జయంతిభాయ్ పటేల్‌ను గుజరాత్ ప్రభుత్వం గ్రీన్ బ్రిగేడియర్అవార్డుతో అలంకరించింది.

ఇక ఆహార ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న అరుణ జీ వారికి పరిచయం ఉన్న ఒకరి పెళ్లి వేడుకలో మిగిలిపోయిన పరిశుభ్రమైన ఆహారాన్ని చూసి వారిలో ఓ కొత్త ఆలోచన పుట్టింది. దాంతో 2015లో వారు అక్షయ్ రథ్ ను  ప్రారంభించారు. అక్షయ్ రథ్ యొక్క ముఖ్య ఉదేశ్యం ఒక కారు ద్వారా ఏదైనా పెద్ద వేడుకలో మిగిలిన పరిశుభ్రమైన ఆహారం సేకరించి, పేదలకు మరియు మురికివాడల నివాసితులకు 2 గంటల్లో ఆహారం పంపిణీ చేయబడుతుంది. ప్రతిరోజూ 500 నుండి 5000 మందికి అక్షయరథ్ ద్వారా వివిధ ప్రాంతాలలో ఆహారం పంపిణీ చేయబడుతుంది. ఇది అక్షయ్ రథ్ హెల్ప్‌లైన్ నంబర్ ప్రాచుర్యం యొక్క ఫలితం. చుట్టుపక్కల 5 నుండి 6 నగరాల్లో ఆహారానికి సంబంధించిన అన్ని సంస్థలు మరియు వ్యక్తుల ద్వారా అదే తరహాలో పనులు జరుగుతున్నాయి. సేవే సేవ చేయాలనే స్ఫూర్తిని నింపుతుంది, అందుకే ఈరోజు మెహసానాలో దాదాపు 60 మంది జయంతిభాయ్‌ని చూసి నిస్వార్థంగా సేవలో సహకరిస్తున్నారు.

"భిక్షాటన చేయకూడదు" అనే వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయితే గుడారాలు వేసి ఆశ్రయం ఇచ్చి, చేతులు పట్టుకుని ఆత్మగౌరవం, స్వావలంబన బాటలు చూపేవారు, సమస్యలను మూలాల్లోంచి అంతం చేసే దేశభక్తులు, సేవాభావం కలవారు కొంతమందే వుంటారు.

461 Views
अगली कहानी