सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

మొహద్ : ఒక ఆదర్శ గ్రామం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

ఈ గ్రామంలో ప్రవేశించగానే ఒక ప్రత్యేకత కలిగిన గ్రామానికి వచ్చాము అనిపించింది మాకు. ప్రతి ఇంటి తలుపు మీద "ఓం" మరియు "స్వస్తిక్" గుర్తులు వేయబడి వున్నాయి, గోడలమీద మంచి బోధనలు వ్రాయబడి వున్నాయి, కొన్ని చోట్ల విశ్వంలోని వింతలు వ్రాసి వున్నాయి, అంతే కాక కొన్నిచోట్ల గ్రామప్రజలు సంస్కృతంలో పలకరించుకుంటున్నారు.

మేము ఈ గ్రామం లోని 50 వృత్తి పరిశ్రమలను దర్శించగా, పశువుల పేడతో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తయారు చేయడం చూడగా, మొహద్ గ్రామం సంస్కృతిని, సంస్కృతాన్ని అద్భుతంగా అనుసంధానం చేసుకున్న ఒక పురాతన వేద నిలయంలా తోచింది., మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లాలో కరెలి తాలూకా కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది మొహద్ గ్రామం. ఒక ఆదర్శ గ్రామానికి వుండవలసిన ప్రమాణాలన్ని కలిగివున్న ఈ గ్రామం, అఖిల భారతీయ గ్రామీణ వికాస్ మాజీ అధిపతి శ్రీ సురేంద్ర సింగ్ చౌహాన్ గారి కలలకు ప్రతిరూపం. సంఘ్ శాఖ మరియు స్వయంసేవకులు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి చేసిన పరిశ్రమకు కలిగిన ఫలం. శుభ్రమైన వీధులు, లేత పచ్చని చెట్ల వరుసలు, ఆట మైదానాలు, పచ్చని పొలాలు ఇవన్నీ సందర్శకులకు ఆ గ్రామం గురించి చెప్పకనే చెబుతాయి.


స్వచ్చ భారత్ లోని అంశాలు, బహిర్భూమి మలవిసర్జన నివారణ వంటివి మొహద్ గ్రామంలో ముందు నుండే అమలులో ఉన్నాయి. వీధులను శుభ్రంగా వుంచడం కోసం ప్రతి ఇంటి ముందు ఒక ఇంకుడు గుంత వుంది, మురికి నీరు నిలువ ఉండేందుకు చక్కని డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించబడి వున్న గ్రామం మొహద్.  ప్రతి ఇల్లు ఒక మరుగుదొడ్డి ని కలిగి వుంది. సేవా భారతి 230 కుటుంబాల కోసం మరుగుదొడ్లను నిర్మించగా, మిగిలినవి కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద నిర్మితమైనవి. ఈ గ్రామంలో ప్రత్యామ్నాయ ఇంధనం కింద దాదాపుగా ప్రతి కుటుంబము గోబర్ గ్యాస్ ను ఉపయోగిస్తోంది. రాష్ట్రంలో విద్యుత్తు కొరత ఉన్నప్పుడు ఇంటి దీపాలకు కూడా గోబార్ గ్యాస్ ను వాడేవారు, కానీ ఇప్పుడైతే ప్రతి ఇంట్లొ వంటపనికి వాడుతున్నారు. 

కుట్టుపని, బొమ్మలతయారి, ఫోటో ఫ్రేములు కట్టడం, మట్టి కుండలు చేయడం, దొన పట్టాలు చేయడం, మోటార్లు చుట్టడం, కుర్చీలు అల్లడం, అగరబత్తీల తయారీ, టీ వీ, రేడియోల మరమ్మతులు, శిల్పఖండాలను చేయడం వంటి కుటీర పరిశ్రమల వలన మొహద్ గ్రామంలో నిరుద్యోగ సమస్య సమసిపోయింది. రైతులు సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేస్తూ ఆదాయాన్ని పెంచుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ లో బంగారు పథకాన్ని పొందిన మాజీ సర్పంచ్ మరియు ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవక్ శ్రీ జవహర్ సింగ్ చెప్పినదాని ప్రకారం, ఈ రోజున గ్రామంలోని 850 కుటుంబాలు ఉద్యోగాలు కలిగి వున్నాయి మరియు 90శాతం ప్రజలు విద్యావంతులు. వీరిచే 17 కిలోమీటర్ల మేరకు స్థిరమైన రహదారి వేయబడింది. కులాలు, పక్షపాత ధోరణి అన్న మాటే తమ గ్రామంలో వినపడవని జవహర్ గారు సంతోషంగా చెబుతారు. నిజానికి, గ్రామ ప్రజలు నిర్వహించే "ఆదర్శ హిందూ కుటుంబం" పోటీలలో తరచూ దళిత కుటుంబాలే గెలుస్తుంటాయి!

853 Views
अगली कहानी