सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

తుఫాను భాధితుల ఆశా కిరణం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

సైఫ్ఉద్దిన్ కు టార్పాలిన్ సీట్లను అందిస్తున్న స్వయం సేవకులు    బాధితులకు ఆహారాన్ని అందిస్తున్న స్వయం సేవకులు

11 ఏప్రిల్లో జరిగిన 17వ సాధారణ ఎన్నికల ఫలితాల కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్న వేళ, ఎక్కడో ఉన్న పశ్చిమ సుమాత్రా వద్ద హిందూ మహాసముద్రం లో చెలరేగిన అలజడి కారణంగా ఒరిస్సాకి గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఫోణి అనే తుఫాను ప్రారంభం అయింది, ఈ తుఫాన్ 2 మే 2019 వరకు తారాస్థాయికి చేరింది.

ఫోణి తుఫాన్ అంచనాలకు అందని విధంగా విధ్వంసం సృష్టించింది. కటక్, భువనేశ్వర్, ఖుర్దా, పూరి మొదలైన జిల్లాలలో ప్రభావం ఎక్కువగా పడింది. ఈ తుఫాను వల్ల 64 మంది ప్రాణాలు కోల్పోగా 65 వేల పశువులు ప్రాణాలు విడిచాయి. 1.5 కోట్ల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. సుమారు 1.5 లక్షల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. చాలా గ్రామాల్లో రైతులు ఇళ్ళు,పంట పొలాలను కోల్పోయారు. ప్రకృతి విలయతాండవం సంభవించిన ప్రాంతాల్లో ఎప్పటిమాదిరిగానే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు స్పందించి సహాయక చర్యలు మొదలుపెట్టారు.


ఒడిస్సా లోని ఉత్కల్ బిపన్నసహాయక సమితి 1500 స్వయంసేవకుల సహాయంతో ఎన్నో సహాయక చర్యలు చేపట్టారు. ఉత్కల్ సమితి ప్రజలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి 96 వేల మంది ప్రజలకు సహాయం అందించారు,1.2 లక్షల టార్పాలిన్  షీట్లతో తాత్కాలిక వసతి గృహాలను నిర్మించి 4 లక్షల దోమతెరలు అందించారు.కానీ...అవి అక్కడి 4% ప్రజలకు మాత్రమే సరిపోయాయి అని బిజయ్ స్వేన్ వివరించారు. భువనేశ్వర్,కటక్,పూరి మరియు ఒడిస్సా లోని ఇతర ప్రాంతాలకు విద్యుత్ అంతరాయం వల్ల సౌర దీపాలు అవసరం ఏర్పడింది. భువనేశ్వర్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలిపట్నా ప్రాంతంలో ఉన్న తమలపాకుల పంట పూర్తిగా ధ్వంసమైంది. బలిపట్నాలో ఎక్కువగా ముస్లిం ప్రజలు నివసిస్తారు,వారికి కూడా స్వయం సేవకులు టార్పాలిన్ షీట్లు,బట్టలు మరియు దోమతెరలు అందించారు.అక్కడి నివాసులైన సైఫ్ఉద్దిన్ ఖాన్ స్వయంసేవకుల సహాయానికి విస్మయం చెందారు. ఆర్ఎస్ఎస్ ముస్లింలకి వ్యతిరేకం అని భావించే వారు కూడా వారి సహాయక చర్యలను చూసి ఆశ్చర్యపోయారు.


ఈ విపత్తు బారినపడిన ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా స్థిరమైన జీవనోపాధిని కలిగించే ఏర్పాట్లు చేయాలి. సంఘ్ యొక్క తూర్పు ప్రాంతానికి చెందిన సేవా ప్రముఖ్ శ్రీ జగదీష్‌జీ మాట్లాడుతూ, తక్షణ మరియు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, సంఘ్ ఉపాధిపై శ్రద్ధ చూపుతోంది. ఆ దిశగా సమీప భవిష్యత్తులో ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా వారికి జీడిపప్పు, కొబ్బరి మరియు తమలపాకు మొక్కలను అందించింది. ప్రభుత్వ భూములలో చందనం చెట్లను నాటించే ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే టార్పాలిన్ షీట్లను పంపిణి చేయాలి. దట్టమైన అడవులు పొడవైన చెట్లు ఒడిశాలోని తీర ప్రాంతాలకు రక్షణగా ఉండే చెట్లు ఈ తుఫాను వల్ల ధ్వంసం అయ్యాయి. సంఘ్ పరివార్ ఆ అడవిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తోంది. తీర ప్రాంత వాసుల 50 కుటుంబాలకు పడవలు అందించారు ఇంకా అందించే ప్రయత్నం చేస్తున్నారు. తమలపాకులు పండించే 600 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. UBSS డాక్టర్లతో, హెల్త్ వర్కర్లు,14 అంబులెన్స్ లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. నిరంతర వైద్య సేవలను అందించే విధంగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.


   " నష్టం విధ్వంసకర మైనది కానీ మనం మన ధైర్యాన్ని పెంచుకొని వీలైనంత సహాయం అందించాలి" 

876 Views
अगली कहानी