सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

నిస్వార్థ సేవకు మరో ఉదాహరణ

అవంతి మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

అగ్నికి ఆకలి ఎక్కువ, పంచభూతాలలో ఒకటైన అగ్ని యొక్క భయంకరమైన రూపాన్ని చుస్తే మనిషి నిస్సహాయుడై పోతాడు. కానీ కొన్నిసార్లు మనిషి చూపించే ధైర్యం ముందు అగ్ని కూడా తలవంచుతుంది. అవును అలాంటి ఘటన గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి కాలిపోతున్న 48 మంది పిల్లలను రక్షించకపోతే, నవంబర్ 23, 2017 ఇండోర్ (మధ్యప్రదేశ్) లో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి MY ఆసుపత్రి  చరిత్రలో నల్ల సిరాతో వ్రాయబడి ఉండేది.

చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగడంతో అంతా ధ్వంసం కాకముందే ముగ్గురు వ్యక్తులు వార్డు అద్దాలు పగులగొట్టి పిల్లలను బయటకు తీయడం ప్రారంభించారు. వీరిని చూసి మిగతా ఆసుపత్రి సిబ్బంది కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దినేష్ సోని, రమేష్ వర్మ మరియు గజేంద్ర రాసిలే, ముగ్గురూ ఆసుపత్రిలో పేద రోగుల కోసం సేవా భారతి సేవా ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. నిరుపేద, నిస్సహాయ రోగులకు మెడికల్ టెస్ట్స్ నుండి చికిత్స వరకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి, సేవా భారతి ఇండోర్ ఆసుపత్రి ఆవరణలో సేవా భారతి సేవా ప్రకల్పం పేరుతో గత మూడు సంవత్సరాలుగా హెల్పింగ్ సెంటర్ను నిర్వహిస్తోంది. ప్రాజెక్ట్ కింద, సహారా వార్డులోని ప్రతి నిరుపేద రోగికి అన్ని విధాలుగా సహాయం చేస్తారు.


నవంబర్ 23 గురించి మాట్లాడుతున్నప్పుడు గజేంద్ర రసిలే ఉద్వేగానికి లోనయ్యారు. మంటల శబ్ధం విని ఇద్దరు సహచరులతో కలిసి వార్డు దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా గందరగోళం, పిల్లలు భయంతో కేకలు వేయడం, కుటుంబ సభ్యులు ఆందోళనతో నిస్సహాయంగా ఏడుస్తూ ఉండడం చూసి, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముగ్గురూ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ICU లో పిల్లలను ఖాళీ చేయడం ప్రారంభించారు వెంటనే అక్కడే ఉన్న మిగతా అందరు సహాయం అందించడంతో, మొత్తం 48 మంది పిల్లలను మంటల నుండి రక్షించారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరు నిరుపేద రోగుల సంరక్షణ కోసం తమ సమయాన్ని వెచ్చిస్తారు. బహుశా కార్యకర్తలలో ఉన్న సేవా భావమే మంటలను అదుపుచేయగలిగే ధైర్యాన్ని ఇచ్చిందని ప్రాజెక్ట్ ఇన్చార్జి మహేంద్ర జైన్ అన్నారు. ప్రాజెక్ట్ లో ముఖ్యంగా ఎవరైనా రోగులను వారి సొంత బంధువులు ఆసుపత్రి లో విడిచిపెడితే రోగుల సంరక్షణను వీరు చూసుకుంటారు. ప్రాజెక్ట్ ఒక సొంత అంబులెన్స్ను కూడా కలిగి ఉంది, ఇది ఇండోర్లోని ప్రతిచోటా గాయపడిన రోగుల కోసం 24 గంటల పాటు పనిచేస్తుంది. ప్రాజెక్ట్ లో భాగంగా రోగులందరినీ అత్యంత గౌరవంగా చూసుకుంటారు. అందుకే, సేవా భారతి నిర్వహిస్తున్న సేవ నిస్వార్థ సేవకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.

569 Views
अगली कहानी