सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

విధ్వంసం నుండి అభివృద్ధి కి చేరిన లడఖ్ కథ

సుబ్రహ్మణ్యం నేమాని | లడఖ్ | మధ్యప్రదేశ్

parivartan-img

దేవతల భూమి అని పిలుచుకునే లేహ్-లడఖ్‌లో ఎలాంటి విపత్తు సంభవిస్తుందో తెలియక హాయిగా నిద్రిస్తున్న ప్రజలపై, అర్ధరాత్రి వర్షం నీరు  ప్రళయం లా విరుచుకుపడింది. ఆగస్ట్ 5, 2010న అకస్మాత్తుగా మేఘాల విస్ఫోటనం కారణంగా వరద రూపంలో నీరు వచ్చి రోడ్లుపచ్చని పంటలను నాశనం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్లను కూడా తీసుకొచ్చింది. పర్వతం మొత్తం నీళ్లతో కిందకు దిగినట్లుగా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లతో పాటు ప్రజలు నిద్రలోనే కిలోమీటర్ల మేర కొట్టుకుపోయారు. కొన్ని గంటల్లోనే 600 కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి "జిగ్మీత్ టప్కా" చెబుతున్నారు. కానీ దేవుని దయ వల్ల సమీపంలోని 'చోగ్లాంసర్‌' లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షా వర్గ కు ఈ విషాద వార్త చేరింది. జమ్మూ కాశ్మీర్ సేవా భారతి ప్రాంత సంఘటనా మంత్రి 'జైదేవ్ సింగ్' మాట్లాడుతూ, "అక్కడ శిక్షా వర్గ ముగించి, బాధితులకు సహాయం చేయడానికి స్వయంసేవకులు అందరూ లడఖ్ వెళ్లారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి, ఈ స్వయంసేవకులు ఆహారం, నీరు అందించడం ద్వారా 27 మంది ప్రాణాలను కాపాడారు, పైగా వెంటనే మందులు, దోమతెరలు మరియు పడకలు మొదలైనవిఏర్పాట్లు చేశారు." అని చెప్పారు.


ఇది మాత్రమే కాదు, లడఖ్ కళ్యాణ్ సంఘ్‌తో పాటు సేవాభారతి కూడా ప్రజల స్వావలంబన కొరకు ఉపాధి శిక్షణను అందించే పనిని ప్రారంభించింది.

ఐదు లోయలతో చుట్టుముట్టబడిన లేహ్ లడఖ్ అందం అందరినీ ఆకర్షిస్తుంది. కానీ పన్నెండు నెలల పాటు మంచుతో కప్పబడిన పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ లామా ల భూమి ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ స్వావలంబన మరియు పునరావాసం చాలా కష్టంగా మారుతుంది. అందుకే చిన్న చిన్న ఉద్యోగాలు కల్పించడం ద్వారా దీన్ని ప్రారంభించారు. క్షురకులకు కటింగ్ చైర్లు, టైలర్లకు కుట్టు మిషన్లు, భోజనం తయారు చేసే వారికి పాత్రలు, కార్పెంటర్లకు పనిముట్లు అందజేశారు. లడఖ్‌లో, గృహిణులు 'స్ప్రింగ్ వాటర్‌'తో నడిచే రాంటాక్ యంత్రాలతో పిండి మరియు సత్తును రుబ్బుతారు. 250 ర్యాంటాక్ మిషన్లు వరదలో కొట్టుకుపోగా, సేవాభారతి 90 మందికి ర్యాంటాక్ యంత్రాలను అందించింది.


ఒక్క చోగ్లాంసర్‌లోనే 240 ఇళ్లు కొట్టుకుపోయాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు పూర్తయిన తర్వాత వెనుతిరిగాయి, అయితే సేవా భారతి ఈ నిరాశ్రయులైన వారికి ఇళ్లను అందించాలని నిర్ణయించుకుంది. ఇది మాత్రమే కాదు, చోగ్లాంసర్‌లోని నిర్వాసితుల కోసం హిల్ కౌన్సిల్ (ప్రభుత్వం) నిర్మిస్తున్న సోలార్ కాలనీలో, సేవాభారతి వైద్య సహాయ కేంద్రాన్ని మరియు బహుళ ప్రయోజన సేవా గృహాన్ని కూడా నిర్మించింది. 100 ఇళ్లు నిర్మించి, ప్రభుత్వ పాఠశాలకు పుస్తకాలు, యూనిఫాంలు, వాటర్ ట్యాంక్‌లు అందించి బాధితుల పునరావాసానికి "సేవాభారతి" సహకరించిందని ఇక్కడి ప్రముఖ అధికారి 'టెన్సింగ్ దోర్జ్యా' చెప్పారు. విపత్తు అనంతర పునరావాసం యొక్క ఈ మొత్తం ప్రయాణంలో, స్వయంసేవకులు పొలాల్లోని చెత్తను JCB లతో తొలగించడం నుండి మృతదేహాలను దహనం చేయడం వరకు అన్ని పనులను సమర్ధవంతంగా నిర్వహించారు. అప్పటి విభాగాధిపతి బిజయ్ చిగల్‌మట్టవివరిస్తూ, "ప్రాథమిక శిక్షా వర్గకి వచ్చిన సంఘ్ స్వయంసేవకులు క్షణం కూడా తీరికలేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి, సహాయం చేయడంలో పాలుపంచుకోవడం మరియు 27 మందిని రక్షించడం అనేది శాఖ యొక్క ఆచారమే. విపత్తు సంభవించి దశాబ్దం గడిచినా, బాధిత కుటుంబాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి.

361 Views
अगली कहानी