नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
ఇండోర్ | మధ్యప్రదేశ్
17 ఏళ్ల వయస్సు లోకాన్ని విడిచే వయసు కాదు, కానీ అతను మృత్యువు ముందు సవాలుగా నిలిచాడు. ఖాళీ డబ్బాలు, కర్రల సహాయంతో పసిపిల్లలను మృత్యువు కౌగిలి నుంచి రక్షించాడు. ఆగస్టు 7 2005న ఇండోర్ పట్టణం మారుతి నగర్ నుండి 17 ఏళ్ల మనోజ్ చౌహాన్ అంతిమయాత్ర మొదలవ్వగానే మొత్తం నగరం కన్నీటి వాన కురిపించింది. దాదాపు రెండు రోజులపాటు ఏఇంటిలో పొయ్యి కూడా వెలిగించలేదు. మనోజ్ చౌహాన్ ను కోల్పోయామన్న బాధలో, కన్నీళ్లతోనే వారు తమ ఆకలిని తీర్చుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు నేషనల్ బ్రేవరీ అవార్డుతో సత్కరింపబడిన అమరవీరుడు మనోజ్ చౌహాన్ కథ యువతకు దేశం కోసంబ్రతకడం నేర్పుతుంది. యవ్వనపు ఉరకలతో రంగురంగుల ప్రపంచంలో అడుగు పెట్టే 17 సంవత్సరాల వయసులో అతను 18 మంది పసిపిల్లల ప్రాణాలు కాపాడి తనువు చాలించాడు.
ఆగష్టు 01, 2005న వర్షం జల ప్రళయంగా మారి ఇండోర్‌లోని దిగువ ప్రాంతాలలోకి భారీగా వర్షపు నీరు చేరింది. బాన్గంగా లోని సావెర్ రోడ్డులో ఉన్న అనేక మురికివాడల్లో మారుతీ నగర్ ఒకటి. ఈ బస్తీ లో వరద ప్రవాహానికి పాత్రలు, మంచాలు, దోమతెరలతో పాటు చిన్న పిల్లలు సైతం నీటిలో కొట్టుకుపోయేటట్టుగా ఇళ్లలోకి నీరు చేరింది. జలప్రళయంలో చిక్కుకున్న చిన్నారుల విషయం తెలుసుకున్న మనోజ్ చౌహాన్ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా తన తోటి సంఘ సభ్యులైన భవన్ పాండే మరియు సురేష్ బాతా సహాయంతో నీటి ప్రళయంలో కొట్టుకుపోతున్న బస్తీ పిల్లలు మరియు ప్రజలను కాపాడేందుకు ఉపక్రమించాడు. ఖాళి డబ్బాలు, చిన్నచిన్న రబ్బరు తాళ్ల సహాయంతో తన వంతు ప్రయత్నం కొనసాగించాడు ఒకవైపు తన శాఖాధికారి ఆనందమిశ్రా తనను పదేపదే హెచ్చరిస్తున్న తన గుండె కవాటాలు పూర్తిగా మూసుకుపోతున్న అతను వాటిని లెక్క చేయలేదు ఆ క్షణం అతనికి వినపడుతోందల్లా ఒక్కటే "సేవా హై యగ్నకుండు సమిద సమ్ హమ్ జలే" అంటే సేవ అనే యజ్ఞంలో సమిధులై మనం వెలగాలి. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మనోజ్ చౌహాన్ 18 మందినిన కాపాడగలిగారు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అతని ఊపిరితిత్తుల్లో చేరిన నీరు అతనిని భయంకరమైన నిమోనియా బారిన పడేలా చేసింది. అయినప్పటికీ, మరుసటి రోజు అతను టౌన్‌షిప్‌లోని కుటుంబాల అవసరాల జాబితాను తయారు చేయడం మరియు రేషన్ మరియు ఇతర వస్తువులను పంపిణీ చేయడంలో నిమగ్నమయ్యాడు.18 మంది జీవితాల్లో వెలుగులు నింపిన వీరుడు ఆసుపత్రి లో చేర్చిన రెండురోజుల తరువాత చావు అనే చీకటిలో అంతర్లీనుడైనాడు.
శారీరకంగా వికలాంగుడైన తండ్రి ఉంరావు సింహ్ చౌహాన్, మానసికంగా కృంగిన తమ్ముడు సోను, విలపిస్తున్న తల్లిని వదిలి మనోజ్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు అనే విషయం తెలిసేసరికి ఆ వాడలో రెండు రోజులు ఎవరి ఇంటిలో పొయ్యి మండ లేదు, ఎవరు ఎంగిలి పడలేదు. అదే కాలనీలో నివసించే లక్ష్మీదేవి మనోజ్ ను గుర్తు చేసుకుంటూ " ఆ బిడ్డ దేవుడు పంపిన దూత అని, తన ఏడేళ్ల మనవడిని నీటిలో నుంచి కాపాడాడని చెప్పుకొచ్చింది". మనోజ్ చనిపోయిన సమయంలో అతను ధరించిన దుస్తువుల నుండి తాను సహాయం అందించాల్సిన వారి వివరాల చీటీ ఒకటి కనుగొనబడింది ఇది అతని సేవా గుణాన్ని ప్రదర్శిస్తుంది.
2007లో మనో చౌహాన్ అద్వితీయ అసమాన ధైర్యసహసాలను గుర్తించి భారత బాలల సమితి అతనిని సత్కరించాలనినిర్ణయించినప్పుడు మనోజ్ ఈ లోకాన్ని వదిలి రెండు సంవత్సరాలు గడిచింది. ఈ అవార్డు కోసం మనోజ్ ను ఎంపిక చేయమనిరాష్ట్రపతికి లేఖ రాసినప్పుడు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రాధేశ్యాం సోమని మరియు డాక్టర్ శైలేంద్ర జైన్ మనోజ్ ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఏనుగు అంబారీ ఎక్కి ఊరేగనప్పటికీ అతను జన హృదయాల్లో ఎల్లప్పుడూ మనసున్నమారాజు గా గుర్తింపబడతాడు జైహింద్.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।