नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
అవంతి మర్ల | గుజరాత్
తన తల్లితో కలిసి టీ స్టాల్‌లో టీ అమ్మేటప్పుడు, మనీషా తాను ఎప్పటికైనా పదోతరగతి పాసు అవగలనా? అని తరచూ ఆలోచిస్తూ వుండేది. ఆమె మొదటి నుండి గణితము మరియు విజ్ఞాన శాస్త్రం లో అంత ప్రావీణ్యురాలు కాదు, తన తండ్రి నుండి సహాయం తీసుకుందాం అని ఉన్నా తనకు అది కుదరదు. ఎందుకంటే, రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అయిన నిరక్షరాస్యడు మరియు మద్యపానమునకు బానిస. గుజరాత్‌లోని మణినగర్‌లోని కాంకరీయ రామానంద్ కోట్ మురికివాడలో నివసిస్తున్న ఈ అమ్మాయి, ఇప్పుడు మంచి మార్కులతో 12వ తరగతి పాసై, పెళ్లి అయి, ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ఇక తన తండ్రి మద్యపానం మానేసి వారు నడిపిస్తున్న టీ స్టాల్‌ను చూసుకునే బాధ్యతను తీసుకున్నారు.
చేతన్ రావల్ కథ కూడా అలాంటిదే. పెళ్లిళ్లలో డోలు వాయిస్తూ ఇంటిని పోషిస్తున్న మన్సుఖ్ రావల్ ఒక్కగానొక్క కొడుకు చేతన్ రావల్. చదువుపై చాలా ఆసక్తిని కనబరిచేవాడు. కానీ తన తండ్రి, సంపాదనలో సగాన్ని మద్యం మత్తులో ముంచేవారు. తనకి ట్యూషన్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు సరిపడేవి కాదు. అదే చేతన్ రావల్ ఈనాడు డాక్టర్ అయ్యి మణినగర్‌కు చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్నారు. చేతన్ తన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడానికి అసలు ఇష్టపడరు.
మిల్లత్ నగర్ బస్తీకి చెందిన సలీం, మూడు రోజులుగా కోచింగ్‌కు సెంటర్ కు రాకపోవడం తో విషయం ఏమిటో తెలుసుకుందామని తన ఉపాధ్యాయుడే స్వయంగా ఇంటికి వెళ్లాడు. చిన్నారి సలీం కు టైఫాయిడ్ జ్వరం వచ్చినదని తెలుసుకున్న అయిన సలీం కు పూర్తి చికిత్సను అందించారు. సలీం ఈ రోజు మణినగర్‌లోని ఓ మిల్లులో పనిచేస్తూ కుటుంబం మొత్తం ఖర్చుల బాధ్యతను తానే చూసుకుంటున్నాడు. దేవుని తర్వాత, సంఘ స్వయంసేవక్ మరియు తన గురువు "కానూభాయ్" ముందు మాత్రమే సలీం తల వంచుతాడు.
ఈ మూడు విభిన్న కథలలో, పిల్లల జీవితాలలోని అదృష్టం కొద్దీ వచ్చిన మార్పు కు మూలం “శ్రీ గురూజీ జ్ఞాన మందిరం”. మణినగర్ మున్సిపల్ పాఠశాలలో సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఈ బోధనా కేంద్రం నడుస్తోంది. సాధారణ బోధనా కేంద్రం కాదు ఇది, నిరుపేద పిల్లల జీవితాలలో విద్య, సంస్కృతి మరియు స్వావలంబన వెలుగును నింపే సూర్యకిరణాలు వంటిది.
సంఘ శాఖ లో సేవా కార్యకర్త గా పని చేసిన కనుభాయ్ రాథోడ్, ప్రస్తుతం భాగ్ సేవా ప్రముఖ్. మధుభాయ్ బరోట్ కృషితో 14 సంవత్సరాల క్రితం ఈ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ అభ్యాస కేంద్రంలో, పిల్లలు చదువుకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులు జీతం తీసుకోరు, ఈ కేంద్రంతో పరిచయం ఉన్న వారందరూ కేవలం సేవతో మాత్రమే ఈ కేంద్రానికి వస్తారు. కొన్నిసార్లు వారు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు.
14 సంవత్సరాల క్రితం, కనూభాయ్ సేవా కార్యకర్త గా ఉన్నపటినుండి బస్తీలలో నివసించే పిల్లలకు ఉచితంగా 'మోడరన్ మేగజీన్' అనే మ్యాథ్స్ మరియు సైన్స్ పుస్తకాన్ని పంపిణీ చేసేవారు. కానీ పిల్లలు ఆ పుస్తకం నుండి ఏమీ నేర్చుకోలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు సక్రమంగా లేకపోవడంతో పదోతరగతి ఉత్తీర్ణత సాధించడం కష్టతరంగా మారింది. అందువల్ల, ఈ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో, శ్రీ గురూజీ జ్ఞాన మందిర్ పేరుతో ఈ బోధనా మందిరమును 2009లో ఒక స్వయంసేవక్ ఇంటిలోని ఒక చిన్న గదిలో ఏడుగురు పిల్లలతో ప్రారంభించారు. కాలక్రమేణా పిల్లలు, ఉపాధ్యాయులు మరియు తరగతుల సంఖ్య కూడా పెరిగింది. ఆ తర్వాత ఆరాధనా పబ్లిక్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల ఈ ట్యూషన్ సెంటర్ కోసం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు తరగతి గదులను ఉచితంగా ఇచ్చింది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు విలువలని కూడా నేర్పిస్తారు.
కొన్ని ఏళ్లుగా ఇక్కడ బోధిస్తున్న ఉపాధ్యాయులు, “రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయేష్ ఠక్కర్ “ఇలా అన్నారు" మేము పిల్లలను ఇక్కడ గురు పూర్ణిమ, రక్షా బంధన్, జన్మాష్టమి, నవరాత్రులు మొదలైన కార్యక్రమాలలో పాల్గొనేలా చూస్తాము మరియు ఇక్కడ పిల్లలతో అన్నిపండగలు జరుపుకుంటాము". సమయానుసారంగా ధార్మిక నిబంధనలు, చర్చలు, దేశభక్తి గీతాలు, కధలు చెప్పడం వంటి పోటీలు కూడా నిర్వహిస్తాము.10, 12 తర్వాత వారికి కెరీర్ కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తాము. పిల్లలు తమ తల్లిదండ్రులను కలవడానికి పేరెంట్ మీటింగ్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహించబడతాయి, కొంతమంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలవడానికి నియమిత బస్తీకి కూడా వెళతారు.
గతంలో ఈ కేంద్రంలో 10వ తరగతి పిల్లలకు మాత్రమే బోధించేవారు. అయితే పెరుగుతున్న పిల్లల సంఖ్య ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తరగతులు ప్రారంభించారు. మణినగర్‌లోని ఈ మున్సిపల్ పాఠశాలలోని శ్రీ గురూజీ జ్ఞాన మందిరంలో 100 మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. ఖోఖ్రా, ఘోడసర్ వత్వా, బహ్రంపురా వంటి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. కొంతమంది పిల్లలు పది కిలోమీటర్లు సైకిల్‌పై ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. వాస్తవానికి శ్రీ గురూజీ జ్ఞాన మందిరం విద్య, సంస్కృతి, విజ్ఞానాల త్రివేణి సంగమం అంటే అతిశయోక్తి లేదు.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।