नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్
డాక్టర్
హెగ్డేవార్ సమితి ఎలా నందర్బర్ జిల్లా (మహారాష్ట్ర) రైతుల జీవితాలను మార్చి
వేసిందో తెలిపే స్ఫూర్తి దాయక పరిచయం!
ఈ
క్రింద వివరించిన వాక్యాలు మహారాష్ట్ర లోని నందర్బర్ జిల్లా రైతు కుటుంబాల ఒకప్పటి
దుస్థితికి అద్దం పడతాయి- "వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి కుటుంబాలను, పిల్లలను ఆకలి నుండి విముక్తులను చెయ్యలేము, కనుక చిన్న చిన్న పనులు, ఉద్యోగాల కోసం నగరానికి వలస వెళ్ళడం
తప్పనిసరి అవుతోంది."
డాక్టర్ హెడ్గేవార్ సమితి 27 సంవత్సరాల క్రితం వచ్చి ఒక ఆశా కిరణాన్ని చూపే వరకు, అత్యధికంగా (67 శాతం ప్రజలు) వృత్తి తెగలకు చెందిన వారు వుండే 5035 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఈ జిల్లా వారికి ఆకలి, పేదరికం, జీవితంలో ఒక భాగమే!
ఈ
రోజున ఈ ప్రాంతం లోని గిరిజనులు, పేదరికం, ఆకలి మరియు పోషకాహార లోపం వంటివి ఒక గతం గా
మారిపోయిన క్రొత్త దృక్కోణంలో జీవితాన్ని అనుభవిస్తున్నారు!. ఈ అద్భుత పరిణామానికి
ఈ గ్రామాలు నోచుకున్నాయంటే, దానిక్కారణం 27 ఏళ్ళ క్రితం డాక్టర్ గజానన్ దాంగే, శ్రీ లలిత్ బాలకృష్ణ పాఠక్, శ్రీ రంగనాథ రంఝాఝి నావెల్ స్థాపించిన
హెడ్గేవార్ సమితి మరియు స్వయంసేవక్ ల యొక్క విశిష్ఠ సేవలే! మొదటగా సేవా సమితి తన
కార్యకలాపాలను మహారాష్ట్రలోని నవపుర్ తాలూకా కు చెందిన ఖంద్భర విభాగం లోని
యెనిమిది జిల్లాలలో ప్రారంభించింది.
నోవపుర్ ఒకప్పుడు చాలా వెనుకబడిన ప్రాంతంలాగా వుండేది. అయితే, సేవా సమితి నాబార్డ్ పథకాల సాయంతో దీని రూపురేఖలు మార్చేసింది. ఈ నాబార్డ్ ప్రాజెక్ట్ క్రింద 500 మంది చిన్న, సన్నకారు రైతులు మామిడి, ఉసిరి మొక్కలను నాటగా, నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ వారు రైతులకు భూసారాన్ని కాపాడేందుకు పొలం గట్ల ను నిర్మించడం, మరియు పల్లపు ప్రాంతాలలో చిన్న చిన్న గుంతలు తవ్వి నీటిని భద్రపరచు కోవడం పై శిక్షణ ఇచ్చారు. దీనితో పాటు ఈ ప్రాంతపు పిల్లలు 10వ తరగతి వరకు చదువు కునేందుకు, సమితి వారు విద్యాలయాలను స్థాపించారు. ప్రస్తుతం ఈ బడులలో సుమారు 500 మంది దాకా పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు.
సమితి
కార్యదర్శి శ్రీ నితిన్ గారు తెలిపిన దాని ప్రకారం, ప్రతి సంవత్సరం దసరా పండుగ మరుసటి రోజు
ప్రజలంతా దగ్గరలో ప్రవహించే నెసు నదీ తీరం వద్ద చేరి ప్రార్థనలు చేస్తారు. నీటి
సమస్యను తీర్చు కునేందుకు ప్రభుత్వంపై ఆధార పడకుండా ఆనకట్టను గ్రామప్రజలే
నిర్మించుకునే లాగా సమితి ప్రేరణ, స్ఫూర్తిని కలిగించింది. రైతులు నెసు నది మీద
చిన్న చిన్న ఆనకట్టలను కట్టి, పొలాలను సాగు చేశారు. ప్రభుత్వము ఇప్పుడు
నదిపై 17 పటిష్టమైన
ప్రాజెక్టులను కట్టింది.
సమితి, రైతులకు ఆర్థిక మరియూ భౌతిక ఊరటనిచ్చే అతి చిన్న విషయాల గురించి కూడా శ్రద్ధ తీసుకునేది. వ్యవసాయదారులు తమ పంటను ధాన్యంగా మార్చుకోవడానికి ఎంతో వ్యయప్రయాసలతో, కాలాన్ని వెచ్చించి గుజరాత్ వెళ్ళవలసి వచ్చేది. రైతులు తమ వీలునుబట్టి తిరిగి చెల్లించ వచ్చని, 13 గ్రామాలలో 13 మిల్లులకు పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసింది సమితి.
కూలీ
నాలీ చేసుకునే వారికి తమ ఇంటి వెనుక కూరగాయలను ఎలా పండించ వచ్చొ నేర్పించింది
సమితి. ఒకే పంటను మళ్ళీ మళ్ళీ పండించడం వలన భూసారం తగ్గిపోతుంది. దీన్ని
పరిరక్షించు కోవడానికి కూరగాయల పెంపకాన్ని మధ్యంతర పంటలుగా వేయసాగారు. జాతీయ
పర్యావరణ సానుకూల వ్యవసాయ కల్పన సంస్థ నుండి, ఉత్తమ నాణ్యత కలిగిన కూరగాయల అమ్మకానికి గాను
అవార్డును తేటిబాయి కుషాల్ అందుకున్నారు. ఆమె హెగ్డేవార్ సమితి సహకారంతో కృషి
విజ్ఞాన కేంద్ర వద్ద ఆ పంటల పెంపకంలో శిక్షణ పొందారు.
పశ్చిమ
క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఉపేంద్ర కులకర్ణి ఈ 12 గ్రామాల అభివృద్ది ని, రైతు ఆత్మహత్యల సమస్యను కూకటి వ్రేళ్ళతో పెకలించిన
విజయంగా అభివర్ణిస్తారు.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।