नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
కిషన్ మర్ల | ముఖం | గుజరాత్
రోజూ తాగొచ్చిన భర్త చేతిలో దెబ్బలు తింటూ, అవమానాలన్నీ మౌనంగా భరించేది. ఈ నషా చాలా మంది స్త్రీలను చిన్నతనంలోనే వితంతువులను చేసింది. వనవాసి గ్రామానికి చెందిన మహిళలు తమ విధి ఇంతే అని భావించి ఈ నరకయాతన అనుభవిస్తున్నారు. వారికి ఆత్మగౌరవం మరియు స్వావలంబన పాఠాలు నేర్పింది డాక్టర్ అంబేద్కర్ వనవాసి కళ్యాణ్ ట్రస్ట్ (సూరత్). రాష్ట్రీయ సేవా భారతికి అనుబంధంగా ఉన్న ఈ ట్రస్ట్ డాంగ్ మరియు తాపీ జిల్లాల్లో సుమారు 130 మండలాలలో సేవాకార్యక్రమాలు ద్వారా 1600 మంది మహిళల్లో స్వావలంబన, ఆత్మాభిమానం మరియు నాయకత్వ స్ఫూర్తిని మేల్కొల్పింది. 250 గ్రామాల్లోని రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారికి సేంద్రియ వ్యవసాయం చేయడం మరియు మెరుగైన విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేయడం ఈ ట్రస్ట్ నేర్పింది.
సూరత్‌లో గత 9 సంవత్సరాలుగా, సంభవ్ కోచింగ్, పేద వారిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు కేవలం రూ.15000 కు UPSC మరియు GPSC శిక్షణ అందిస్తోంది.
గుజరాత్ ప్రభుత్వ పన్ను శాఖ, వాపిలో అధికారి సునీల్
గావిట్‌తో సహా 50 మందికి పైగా “సంభవ్” విద్యార్థులు, ఉన్నత ప్రభుత్వ పదవులలో
ఉన్నారు. 1999లో రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్ ప్రచారక్ శ్రీ నరేంద్ర పంచసర ప్రయత్నాలతో ప్రారంభమైన అంబేద్కర్ ట్రస్ట్,
సంస్కార కేంద్రాలు, యువతి మండల్, భజన మండళ్లు మరియు సఖి మండలాలు అనేవి ప్రారంభించడం ద్వారా ఈ వనవాసి గ్రామాల్లో
అభివృద్ధి శకానికి పునాది పడింది.
ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఈ ఆదివాసీ ప్రజలు సరళంగా మరియు స్వచ్ఛమైన హృదయాలు
కలిగి ఉండేవారు. వీరిని అనేక కంపెనీలు మరియు వ్యక్తులను ప్రలోభపెట్టి, కొన్నిసార్లు హైబ్రిడ్ విత్తనాల పేరుతో,
కొన్నిసార్లు చిన్న తరహా పరిశ్రమల పేరుతో
మోసగించారు. అప్పటినుండి వీరు ఎవరినీ నమ్మడం మానేశారు.
ఈరోజు సేవా ధామ్ అనే బ్యానర్ ఎగురవేయగానే ఒక్కటి కాదు ఎన్నో గ్రామాలు ఆ
బ్యానర్ కింద ఏకమవుతున్నాయి. ఈ కీర్తి కొన్ని నెలలు, కొన్ని రోజులు కాదు 20 ఏళ్ల కష్టానికి ఫలితం. ట్రస్ట్ ప్రెసిడెంట్ తులసీ భాయ్
మావానీ మాట్లాడుతూ, ఈ గ్రామాలలో ట్రస్ట్‌ని
సేవా ధామ్ అని పిలుస్తారు. సేవాధామ్ ద్వారా 2003లో ఆహవ గ్రామంలో అద్దె ఇంట్లో హాస్టల్‌ను ప్రారంభించగా,
2005లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వంచిత సమాజానికి చెందిన విద్యార్థుల కోసం
హాస్టల్‌ను ఏర్పాటు చేశారు.
2006లో, తాపీ జిల్లాలోని సోంగాధ్
తహసీల్‌కు చెందిన గటాడి గ్రామంలో ట్రస్ట్ కి చెందిన సేవా దృక్పథంతో పనిచేసే
కార్యకర్తలు గ్రామ వికాస కార్యక్రమాలను ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయం, విత్తనోత్పత్తి, నీటి సంరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థ, దేశీ ఆహారం మరియు జీవమ్రుత్ తయారీకి రైతులను సిద్ధం చేయడం
వంటి సమర్థవంతమైన నమూనాలు సృష్టించబడ్డాయి. కార్యకర్తల కృషితో 14 ఏళ్లలో గతాడి గ్రామాన్ని ఆదర్శంగా
తీర్చిదిద్దారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కిసాన్ మేళాలను కూడా ప్రారంభించారు.
మద్యానికి బానిసైన
భర్తలకు సఖీ మండలాలు అనే పేరుతొ చికిత్స అందించడం ప్రారంభించారు. మా గ్రామంలోని
మద్యం దుకాణాలు మూసివేయడం ద్వారా డ్రగ్స్ ప్రభావం నుంచి గ్రామాన్ని విముక్తి
చేశామని సుంద గ్రామానికి చెందిన అనితా బెన్ చెబుతున్నారు. డాంగ్ జిల్లా జమ్లాపాడ
గ్రామంలో పుష్పాబెన్ పవార్ ఆధ్వర్యంలో 10 మంది అక్కాచెల్లెళ్లు రూ.25 వేలు అప్పు చేసి వరిసాగు
చేయడం ద్వారా ఈరోజు సొంత సంపాదనతో ఒక్క ఏడాదిలో అప్పు తీర్చారు. నేటికీ, భాయ్ భూపేంద్ర పటేల్ మరియు భాయ్ లలిత్ బన్సాల్‌లతో
పాటు అనేక మంది సంఘ్ స్వయంసేవకులు ఈ గ్రామాల చిత్రాన్ని మార్చడంలో నిరంతరం
సహకరిస్తున్నారు.
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।