सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

అనేక సేవలకు ఆలయం ఈ పండిట్ దీన్దయాల్ ధామ్ – మథుర

అవంతి మర్ల | మధుర | ఉత్తర ప్రదేశ్.

parivartan-img

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మెమోరియల్ గేట్

దేవభూమి మథురలోని ఫరా ప్రాంతంలో మంచినీరు కోసం స్త్రీలు, పిల్లలు మరియు కొన్నిసార్లు పురుషులు మైళ్ల దూరం ప్రయాణించి బిందెలలో మంచినీరు పట్టి భుజాల పైన లేదా తలల పైన మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. చుట్టుపక్కల ఉప్పునీరు కారణంగా, ప్రతి మంచినీటి చుక్క చాలా విలువైనది, అందువలన గ్రామాల్లో నీటి కోసం రోజూ తగాదాలు జరిగేవి. పూర్తిగా నీటిపైనే ఆధారపడే వ్యవసాయమే అక్కడ ప్రధాన వృత్తి. రైతులు పొట్ట నింపుకోవడానికి  తగినంత సంపాదించేవారు, కానీ వారు వారి భవిష్యత్ తరాలకు అభివృద్ధి అందించే స్థితి లో లేరు .ఉపాధి కోసం బలవంతంగా కొన్ని కుటుంబాలు వలస వెళ్లాల్సి వచ్చేది. పిల్లల చదువులకు కూడా సరైన ఏర్పాట్లు లేవు.


దీనదయాళ్ ధామ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారీ దుకాణంలో పనిచేస్తున్న మహిళలు.

కానీ ఒక యోగి దేశంలో జన్మించినప్పుడు, ఆ దేశంలోని ప్రజలు కూడా అతని అనేక సంవత్సరాల తపస్సు యొక్క ఫలాలను పొందుతారు. సంఘ్ యొక్క ప్రచారకుడు మరియు సమగ్ర మానవ తత్వశాస్త్రానికి మార్గదర్శకుడు, గౌరవనీయులు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జీ జన్మస్థలం మథుర నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరా ప్రాంతంలోని నాగ్లా చంద్రభాన్ గ్రామాన్ని నేడు దీనదయాళ్ ధామ్ అనే పేరుతొ పిలుస్తారు.1982లో పండిట్ దీనదయాళ్ జీ పూర్వీకుల ఇంట్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లోని పలువురు వరిష్ఠ అధికారులు భావు రావ్ దేవరస్ జీ, అటల్ బిహారీ వాజ్‌పేయి జీ, ఓం ప్రకాష్ జీ వంటి వారు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జన్మభూమి స్మారక్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో అభివృద్ధికి తలుపులు తెరిచారు. దీనదయాళ్ జీ స్మారక చిహ్నంగా ఇక్కడ ఒక గొప్ప స్మృతి భవన్ నిర్మించబడింది, దీనిని నేడు దీనదయాళ్ ధామ్ అని పిలుస్తారు. ఇంట్లో పొయ్యిమీద వండిన ఆహారం కుటుంబంలోని అనేకమంది సభ్యులకు ఎలా పోషణనిస్తుందో, అదే విధంగా ఫరా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని 56 గ్రామాల ప్రాథమిక మరియు సర్వతోముఖాభివృద్ధికి స్మారక్ సమితి గత అనేక సంవత్సరాలుగా కృషి చేస్తోంది.


చిన్నప్పటి నుండి అక్కడే శాఖకు వెళ్తున్న సంఘ్ ప్రచారక్ మరియు కమిటీ డైరెక్టర్ గౌరవనీయులు సోన్పాల్ జీ ఈ విషయంగురించి చెబుతూ, మంచినీరు లేకపోవడంతో కిలో మీటర్ల దూరం నుంచి తాగునీరు తెచ్చుకోవలసి వచ్చేదని అన్నారు. అందువలన, 1992 లో, మొదటి మంచినీటి పైపు లైను, 15 స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఫరా ప్రాంతంలో ఒక పెద్ద మంచి నీటి ట్యాంక్ ఉంది, దాని నుండి గ్రామంలోని ప్రతి ఇంటికి మంచినీరు లభిస్తుంది. నీటి సమస్య తీరిన వెంటనే అనేక వ్యవసాయ ప్రాజెక్టులు ఉద్భవించాయి. ఈరోజు దీనదయాళ్ ధామ్‌లో 5,000 చెట్లను నాటారు. ఇక్కడ అందమైన ఉసిరి తోట కూడా ఉంది. వివిధ ప్రయోగాల ద్వారా రైతులను సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. గ్రామంలోని దాదాపు 75,000 లీటర్ల మురికి నీటిని మురుగునీటి శుద్ధి కర్మాగారం ద్వారా శుద్ధి చేసి, ప్రతిరోజూ సాగునీటికి ఉపయోగిస్తారు. పునర్నిర్మాణం మరియు సుందరీకరణ కారణంగా, నేడు దీనదయాళ్ ధామ్ ఉత్తరప్రదేశ్‌లోని గొప్ప పర్యాటక కేంద్రంగా ఉంది. నేడు ఇక్కడి పిల్లలు కేవలం ప్రభుత్వ పాఠశాలలపైనే ఆధారపడడం లేదు. దీనదయాళ్ ఉపాధ్యాయ్ సరస్వతి విద్యా మందిర్ ద్వారా రెండు పాఠశాలలు నిర్వహించబడ్తున్నాయి. ఇందులో 1,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఇదొక్కటే కాదు, దాదాపు 25 గ్రామాల్లో ఉచిత వన్ టీచర్, వన్ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏకల్ విద్యాలయాలు పిల్లలకు విద్యను అందించి, వారి జీవితాలకు సరైన దిశానిర్దేశం చేస్తున్నాయి. ఫరా డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని 8 న్యాయ పంచాయతీలలో, 6 సరస్వతీ శిక్షా మందిర్‌లు ఉన్నాయి, వీటిలో 33 గ్రామాల నుండి 1383 మంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు.


. దీనదయాళ్ ధామ్ నుండి దాదాపు 5000 మంది సోదరీమణులు కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందారు.

అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులను ప్రారంభించి సర్వతోముఖాభివృద్ధికి కమిటీ పునాది వేసింది. కామధేను ఆహార మరియు గ్రామీణ పరిశ్రమల ఫార్మసీ మంత్రి, శ్రీ హేమేంద్ర జీ మాట్లాడుతూ, ఇంతకుముందు చిన్న మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు మధురలోని ఆసుపత్రికి చేరుకోవడానికి మైళ్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సేవా కేంద్రం ఆవరణలోనే ఉచిత ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేశారు, ఇక్కడ ప్రతి సంవత్సరం 30,000 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఉచిత కంటి ఆపరేషన్లు, వికలాంగులకు సహాయం, దంత వైద్య పరీక్షలు మరియు అన్ని ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య శిబిరాలు ఇక్కడ నిర్వహించబడతాయి.

పక్కనే కామధేను గౌశాల కూడా ఉంది. పంచగవ్య ఆధారంగా ఆయుర్వేద మందులు ఇక్కడ తయారు చేస్తారు. ఈ గోశాలలు గ్రామంలోని మహిళల స్వావలంబనకు ఆధారం కూడా అయ్యాయి. ఇప్పటి వరకు 40 మంది సోదరీమణులు ఔషధాల తయారీలో వివిధ అంశాలలో శిక్షణ తీసుకున్నారు. దీంతో ఈ మహిళలు ఇప్పుడు నెలకు రూ.4,500 సంపాదిస్తున్నారు. భర్త చనిపోవడంతో అనిత ఇద్దరు పిల్లలతో కుటుంబ పోషణ భారం కాకుండా కుట్టుపని చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తోంది. అలానే రమ అత్తగారు ఈ ధామ్‌లో కుట్టు శిక్షణ తీసుకుని చాలా సంవత్సరాలు పనిచేశారు. పెళ్లయిన తర్వాత కోడలు రమకు కూడా ఇక్కడే కుట్టు నేర్పించి ఆత్మగౌరవంతో జీవించడం నేర్పించారు. కుట్టు శిక్షణ మరియు వస్త్ర పరిశ్రమ కేంద్రం ద్వారా, ఇప్పటివరకు సుమారు 5,000 మంది సోదరీమణులు ఉచితంగా కుట్టు నేర్చుకుని సంపాదించడం ప్రారంభించారు. ప్రస్తుతం 35 మంది సోదరీమణులు నెలకు రూ. 5,000 వేతనం పొందుతున్నారు. 8 గ్రామాల నుండి మహిళలు ఇక్కడకు వస్తారు, శిక్షణ పొందిన సోదరీమణులకు వారి వివాహం సందర్భంగా దీనదయాళ్ ధామ్ కుటుంబ సభ్యులు కుట్టు మిషన్‌ను కూడా బహుమతిగా అందజేస్తారు.

కమిటీ మంత్రి నితిన్ బహ్ల్ జీ మాట్లాడుతూ పండిట్ జీ జయంతి మరియు నిర్వాణ దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు, ఉత్సవాలు మరియు వివిధ పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో లక్షలాది మంది పాల్గొంటారు. కమ్యూనిటీ హాల్, రాధా కృష్ణ దేవాలయం, కమిటీ నిర్మించిన సత్సంగ భవనం మరియు పరిశోధన గ్రంథాలయం చుట్టుపక్కల గ్రామాలన్నింటిని కలుపుతాయి.

ప్రకృతితో పూర్తి సామరస్యంతో మానవుల అభివృద్ధి, పండిట్ జీ ఆలోచనల రూపంలో ఈ సమగ్ర ఏకాత్మకత, బ్రజ్‌లోని పండిట్ దీనదయాళ్ జన్మ స్మారక సమితి భవనం సజీవంగా ఉండటమే కాదు, ఈ దేవభూమికి గర్వకారణం కూడా.

390 Views
अगली कहानी