सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

దక్షిణ భారత కమాండర్ - యాదవ్ రావు జోషి

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

1914 సెప్టెంబర్ నెల 3 తారీఖున పవిత్ర అనంత చతుర్దశి నాడు నాగపూర్ లో ఒక వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీ యాదవ్ రావు జోషి, బాల్యాన్ని పేదరికం, లేనితనం మధ్యనే గడిపారు. ఎం. ., ఎల్.ఎల్.బి చదివిన ఆయన జీవనోపాధి పొందే సమయానికే సంఘ్ ప్రచారకులు. అంత ఉన్నత చదువులు చదువుకున్న వారు అప్పట్లో చాలా తక్కువ సంఖ్యలో వుండే వారు. తన అర్హతలతో కావాలనుకుంటే పొంద గలిగే గొప్ప ఉద్యోగం, పేరు, డబ్బు అన్నింటినీ తృణ ప్రాయంగా భావించారు - ప్రచారక్ గా దేశసేవ చేయడం కోసం.

ఆయనకు అనుచరులను తయారు చేసుకోవాలనే కాంక్ష లేదు, కానీ ఆయన నిస్వార్థ సేవాగుణం జనాన్ని ఆయన వెనుక నడిచేలా చేసింది. యాదవ్ రావు జోషి ప్రేరణతో స్థాపించిన - రాష్ట్ర ఉత్తాన్ పరిషద్ - రోజున బెంగళూరులో ఆపన్నులకు ఒక పెద్ద బ్లడ్ బ్యాంక్ నడపడం మాత్రమే కాకుండా, మురికివాడల్లోనివసించే పిల్లల కోసం ఉచిత విద్య నూ అందిస్తోంది. ఆయన ప్రేరేపిత శక్తి వల్లనే కేరళ లోని చిన్నపిల్లలకు "బాల గోకులం" ద్వారా భారతీయ సంస్కృతి అలవరచడం జరిగింది.


బాలభాస్కర్ గా పిలుచుకునే యాదవ్ రావు జోషి గాత్ర సౌరభాన్ని ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ భీమ్ సేన్ జోషి ఎంతగానో పొగిడారు. తన జీవితాన్ని సంఘ్ పరివార్ కే అంకితం చేస్తూ యాదవ్ రావు జోషి సంగీతాన్ని కూడా సన్యసించారు. సంఘ్ పరివార్ యొక్క ప్రార్థనా గీతం " నమస్తే సదా వత్సలే " మొట్టమొదటిసారిగా పాడింది శ్రీ యాదవ్ రావు జోషి యే!. 

మహాత్మా గాంధీ హత్య కు నాథురాం గాడ్సే ను పురికొల్పారనే అనుచిత నింద కు  శ్రీ యాదవ్ రావు గురి అయ్యారు. సంఘ్ కార్యకలాపాలను నిషేధించిన 1948-75 కాలంలో ఆయన పలుమారు జైలు పాలయ్యారు. జైలు నుండి వస్తూనే ద్విగుణీకృతం అయిన ఉత్సాహం, శక్తితో సంఘ్ కార్యకలాపాలలో పాల్గొనే వారు ఆయన.


దక్షిణ భారత కమాండర్ గా పిలవబడే యాదవ్ రావు జోషి, 1992 లో చనిపోయే వరకూ అవిశ్రాంతంగా సంఘ్ కార్యకలాపాల లో నిమగ్నమై తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సంఘ్ కార్యకలాపాలకు పునాది వేయడమే కాక, "సేవ" అనే ప్రత్యేక దళాన్ని సంఘ్ లో ఏర్పరిచేందుకు కారకులయ్యారు.

923 Views
अगली कहानी