नियमित अपडेट के लिए सब्सक्राईब करें।
5 mins read
మధ్యప్రదేశ్
50 వ దశకం లో షుగర్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పొందడం హిందూస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ లిమిటెడ్ కంపెనీ లో జాయినింగ్ లెటర్ పొందడం కన్నా అందమైన కల బహుశా ఏ యువకుడు కి ఉండక పోవచ్చు. కానీ, బెంగళూరు కి 90కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కి రాంపూర్ కి చెందిన సంభ్రాంత రజొరీయా కుటుంబం లోని 7వ సంతానం విష్ణు కుమార్ కలలు మాత్రం అసాధారణంగా ఉన్నాయి. ఆయన దీనమైన జీవితం గడిపే గుడిసె వాసుల జీవితాన్ని సవరించాలి అనుకున్నారు. చెత్తకుప్పల్లో పడ వేయబడ్డ శిశువులకు గౌరవప్రదమైన భవిష్యత్తును అందించాలని అనుకున్నారు. 1962లో విష్ణు రజొరీయా తన తండ్రి 'శ్రీ అనంత రజొరీయా' కి 'నేను ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా వెళ్తాను' అన్నపుడు, అనంత్ గారికి అర్థమయింది ఏమంటే విష్ణు ఇక ఇంటికి తిరిగి రాడని.
దక్షిణ భారతదేశంలో పుట్టి ఉత్తర భారతదేశంలో ఢిల్లీ నుండి భోపాల్ వరకు విశాల సేవా శృంఖలాన్ని ఏర్పాటుచేసిన విష్ణు జీ ని తన జీవితపు చరమాంకంలో, సేవకు పర్యాయ పదంగా అందరూ భావించ సాగారు. ఆ రోజుల్లో బీద వాళ్లకు మందులు దొరికేవి కావు. దొరికిన ఒకరోజు కూలీ అంతా వాటికే పెట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్ని చూసిన విష్ణు లో కలిగిన ఆవేదన యే, భారతదేశపు మొదటి మొబైల్ మెడికల్ వ్యాన్ ఏర్పాటుకు దారి తీసింది. అది నేడు వందల మొబైల్ వైద్య వాహనాలతో విస్తృతమైన సేవా భారతి నెట్వర్క్ గా రూపుదిద్దుకొంది. వాహనాలు అనేక మురికివాడల్లో కి పోయి ప్రధమ చికిత్స చేస్తూ ఉచిత మందులిస్తూ వైద్యం చేస్తున్నాయి. చెత్తకుప్పల్లో పార వేయబడిన అవాంచిత శిశువులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశంతో ముందుగా ఢిల్లీలో 'మాతృ ఛాయా' ను ప్రారంభించారు. నేడు దేశవ్యాప్తంగా 36 మాతృ ఛాయా విభాగాల మాధ్యమంగా అనేక వందల అనాధ పిల్లలకు తల్లిదండ్రులు దొరికారు. అంతేకాదు ఎందరో సంతాన రహితులు కు పిల్లలు దొరికారు.
అనేకమంది బీద యువకులకు ఉపాధి కోసం ప్రశిక్షణ కేంద్రం, మహిళలకు కుట్టు ఎంబ్రాయిడరీ శిక్షణ కేంద్రం, పిల్లలకు సంస్కార కేంద్రాలు తెరవబడ్డాయి. విష్ణు కుమార్ గారూ ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ కి చేరినప్పుడు అనేకమంది కార్యకర్తలు వారితో జతకట్టారు. ఫలితంగా మధ్యప్రదేశ్లో మూల మూల కు సేవా పథకాలు విస్తరించాయి. మధ్య క్షేత్రం యొక్క క్షేత్ర సేవా ప్రముఖులు గోరేలాల్ బార్చె గారు, "విష్ణు గురూజీ ప్రేరణవలన మధ్యప్రదేశ్ లో 21 విద్యార్థి ఛాత్రావాసాలు 6 మాతృ ఛాయలతో పాటు 400 సేవా కార్యాలు ప్రారంభించబడ్డాయి" అన్నారు.
విష్ణు గారు కాన్పూర్ నుండి ఢిల్లీ చేరినప్పుడు రోడ్డుపైన జీవించే వారి కోసం సేవ చేయవలసి ఉందని సంఘ పెద్దలు చెప్పారు. వారి కోసం చేసే పని యొక్క యోజన పూర్తి అయ్యేవరకూ విష్ణు గారు ఒక ఫుట్ పాత్ చేరి చాప వేసుకుని ఒక పిల్లవాడికి చదువు చెప్పడం మొదలుపెట్టారు. బీద పిల్లవాడికి చదువు చెప్పడం చూసి లాల్ సింగ్ రామ్ గుప్తా ఈయనకు ఒక కుర్చీని కూర్చోవడానికి ఇచ్చాడు. కాలం గడిచి నేడు రామ గుప్తా గారి ఆర్థిక సహకారంతో సావన్ పార్క్ ప్రాంతంలో మూడు అంతస్తుల బీద మేధావుల హాస్టల్ నిర్మితమైంది. అందులో నేడు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
" విష్ణు జీ యొక్క ఐదు అడుగుల బక్క శరీరంలో ఒక విరాట్ వ్యక్తిత్వం ఉంది. దాని ప్రభావంతో కొందరు శరీరాన్ని ఇచ్చారు, మరికొందరు మనసు ఇచ్చారు, మరికొందరు తన జీవితాన్ని ఇచ్చారు" అని ఎందరో పెద్దలు అన్నారు. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్యామ్ జీ గుప్తా స్వామ్త్ రంజన్ లాంటి ఎందరో యువకులు విష్ణు గారి ప్రేరణ తో సంఘ ప్రచారక్ లు అయ్యారు. అనేక అద్భుతమైన కార్యక్షేత్రాలు నిర్మించారు. విష్ణు గారితో అనేక సంవత్సరాలు గడిపిన అంతర్జాతీయ సంయోజకులు, వరిష్ఠ ప్రచారకులు శ్యామ్ పరాండే జి మాటల్లో చెప్పాలంటే, "విష్ణు గారు దాతల హృదయాల పై రాజ్యం చేశారు, వారికి ఎప్పుడు ఎంత ధనం కావాలంటే అంత లభిస్తుంది. ఢిల్లీకి చెందిన గోపాల్ దాస్ ఆవాస మే కానీయండి, లేదా భూపాల్ కి చెందిన సేవాధామ్ మందిరమైన కానీయండి విష్ణు గారి మాటల వల్ల కొందరు ఉక్కు ఇచ్చారు, కొందరు సిమెంట్ ఇస్తే, కొందరు ఇటుకలు ఇచ్చారు. కొందరైతే జాగానే దానం ఇచ్చారు. తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ కూడా ఫోన్ లో సేవ కోసం డబ్బు సేకరిస్తూ ఉండేవారు.
విష్ణు జి సేవలో ఎంతగా మునిగిపోయారు అంటే సేవా భారతి ని మినహాయించి ఆయన మరో ఓ విభిన్న పరిచయాన్ని ఆయన ఇష్టపడలేదు. ఢిల్లీకి చెందిన పాత స్వయం సేవక్ ఆయన మీద పుస్తకం రాయడానికి అడిగితే ఆయన తిరస్కరించారు. "నేను బ్రతికి ఉన్నంతకాలం నా మీద పుస్తకం సాధ్యపడదు ఎందుకంటే నా పరిచయం కేవలం సేవా భారతి మాత్రమే" అన్నారు.
సేవా భావంతో ఆయన నాటిన మొక్క నేడు ఒక మహావృక్షమై దేశంలో ఎందరో సేవార్ద్రులకు భిన్న భిన్న పథకాల ద్వారా సేవలను అందిస్తున్నది. విష్ణు ను అర్థం చేసుకోవాలంటే ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ భయ్యాజీ జోషి ఈ మాటల్ని అర్థం చేసుకోవాలి, " విష్ణు జి సాధనాల కోసం ఆగలేదు సహ యోగం లేకున్నా అలసిపోలేదు," పరిస్థితుల ప్రభావానికి లొంగి పోలేదు"
नियमित अपडेट के लिए सब्सक्राईब करें।