सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

యువతకు యువతే చేయూత-వివేకానంద్ సేవా మండల్ (మహారాష్ట్ర)

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

కలల నగరం ముంబైలో, జీవితం లోకల్ రైలు కంటే వేగంగా నడుస్తుంది. మెరుగైన జీవితం కోసం ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు మరియు విజయం సాధించాలనే కోరిక వారిని తరుచు స్వార్థపూరితంగా మారేలా చేస్తాయి. వారి జీవితాలు చదవడం, నేర్చుకోవడం మరియు సంపాదించడం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, ఆనందం మరియు విజయం కోసం వెతుకులాటలో, తమ వెనుక ఉన్నవారి చేతులు పట్టుకుని ముందుకు నడపడానికి కొంత సమయం ఇచ్చే యువ మనస్సులు ఇంకా ఉన్నాయి. ఇది వారి కథ.


స్వామి వివేకానంద సేవా మండల్కు చెందిన యువకుల బృందం స్వార్ధాన్ని విడిచి మార్పును తీసుకురాగలిగే మార్గాన్ని రూపొందించింది. సంఘ్ స్వయంసేవక్, విష్ణు గజానన్ దేవస్థలి మరియు ప్రొఫెసర్ సురేష్ నఖరే స్ఫూర్తితో ఇంజినీరింగ్ చదువుతున్న 15 మంది విద్యార్థులతో మండల్స్థాపించబడింది. 1991లో, మహారాష్ట్రలోని దొంబివలికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు పేద పిల్లలకు సహాయం చేయడానికి ఒక చిన్న గ్రంథాలయం ప్రారంభించారు. ఒక అడుగు ముందుకు వేస్తూ, వారు ప్రతి శని మరియు ఆదివారాలు దొంబివలి మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సైన్స్ మరియు గణితం బోధించడం ప్రారంభించారు- అభ్యాసం దాదాపు 18 సంవత్సరాలు కొనసాగింది. క్రమక్రమంగా, 40 మంది యువ ఇంజనీర్లతో కూడిన బోర్డు-కేతన్ బోంద్రే, శైలేష్ నిపుంగే, వినోద్ దేశ్పాండే, రవీంద్ర వరంగ్, ప్రగ్నేష్ లోదయా, తృప్తి దేశాయ్, సయాలీ కట్కర్, సోనాల్ భావ్సర్, అనికేత్ గాంధీ మరియు నందకుమార్ పాల్కర్ వంటి వారు, థానే జిల్లాలోని షాపూర్ తాలూకాలో విహీ అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, విద్య, ఆరోగ్యం మరియు స్వావలంబన రంగానికి తమను తాము అంకితం చేసుకున్నారు.

చిన్న గుడిసెలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి జీవించే సునీల్ కులకర్ణి (పేరు మార్చాం) ఏదో ఒక రోజు ఇంజనీర్ కావాలనే కలను కన్నాడు. అయితే, అతనికి చదవడానికి స్థలం కాని పుస్తకాలు కొనడానికి డబ్బులు కాని లేదు. అతని కలలకు మండల్ యొక్క జ్ఞాన్ మందిర్ లైబ్రరీ రెక్కలు ఇచ్చినట్లయింది, ఇక్కడ ఇంజినీరింగ్లో ఖరీదైన పుస్తకాలు ఖర్చు లేకుండా సులభంగా దొరుకుతాయి మరియు దాని రీడింగ్ రూమ్లు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి. అంతేకాకుండా మండల్ కి చెందిన యువకులు కూడా సునీల్కు ఫీజులు చెల్లించడంలో సహకరించారు. నేడు, అతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వంటి ప్రసిద్ధ కంపెనీలో INR 22 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు. సునీల్ కూడా స్వయంగా మండల్ బోర్డులో చేరాడు, తద్వారా ఇతర విద్యార్థులకు కూడా సహాయం చేయడం మరియు మద్దతు ఇవ్వడం ద్వారా తన అభిమానాన్ని తిరిగి పొందాడు.

వివేకానంద సేవా మండల్ అధ్యక్షుడు మరియు స్వయం సేవక్ కేతన్ బోంద్రే ప్రకారం, కేవలం 30 పుస్తకాలతో అద్దె గోదాంలో ప్రారంభమైన లైబ్రరీ రోజు దాదాపు 100 మంది విద్యార్థుల స్టడీ సర్కిల్ను మరియు 8000 కంటే ఎక్కువ పుస్తకాలను కలిగి ఉంది. 22 సంవత్సరాలలో, డోంబివలి మరియు పరిసర ప్రాంతాల నుండి 10 వేల మందికి పైగా ఇంజనీర్లు లైబ్రరీని సద్వినియోగం చేసుకున్నారు.


థానే జిల్లాలోని షాపూర్ తాలూకాలో ఉన్న అటవీ నివాసం విహీకి తిరిగి వస్తే, సుమారు 20 సంవత్సరాల క్రితం వరకు మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన గ్రామాలలో ఇది ఒకటి. ఇక్కడ పరిస్థితిని మార్చేందుకు యువత బాధ్యతలు చేపట్టారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడంతోపాటు వర్షపు నీటిని నిల్వ చేయడం కోసం గ్రామస్తుల సహకారంతో మూడు చెక్డ్యామ్లు నిర్మించారు. దీంతోపాటు రైతులకు ఆదాయం పెంచేందుకు సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గిరిపుత్రులు స్వావలంబన సాధించే దిశగా, వారిని వృత్తి మరియు ఉపాధి అవకాశాలతో అనుసంధానించడానికి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు.

ఫలితంగా, దీపావళికి వర్తించే సంప్రదాయ పేస్ట్ (ఉబాటాన్) తయారీ నేర్చుకున్న గ్రామస్తులు, గత సంవత్సరం డోంబివలిలో దాదాపు 50 వేల ప్యాకెట్లను విక్రయించారు. ముడిసరుకు కొనుగోలు నుండి ప్యాకేజింగ్ వరకు, పనికి నాయకత్వం వహించేది మహిళలే: బోర్డు కేవలం వాటిని మార్కెట్లో అందుబాటులో ఉంచింది. ఇది చదువు గురించి అవగాహన కల్పించడంలో మరియు విద్యను ప్రోత్సహించడంలో కూడా సహాయపడింది. నేడు, ప్రకాష్ కవాతే, యశ్వంత్, బృందా, కౌశల్య మొదలైన అనేక మంది ఆదివాసీ పిల్లలు గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయి ఉపాధి పొందుతున్నారు.

మండల్ పేద ప్రతిభావంతులైన పిల్లలకు కనీస రుసుముతో వరుసగా మూడు సంవత్సరాలు SSC కోచింగ్ను అందిస్తుంది. నిత్యం ఉపాధి మేళాలు నిర్వహించడం ద్వారా సరైన వృత్తిని ఎంచుకోవడానికి మండల్ కూడా సహకరించిందని ఉద్యోగాన్ని వదిలి ఏడాది కాలంగా విహీ గ్రామంలో ఉంటున్న సంఘ్ స్వయంసేవక్ శైలేష్ నిపుంగే చెబుతున్నారు.

దైవకార్యానికి అన్ని వైపుల నుండి నుంచి మద్దతు లభిస్తుందని చెబుతారు. బిజెపి ఎంపి డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే మండల్ పనిని వీహిలో చూసినప్పుడు, ఆయనకు నచ్చి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఎంపీ నిధుల ద్వారా ఆయన చేసిన అమూల్యమైన సహకారంతో వీహి గ్రామం నేడు గణనీయంగా అభివృద్ధి చెంది నూతనోత్తేజాన్ని సంతరించుకుంది.

636 Views
अगली कहानी