सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

దివి నుండే వచ్చిన దేవదూతలు

అవంతి మర్ల | కేరళ

parivartan-img

ప్రకృతి ఆరాధకులను, యాత్రికులను మరియు ఆధ్యాత్మిక అన్వేషకులను ఎల్లప్పుడూ ఆకర్షించే కేరళ భూమిలో, 2021 అక్టోబర్ 16, ఇంద్రుడి ఉగ్రత ఎంతటి విధ్వంసం సృష్టించింది అంటే గ్రామాలు నీటిలో మునిగిపోవడం ప్రారంభించాయి. తెల్లవారుజామున ఐదు గంటలకే  ప్రారంభమైన వర్షానికి గుడిసెలు, పాత్రలు, మంచాలు, పశువులతో పాటు సర్వం కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు అగమ్యగోచరంగా మారాయి. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు అడ్డుగా నిలిచాయి. చుట్టూ మట్టి మాత్రమే ఉంది. 21 మంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు సర్వం కోల్పోయి   క్షణాల్లో నిస్సహాయులు గా మారిపోయారు. ఈ విపత్తు ను ఎలా ఎదుర్కోవాలి అని  ప్రభుత్వం కూడా  ఉలిక్కిపడింది. ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట మొదలగు ప్రాంతాల్లో దేవదూతల వలె కనిపించారు కేరళ సేవాభారతి కార్యకర్తలు. ప్రభావిత ప్రాంతాల్లో 600 మందికి పైగా కార్యకర్తలు ఇళ్లు, బావులు, రోడ్లు శుభ్రం చేయడంతో పాటు ఆహార ధాన్యాలు, పాత్రలు, మంచాలను పంపిణీ చేశారు. ఇది మాత్రమే కాదు పగలు మరియు రాత్రి స్వయంసేవకులు కష్టపడి పనిచేసి ప్రయాణ మార్గానికి తాత్కాలిక వంతెనలు కూడా నిర్మించారు.


అక్టోబర్ 17న భారీ వర్షం తగ్గుముఖం పట్టడంతో, వర్షంలో కొట్టుకుపోకుండా మిగిలిన ఒక 16 ఇళ్లకు చెందిన కుటుంబాలు, వారి ఇల్లు, సామాను మరియు జీవిత కాలం సంపాదన ఐదు అడుగుల మట్టి తో పేరుకు పోవడం చూసి శరణార్ధుల  కన్నీళ్లు ఆగలేదు. అనంతరం స్వయం సేవకులు పలుగులు, గడ్డపారలు పట్టుకుని శరణార్ధుల ఇల్లులు శుభ్రం చేయడం ప్రారంభించారు. బాధిత కుటుంబాలు కూడా ఈ యుద్ధప్రాతిపదికకు స్వయం సేవకులతో చేయి కలిపి కొట్టక్కల్, కోకాయర్, మణిమాల సహా.. మొత్తం ఎనిమిది పంచాయతీల్లో వందలాది ఇళ్లను శుభ్రం చేసి నివాసయోగ్యంగా మార్చారు.

సేవా భారతి పూర్ణ కార్యకర్త జిదిన్ రమేష్ గారు  మాట్లాడుతూ; "450 భవనాలు, 310 బావులు మరియు చిన్న కర్మాగారాలను శుభ్రపరచడం తో పాటుగా  ప్రయాణించడానికి వీలుగా రోడ్లపై నుండి విరిగిన చెట్లు మరియు రాళ్లను తొలగించారు. సైనికుల వలె స్వయంసేవకులు కొక్కయార్‌లోని గ్రామం ప్రజల సహాయ సహకారంతో ఈ విపత్తు నుండి బయటపడేలా చేసారు. దీంతో అక్కడి గ్రామ పంచాయతీ సభ్యుడు నిచుర్‌ తంగ్‌చాన్‌ అవాక్కయ్యారు." ఖాకీ నిక్కరు  వేసుకున్న ఈ సంఘ్ స్వయంసేవకులు ఎక్కడినుంచి వచ్చారో తెలియదు, కానీ తని గ్రామానికి వచ్చి తన గ్రామాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలిపే వంతెన ఈ వర్షాలకు కొట్టుకుపోయిన తరువాత, పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమించి  ఐదు అడుగుల వెడల్పు, 12 మీటర్ల పొడవుతో కలప, బాలి మరియు ఇతర స్థానిక వనరుల నుండి తీసుకువచ్చిన వస్తువులతోటి తాత్కాలిక వంతెనను తయారు చేశారు."గ్రామం అందించిన వనరులతో కాదు, సేవా భారతి కార్యకర్తల అలుపెరగని కృషితో వంతెన నిర్మించబడింది’’ అని నిచూర్ చెప్పారు.


నారాయణ్ ధర్మ యోగా ఆశ్రమం యొక్క సాధువులు ఈ స్వయంసేవకులకు కృతజ్ఞత వ్యక్తం చేయడంలో వెనుకడుగు వేయలేదు. ఆలయం చుట్టూ 4 అడుగుల మేర మట్టి పేరుకుపోవడం వలన ఆలయ తలుపులు కూడా తెరవడం కష్టంగా ఉండడంతో ఆలయ ఆవరణతో పాటు అక్కడ ఉన్న బావిని కూడా స్వయంసేవకులు శుభ్రం చేశారు. ఈ పనిని చూస్తున్న ఒక పెద్దాయన  తన పంపులను, పనివారిని, బావులను శుభ్రం చేసేందుకు అవసరమైన వనరులను అందజేశారు.             

సేవాభారతి కార్యకర్తలు ఈ సేవా యాత్ర ఇక్కడితో ఆగకుండా బాధిత కుటుంబాలకు రోజూ 200 నుంచి 250 మందికి ఆహారం పంపిణీ చేశారు. పాత్రలు, బెడ్, గ్యాస్ స్టవ్ మరియు దోమతెర అన్ని అవసరమైన వస్తువులు కూడా ఇచ్చారు. మతం, కులాలకు అతీతంగా మానవాళి సేవలో నిమగ్నమైన కార్యకర్తలను చూసి షెల్లీ థామస్ అనే క్రైస్తవ మహిళ తన ఇంటిని కేంద్రంగా చేసుకోవాలని సేవాభారతికి అప్పగించింది. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు, చెట్లు ఉండడంతో ట్రాఫిక్‌ మొత్తం నిలిచిపోవడంతో రోడ్ల సమస్య ఇంకా తీరలేదు. ఇందుకోసం 600 మంది కార్యకర్తలు ఒక గ్రూపుగా ఏర్పడి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలుపెరగని కృషితో 12 రహదారులకు మరమ్మతులు చేశారు. సేవాభారతి కార్యకర్తల నిరంతర కృషితో వర్షం ప్రభావిత జిల్లాలైన కొట్టాయం, ఇడుక్కి, పథనంతిట్ట జిల్లాల్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

456 Views
अगली कहानी