सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ఆదర్శవంతమైన గ్రామం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

కలలు నిజం గా ఎలా మారతాయి, ప్రజలు విధ్వంసకర స్థితి నుండి అభివృద్ధి వైపు ఎలా వెళుతున్నారు, సంకల్పం మరియు కృషి కలిస్తే ఒక గొప్ప పరిణామం ఎలా సాధ్యమౌతుందో ఒక్కసారి గ్రామం లోకి ప్రవేశించి చూస్తే తెలుస్తుంది. గ్రామం సంవత్సరాలుగా నీటి సేకరణ పద్ధతులను ఉపయోగిస్తోంది మరియు బహిరంగ కాలువలు, బురద గుంటలు లేవు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం దానిమ్మ, మామిడి, పనస, జామ, పెద్ద ఉసిరి (ఆమ్లా), బ్లాక్ ప్లం లాంటి చెట్లతో, తులసి వంటి ఔషధ మొక్కలతో అలంకరించబడి ఉంటుంది. వందశాతం అక్షరాస్యత కలిగిన గ్రామం రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన గ్రామాలలో ఒకటి. మేము ఉత్తరప్రదేశ్లోని మహమ్మదీ తాలూకా (లఖింపూర్ ఖిరి జిల్లా) లోని ఒక ఆదర్శ గ్రామమైన రవీంద్ర నగర్ గురించి మాట్లాడుతున్నాము. గ్రామం గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ జన్మదినోత్సవం సందర్భంగా గుర్తించడం జరిగింది, అందుకే ఆయన పేరు పెట్టారు.


దేశ విభజన భయాందోళనలను ఎదుర్కొని ఇక్కడికి వచ్చి ఏళ్ల తరబడి కష్టాలను చవిచూసిన కష్టజీవుల కథ ఇది. కూడు మరియు గూడు లాంటి ప్రాధమిక అవసరాలు లేవు సరికదా కలరా, డయేరియా, బ్లాక్ ఫీవర్ వంటి అంటువ్యాధులు శరణార్థి శిబిరాల్లో వ్యాపించాయి. పునరావాసం పేరుతో కుటుంబాలను గోమతి నది పక్కనే ఉన్న అడవిలో పడేశారు. ఇలా 8 ఏళ్లపాటు వీరి వేదన కొనసాగింది. స్థానిక స్వయంసేవక్ మరియు గ్రామాభివృద్ధి జిల్లా అధిపతి శ్రీ తపన్ కుమార్ మాట్లాడుతూ వారు తమ భోజనానికి అడవి బియ్యాన్ని ఉడకబెట్టి చేపలతో తింటారని చెప్పారు. 50 సంవత్సరాల క్రితం, సంఘ్ ఇక్కడ తన శాఖను ప్రారంభించి అభివృద్ధికి బాటలు వేసింది మరియు ప్రజలు తమ గ్రామాన్ని మరియు జీవితాన్ని మార్చుకొని విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది. స్వయంసేవకుల సహాయంతో గ్రామస్థులు చేసిన మొదటి పని వ్యవసాయానికి అనుకూలమైన భూమిని తయారు చేయడం. ఇది చాలా కష్టమైన పని, దీనికి గ్రామస్తులు మరియు స్వయంసేవకుల కృషి చాలా అవసరం.


రవీంద్ర నగర్ (గతంలో మియాపూర్ అని పిలువబడేది) చేతబడి మరియు పాములాడించేవారికి కోటగా పరిగణించబడేది, ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడేవారు, అయితే ఇన్ని అసమానతలు ఉన్నప్పటికీ, ప్రజలకు ఏదైనా మంచి చేయాలని స్వయంసేవకులు నిశ్చయించుకున్నారు, ప్రక్రియలో భాగంగా మొదటి శాఖ భైరవచంద్ర రాయ్ ద్వారా 1969 లో నిర్వహించబడింది. అప్పటి నుండి గత 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా శాఖలు నిర్వహించబడుతున్నాయి. భూమిని విరాళంగా ఇచ్చిన స్వయంసేవకుల సహాయంతో ఇక్కడ మొట్టమొదటి పాఠశాల ప్రారంభించబడింది. తర్వాత పాఠశాల ప్రభుత్వం నుండి గుర్తింపు పొందింది. నేటికీ, సంజయ్ విశ్వాస్, మల్లికా మండల్, మిలన్ మరియు శంభు వంటి, స్వచ్ఛంద సేవకులు ఉపాధ్యాయులుగా 100% అక్షరాస్యత రేటును చేరుకోవడానికి సహాయం చేస్తున్నారు. సంప్రదాయం ఇప్పటికీ ఇక్కడ కళకళ లాడుతూ ఉంటుంది ఆవు పేడతో వారి ఇళ్లను అలుకుతారు, మరియు ఉదయం శంఖనాదం తో  ప్రారంభమవుతుంది. గ్రామంలోని మహిళలు ఉపాధి కోసం బీడీలు తయారు చేస్తారు, కానీ ఆశ్చర్యకరంగా, గ్రామంలో ఎవరూ బీడీలు తాగరు. గ్రామంలో నాలుగు స్వయం సహాయక సంఘాలు మహిళలకు కుట్లు, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇస్తూ ఉపాధికి మార్గం సుగమం చేస్తున్నాయి.


రవీంద్ర నగర్ పరిశుభ్రతకు ఒక నమూనా మరియు ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా ఇంత స్వచ్ఛమైన మరియు అందమైన పాఠశాల కనుగొనడం కష్టం. పాఠశాలలు, పంచాయతీలు, ఇళ్లు, దేవాలయాలు, రోడ్లు, ఆట స్థలాలు అన్నీ స్వయంసేవకుల సహాయంతో పరిశుభ్రంగా ఉంటాయి. ప్లే గ్రౌండ్ను స్టేడియంగా మార్చి స్థానికుల సహకారంతో సరైన రోడ్లు నిర్మించారు. సంఘ్లోని గ్రామాభివృద్ధికి సంబంధించిన ప్రస్తుత ప్రాంతీయ అధిపతి శ్రీ ప్రేమ్ శంకర్ అవస్తి, 2009లో గ్రామం అభివృద్ధి బాధ్యతలు స్వీకరించారు మరియు గ్రామ సంరక్షకునిగా ప్రసిద్ధి చెందారు. గ్రామంలో ఎవరూ నిరుద్యోగులు లేరని గర్వంగా చెప్పుకుంటారు. రవీంద్ర నగర్ వాణిజ్య చిమ్నీల తయారీకి ప్రసిద్ధి. విగ్రహాల తయారీ, నిర్మాణం, ఎలక్ట్రీషియన్, మోటారు బైండింగ్ మొదలైన ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన యువకులు తమకు తాముగా మంచి జీవితాన్ని ఏర్పరచుకున్నారు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వైద్య సలహాదారు డాక్టర్ చిత్రాంజన్ విశ్వాస్. రవీంద్ర నగర్ ఒక ఆదర్శవంతమైన గ్రామం, అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా ఆటుపోట్లను ఎలా తిప్పికొట్టవచ్చు అనేదానికి ఉదాహరణగా నిలిచి ఇతరులు అనుసరించడానికి మార్గం గా నిలించింది.

998 Views
अगली कहानी