सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

విమలా కుమావత్ గా తల్లి యశోద పునర్జన్మ

అవంతి మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

ఆమె వయస్సు 62 సంవత్సరాల కంటే ఎక్కువ అయినప్పటికీ, ఆమె జనవరి 26, 2003 తన పుట్టినరోజు అని చెప్పింది! ఆమెకు లెక్కల్లో కొంచం ఇబ్బంది వుంది అని మీరు అనుకోవచ్చు, కానీ ఆమె గణిత నైపుణ్యం చాలా బాగుంది, 62 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విమలా కుమావత్‌ను కలవండి, ఆమె జనవరి 26, 2003న తన పుట్టినరోజు అని నొక్కి చెబుతుంది........లేదా పునర్జన్మ- ఒక రకమైన కొత్త పుట్టిన రోజు.

నిజానికి చాలా మంది వృద్ధుల మాదిరిగానే, ఆమెకు తన అసలు పుట్టిన తేదీ కూడా గుర్తులేదు. అయితే ఆ రోజు, ఆర్‌ఎస్‌ఎస్ వరిష్ఠ ప్రచారక్ ధనప్రకాష్ త్యాగి గారి స్ఫూర్తితో తొలిసారిగా, ఆమె జైపూర్‌లోని తన ఇంటికి సమీపంలోని వాల్మీకి మురికివాడ నుండి తన స్థావరానికి 5 మంది పిల్లలను తీసుకువచ్చింది, అది ఆమె మనస్సు మరియు ఆత్మపై జీవితకాల ముద్ర వేసింది, ఆ రోజే జనవరి 26, 2003. ఇది ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చిన రోజు. జీవనోపాధి కోసం వృధాగా పోసే ప్లాస్టిక్ సంచులను సేకరించే ఈ పిల్లలకు విద్య నేర్పించాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో 48 సంవత్సరాల వయస్సులో, విమల జీ, ఆమె కేవలం 8వ తరగతి వరకు చదువుకుంది మరియు ముగ్గురు కొడుకులు, కోడలు మరియు మనవరాళ్లతో కూడిన పెద్ద కుటుంబం. ఈ అవకాశం లేని పిల్లల జీవితాలను అలంకరించాలని ఆమె నిర్ణయించుకుంది.

ఈ పిల్లలు చెత్త సేకరించడం ద్వారా సంపాదించిన డబ్బులో కొంత భాగం డోపింగ్ మరియు మద్యం సేవించడం, దానిలో మిగిలిన భాగం వారి కుటుంబంలో ఇతర ఖర్చుల కోసం వెళ్ళేది. చెత్త సేకరించేవారి నివాసస్థలము భయంకరమైన గజిబిజిగా ఉండేది. పిల్లలు ఒక చిన్న కుటీరంలో మరియు పందుల మధ్య నివసించేవారు. అంతేకాదు తల్లిదండ్రులు ఏదో ఒక మత్తుకు బానిసలై తమ పిల్లల చదువుల పట్ల కనీస శ్రద్ధ చూపేవారు కాదు. ఈ దురదృష్టకర పరిస్థితిలో విమలా జీ ఒక దివ్యమైన వ్యక్తిలా వారిని రక్షించడానికి వచ్చారు. మొదటి మూడు సంవత్సరాలలో, సేవా భారతి సహాయంతో, విమలా జీ ఇంట్లో నడుస్తున్న తరగతి, క్రమంగా సేవాభారతి బాల విద్యాలయంగా మారింది. ఇప్పుడు ఈ పాఠశాలలో రోజుకు 400 మందికి పైగా పిల్లలు చదువుతున్నారు. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న శివాని ని కలుద్దాం. విమలా జీ తన చెల్లెలితో కలిసి హాస్టల్‌కి తీసుకొచ్చిన రోజును ఈ చిన్నారి మరిచిపోలేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ మేనమామ వద్దే ఒక చిన్న కుటీరంలో వారి నలుగురు పిల్లలతో పాటు ఉంటున్నారు. మొదట్లో శివాని , పుండులో పురుగులు పడి తీవ్రంగా గాయపడిన తన చెల్లెలితో హాస్టల్‌కు రావాలంటే మొండికేసింది. హాస్టల్‌కి వెళ్లడం ఇష్టం లేదంటూ శివాని హంగామా సృష్టించింది కూడా. గత సంవత్సరం, 10వ తరగతిలో 62% మార్కులు సాధించిన తర్వాత, శివాని తన కళ్ల నిండా ఆనందం మరియు కృతజ్ఞతతో తన అమ్మమ్మగా భావించే విమలజీ ని ఆలింగనం చేసుకుంది. ఆమె ఒక అందమైన పద్యం రాసి విమలజీ కి అంకితం చేసింది కూడా.


ఇప్పుడు B.Com మొదటి సంవత్సరం చదువుతున్న లోకేష్ కోలి గురించి మాట్లాడుకుందాం. లోకేష్ చదువుకుంటూనే అదే సేవాభారతి బాల విద్యాలయంలో బోధించేవాడు. అతను చాలా బాగా వేణువు వూదుతాడు కూడా. అతను 8 సంవత్సరాల వయసులో, అతని ఇష్టానికి విరుద్ధంగా విమల జీ అతన్ని పాఠశాలకు తీసుకువచ్చింది. అతను, వితంతువు గా వున్న తల్లి యొక్క ముగ్గురు పిల్లలలో పెద్ద కొడుకు. మరో అసాధారణమైన దశలో విమలజీ, 52 సంవత్సరాల వయస్సులో, 8వ తరగతి విద్యార్థి లక్ష్మికి బోధించడానికి 8వ తరగతి పరీక్షలో మళ్లీ హాజరు కావాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు లక్ష్మి బి.ఎ 2వ సంవత్సరం చదువుతోంది. విమలజీ నిర్వహిస్తున్న ఈ సేవా భారతి బాల విద్యాలయంలో, ప్రచారంలో లేని అనేక కథనాలను మనం ఇక్కడ చూడవచ్చు.

విమల జీ చేస్తున్న పని కనిపించిన దానికంటే చాలా కష్టంగా ఉంటుంది. మొదట ఈ పిల్లల తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపడానికి సిద్ధంగా లేరు, ఎందుకంటే ఈ పిల్లలు వారి సంపాదన కు మార్గాలు. వారి తల్లిదండ్రులకు పిల్లల చదువు కంటే డబ్బే ఎక్కువ. సుదీర్ఘమైన ఒప్పందాల తర్వాత, వారు పిల్లలను కేవలం నాలుగు గంటలు మాత్రమే చదువు కోసం విడిచిపెట్టి, మిగిలిన సమయంలో వారు చెత్త నుండి ప్లాస్టిక్‌ను సేకరించే వారి సాధారణ పనిని చేయాలని షరతుపై అంగీకరించారు.

సేవా భారతి సహాయంతో 100 మంది పిల్లలను చేరుకున్న తర్వాత, ఈ పాఠశాల ఒక టెంట్‌లోకి మార్చబడింది. చదువులతో పాటు విమలజీ జీ పిల్లలకు శ్రీమద్ భగవద్గీత మరియు బాల రామాయణ భజన మొదలైన శ్లోకాలను కూడా బోధించేవారు, అదనపు పాఠ్యాంశాల విషయానికి వస్తే, ఈ పిల్లలు హార్మోనియం, ధోలక్, మంజీర మరియు వారి అభిరుచి మేరకు వేసవి సెలవుల్లో కుట్టుపని, ఎంబ్రాయిడరీలో శిక్షణ కూడా పొందారు.


జైపూర్‌లో హిందూ ఆధ్యాత్మిక మేళా సందర్భంగా బాల రామాయణం యొక్క శ్రావ్యమైన సంగీత రంగస్థల ప్రదర్శనను ఈ పిల్లలు ప్రదర్శించినప్పుడు, ధన్ ప్రకాష్ జీ ఉద్వేగానికి లోనయ్యారు మరియు ఆయన కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఈ ప్రతిభావంతులైన పిల్లలు ఈవెంట్‌లో గెలిచిన అనేక ట్రోఫీలు మరియు షీల్డ్‌లను గర్వంగా ప్రదర్శిస్తారు.

నేడు పాఠశాల, శారదా ఎన్‌క్లేవ్‌లో ఉన్న రెండు అంతస్తుల భవనంలో నడుస్తోంది. ఈ పాఠశాలలో చదువుతున్న 325 మంది పిల్లల మొత్తం ఖర్చును సామాన్య సమాజంలోని వివిధ వర్గాల వారు ఆదరిస్తున్నారు. విమలజీ, ఇప్పుడు తన స్వంత కుటుంబానికి దూరంగా ఈ పిల్లల చదువులకు అడ్డంకులు లేకుండా చూడడానికి ఇక్కడ నివసిస్తోంది. SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షల పరీక్షా కేంద్రాల కోసం ఆమె ఈ పిల్లలతో పాటు ముఖ్యంగా బాలికలతో కూడా వెళుతుంది. ఇప్పుడు ఈ సేవా భారతి విద్యాలయ (పాఠశాల) యొక్క శాఖ కూడా సంగనేర్ జిల్లాలోని బక్సావాల్‌లోని టార్పాలిన్ గుడారాల క్రింద 155 మంది విద్యార్థులను కలిగి ఉంది.

విమల కుమావత్/ 8769592989

896 Views
अगली कहानी