सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

వరద ముంపు సహాయంలో నిర్భయంగా స్వయంసేవకులు

సుబ్రహ్మణ్యం నేమాని | మధ్యప్రదేశ్

parivartan-img

సాధారణంగా విపత్తులు అప్రకటితంగా వస్తాయి. అయితేఇక్కడ  గుజరాత్  నందు ముందుగానే విపత్తుని హెచ్చరించారు. 2017 జూలై నెలలో, గుజరాత్ అత్యంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. రాజస్థాన్‌లోని జైత్‌పురా డ్యామ్ నుండి విడుదల చేసిన మిలియన్ల గ్యాలన్ల నీరు గుజరాత్ తీరానికి చేరుకుని భారీ వరదగా మారింది. వరదల గురించి అధికారిక హెచ్చరికను, ఆ గ్రామస్తులు ఎప్పుడూ రెండు అడుగుల నీటి మట్టాన్ని చూడలేదు కాబట్టివ్యంగ్యంగా, అజ్ఞానంతో ఆ హెచ్చరికను పట్టించుకోకపోవడమే కాక వేరే చోటికి వెళ్లడానికి కూడా నిరాకరించారు. స్థానిక పరిపాలన కూడా విఫలమైన ఈ దారుణమైన పరిస్థితిలో ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులు జోక్యం చేసుకుని వేలాది మంది ప్రాణాలను కాపాడి సాహస వీరులుగా ఉద్భవించారు.

2017 జూలై 23 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో, పాలంపూర్ ప్రాంతానికి చెందిన సేవా ప్రముఖ్ గోవింద్‌భాయ్ ప్రజాపతికి రాబోయే వరదల గురించి సమాచారం వచ్చింది. ధనేరా, బనస్కాంత మరియు దీతలలో సీనియర్ స్వయంసేవక్‌ల మధ్య అత్యవసర మొబైల్ సమావేశం జరిగింది. రాబోయే విపత్తును ఎదుర్కొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విపత్తు ముప్పు పొంచి ఉన్న లోతట్టు ప్రాంతాల వైపు కొద్దిసేపటికే స్వయంసేవకులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. వాహనాలపై అమర్చిన లౌడ్ స్పీకర్ల సహాయంతో వరదల ప్రమాదాన్ని అలాగే భద్రతా చర్యలను తెలియజేసేందుకు రాత్రంతా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి పయనమయ్యారు. ఒక్క ధనేరా వద్దనే, స్వయంసేవకులు ఎనిమిది వేల మంది ప్రాణాలను కాపాడగలిగారు.

 

1871 మంది స్వయంసేవకుల ప్రత్యేక బృందం, వరద బాధితులకు 5,50,000 ఆహార ప్యాకెట్లు, 23,000 కిరాణా కిట్‌లు, తాగునీటి బాటిళ్లు, పరుపులు, బట్టలు మరియు టెంట్‌లను పంపిణీ చేయడానికి 24 గంటలూ శ్రమించారు. 123 మంది వైద్యులతో కూడిన ఆర్.ఎస్.ఎస్. అనుబంధ బృందం 203 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇది నిజంగా భయానక దృశ్యం. బనస్కాంత జిల్లాలోని ధనేరా, దంతివాడ, అమీర్‌ఘర్, దీసా మరియు లఖ్నీ గ్రామాలలో వంద మంది పౌరులు, లక్షకు పైగా పశువులు చనిపోయాయి. వాస్తవానికి వీరిలో తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్వయంసేవకుల విజ్ఞప్తిని తిరస్కరించిన గ్రామస్థులే ఎక్కువగా ఉన్నారు. కాంక్రెజ్ జిల్లా ఖరియా గ్రామంలో 17 మందితో కూడిన కుటుంబం వరద నీటిలో చిక్కుకుంది.

బాధిత ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో స్థానిక యంత్రాంగం అసమర్థంగా ఉంది. స్థానిక పరిపాలన మరియు సైన్యం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందే, R.S.S. స్వయంసేవకులు సహాయక చర్యలను ప్రారంభించారు అని మెహసానా జిల్లాకు చెందిన R.S.S విభాగ్ సంపర్క్ ప్రముఖ్ - డాక్టర్ నిఖిల్ వెల్లడించారు. నీటిలో మునిగిన ప్రజలను స్వయంసేవకులు తాళ్ల సహాయంతో బయటకు పంపించారు. స్వయంసేవకుల నుండి ఎన్.డి.ఎల్.ఎఫ్. కూడా ఎంతో సహకారాన్ని పొందింది. స్వయంసేవక్ జే పటేల్ నేతృత్వంలోని అదానీ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థుల బృందం మెడికల్ కిట్‌లతో అత్యంత ప్రభావిత గ్రామాలైన ఆదేశ్‌పురా, రాధేపూర్‌ల లో అవిశ్రాంతంగా శ్రమించి బాధితులకు 24 గంటలూ సేవలందించింది. విద్యుత్తు లేకపోవడంతో టార్చ్ లైట్ సాయంతో వైద్య సేవలందించారు.

రక్షించడం నుండి పునరావాసం వరకు పనులను RSS స్వయంసేవకులే మొదట ప్రారంభించారని ఆర్.ఎస్.ఎస్. విభాగ్ సేవా ప్రముఖ్ - నటుభాయ్ జోషి చెప్పారు. అనేక ఇతర సామాజిక సంస్థలు సహాయ కార్యక్రమాల కోసం వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయాయి.  అయితే పునరావాస పనులు సంతృప్తికరంగా చేరే వరకు RSS స్వయంసేవకులు ఇక్కడ కోటలా నిలిచి ఉన్నారు.

916 Views
अगली कहानी