सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

అనాధలకు గోకులం ఈ మాతృఛాయ ప్రాంగణం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

రకరకాల రంగులు పరిసరాలకు అందాన్ని వాతావరణానికి ఉత్సాహాన్ని మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి రంగుల పండుగ అయిన హోలీ, రోజు మాతృఛాయ ప్రాంగణంలో జరుగుతోంది. చిన్ని కృష్ణులు రంగులతో, పిచికారీలతో పరుగులెడుతుంటే యశోదల ఆనందానికి అంతులేదు. అక్కడ వాతావరణం మరో గోకులాన్ని తలపిస్తోంది.

అలాంటి సమయంలో  సేవాభారతి  మాతృమండల్  సోదరీమణులకు ఒక  సంచి అనుమానంగా కనిపించింది. వారిలో ఒకరు ప్రాణాలను పణంగా పెట్టి దానిని విసిరివేయడానికి పరుగెత్తారు. అయితే సంచి నుండి ఒక ఏడుపు వినిపించడంతో అందరు నిర్ఘాంతపోయారు. దానిలోపల అప్పుడే పుట్టిన ఆడపిల్ల వుంది. కానీ యువరాణి మాతృఛాయలో ఒక కొత్త భాగం కావడం పట్ల అక్కడ ఆనందం రెట్టింపు అయింది. ఇప్పుడు ఆమె భోపాల్ లో సేవాభారతి నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో పెరుగుతోంది.


సంఘ ప్రచారక్ మరియు సేవా భారతి స్థాపకులు-శ్రీ విష్ణుజీ ఆలోచనల నుండి ఉద్భవించిన మాతృఛాయ 1997లో నిర్మించబడింది, ఇది మధ్యప్రదేశ్లో మొదటి చట్టబద్దమైన అంతర్జాతీయ దత్తత కేంద్రం. 400 మంది పిల్లలలో 350 మంది, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంతోషంగా మరియు సంతృప్తికరంగా జీవిస్తున్నారు. పిల్లలందరినీ చూసుకునే సోదరీమణులను యశోదా వారసులు అంటారు. తమ జీవితంలో 15 సంవత్సరాలు ఇక్కడ గడిపిన పంచఖేడే దంపతులు ఇక్కడ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులు అయ్యారు.

మాతృఛాయ కుటుంబంతో వారిద్దరి అనుబంధం ఎలావుందంటే, తల్లిదండ్రులు ఏదైనా బిడ్డను దత్తత తీసుకోవడానికి వచ్చినప్పుడు, బిడ్డ విడిపోవడం బాధగా ఉంటుందని సుధా తాయ్ పంచఖేడే చెప్పారు. కానీ అదే సమయంలో అతని లేదా ఆమె భవిష్యత్తు మరియు సంతోషం గురించి కలిగే ఆలోచన వారి బాధను కట్టడి చేస్తుంది. సుధా తాయ్, తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లి చాలా సంతోషంగా ఉన్న 3 ఏళ్ల బాలుడు అవినాష్ గురించి చెబుతూ అప్పటికే తన కోసం అలంకరించిన తన గది ఫోటోని ఉత్సాహంగా చూపించాడు అన్నారు. కావేరి గురించి మాట్లాడుతూ, తన తల్లిదండ్రులతో స్పెయిన్లో సులభంగా కలిసిపోవడానికి కావేరి స్పానిష్ క్లాసులు తీసుకున్న విషయం కూడా చెప్పారు. గతంలోకి వెళితే, హమీదియా ఆసుపత్రి వ్యర్థాలలో అప్పుడే పుట్టిన మగబిడ్డ-అవినాష్ కనిపించిన భయానక రాత్రిని మాతృఛాయ ప్రజలు మరచిపోలేదు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి మరియు చాలా ప్రయత్నాల తరువాత అకాల బాలుడు జీవించాడు.


మాతృఛాయ మధ్యప్రదేశ్లో మొదటి అధికారక దత్తత కేంద్రమైన ఒక సంతోషకర కుటుంబం. హిందూ సంస్కృతిలో పేర్కొన్న విధంగా అన్ని ఆచారాలు నిర్వహించబడతాయి మరియు జరుపుకుంటారు. భద్రత దృష్ట్యా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాతృఛాయ కమిటీ వైస్ ప్రెసిడెంట్-అమితా జైన్ మాట్లాడుతూ, ప్రతి ఆయా బిడ్డను వారసునిగా చూసుకోబడుతుంది. శిశువులకు రోజుకు రెండుసార్లు మసాజ్ చేయడంతోపాటు వారికి పౌష్టికాహారం అందించబడుతుంది. పెద్ద పిల్లలు తమ పాఠశాల అనంతరం ట్యూషన్ తీసుకుంటారు. సాయంత్రం డ్రాయింగ్, కార్డ్ మేకింగ్ లేదా మ్యూజిక్ వంటి సృజనాత్మక అంశాలు ఉంటాయి. వికలాంగ పిల్లలకు కూడా మంచి సంరక్షణ లభిస్తుంది. సేవాభారతి కుటుంబాలు అన్ని పండుగలలో పిల్లలతో కలిసి తమ ఆనందాన్ని పంచుకుంటాయి. పిల్లలను నెలకు ఒకసారి జూ, మ్యూజియంలు లేదా షాపింగ్ మాల్ వంటి ప్రదేశాలకు ఒక రోజు పర్యటనకు తీసుకువెళతారు.

మాతృఛాయను విడిచిపెట్టిన తర్వాత కూడా కమిటీ, పిల్లలు మరియు తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉంటుంది. వీరంతా ఒకరికొకరు బలమైన బంధాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విజయాన్ని మాతృఛాయ కుటుంబంతో పంచుకుంటారు. బయట వేలాడదీసిన ఊయల పిల్లలకు ఎప్పుడు స్వాగతం చెబుతూనే ఉంటుంది. అయినప్పటికీ కొందరు శిశువును పొదల్లో లేదా సంచుల్లో వదిలివేస్తారు. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు మాతృఛాయ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తుతాయి.

1099 Views
अगली कहानी