सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

అనాధల ఆశయ సాధన నిలయం - వాత్సల్య విద్యా మందిరం

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

ప్రతి ఒక్కరి జీవితంలో తన దైవిక ఉనికిని వ్యక్తిగత స్పర్శను అందించడానికి భగవంతుడు తల్లితండ్రులను సృష్టించాడు. కానీ వారి విషయంలో విధి కొంత అన్యాయంగా ఉంది, ఎందుకంటే వారు భగవంతుని ప్రత్యక్ష అవతారమైన తల్లితండ్రులనుండి నుండి వేరు వేరు చేయబడి అనాధలుగా మార్చబడ్డారు. బాధగావుంది…. కాదా? అవును, కానీ ప్రతి విచారకరమైన కథకు అదేరకమైన ముగింపు కూడా ఉండాల్సిన అవసరం లేదు, కొంతమంది పిల్లల విషయంలో సంతోషకరంగా కూడా ఉంటుంది. అదే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఉన్న వాత్సల్య మందిర్-అనాథాశ్రమం.

అనాథ పిల్లలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుండి, ఒక బిడ్డకు అవసరమైన ప్రేమ మరియు సంరక్షణతో నిండిన ఇంటిని ఇవ్వాలనే తపనతో, RSS స్వయంసేవకులలో ఒకరైన శ్రీ యతీందర్ సింగ్ జీ 2004లోవాత్సల్య మందిరాన్ని స్థాపించారు. యతీందర్ జీ, రోజు మన మధ్య లేకపోయినా, అనాథల పట్ల ఆయనకున్న ప్రేమ ఇప్పటికీ వాత్సల్య మందిర్ ఆకృతిలో సజీవంగా ఉంది. మందిరం ప్రతిష్టాత్మక IITలో 320 అఖిల భారత రాంక్ సాధించిన బ్రిజేష్ థరూ మరియు NDA ప్రవేశం కోసం సిద్ధమవుతున్న గిరిజన బాలుడు పవన్ పాల్ వంటి చాలా తెలివైన పిల్లలకు నిలయంగా వుంది. యువ ప్రతిభావంతులిద్దరూ కేవలం 4 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వాత్సల్య మందిరానికి వచ్చారు.


పండిట్ దీనదయాళ్ సనాతన్ ఇంటర్ కాలేజ్ ప్రాంగణంలో 28 మంది పిల్లలకు వసతి కల్పించిన వాత్సల్య మందిర్ విద్యార్థి యొక్క మొత్తం ఎదుగుదలను నిర్ధారిస్తుంది. కంప్యూటర్ విద్య అయినా, సంగీతం అయినా, కథక్ డ్యాన్స్ అయినా, క్రీడలైనా, వివిధ వృత్తిపరమైన శిక్షణ అయినా పిల్లలకు అందుబాటులో ఉంటాయి. “ వ్యవస్థ నిర్వహణకు నెలకు 70,000 నుండి 1 లక్ష రూపాయల వరకు అయ్యే ఖర్చులన్నీ యతీందర్ జీ తండ్రిగారు మరియు పూర్వి ఉత్తరప్రదేశ్కు క్షేత్ర సంఘచాలక్గా ఉన్న శ్రీ వీరేంద్రజీత్ గారు సమకూరుస్తారు. శ్రీ నావల్ కిషోర్ గారు, పూర్వి ఉత్తరప్రదేశ్కు చెందిన సేవా ప్రముఖ్, యతీందర్ జీ అకాల మరణం తర్వాత, ఆయన భార్య నీతా గారు వాత్సల్య మందిర్ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.


ఇక్కడ చాలా మంది పిల్లలు వెనుకబడిన, గిరిజన ప్రాంతాలైన బలరాంపూర్, లఖీంపూర్, బహరైచ్ మరియు మాణిక్పూర్ నుండి వచ్చారు. అంతరించిపోయే దశలో ఉన్న గౌడ్, థోర్, కోల్ వంటి గిరిజన వర్గాల పిల్లలను వనవాసి కళ్యాణ్ ఆశ్రమ వాలంటీర్లు ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం పండిట్ దీనదయాళ్ సనాతన్ ఇంటర్ కాలేజ్లో ఆఫీస్ స్టాఫ్గా పనిచేస్తున్న సోనమ్, ఇక్కడకు వచ్చిన చాలా మంది పిల్లలలో ఒకరు. అడవి ఎలుగుబంటి వల్ల కలిగే గాయాలకు తన తల్లిదండ్రులు ఎలా లొంగిపోయారో మరియు విషాద సంఘటన ఆమెను ఇద్దరు తోబుట్టువులతో ఇక్కడకు వచ్చేలా చేసిందనేది కూడా ఆమెకు గుర్తులేదు.

ఒకప్పుడు సంఘ ప్రచారక్గా ఉన్న సురేష్ అగ్నిహోత్రి మరియు ఆయన భార్య మీనా గారు వాత్సల్య మందిరంలో పిల్లలను వారి తల్లిదండ్రులుగా చూసుకున్నారు. వారు పిల్లలకు అన్ని ఆప్యాయతలను ఇస్తూ క్రమశిక్షణను సైతం నేర్పారు. వాత్సల్య మందిరంలో రోజూ ఉదయం 4:30 గంటలకు యోగా సెషన్తో ప్రారంభమవుతుంది. ఇది కాకుండా శుభ్రపరచడం, రోజువారీ కొనుగోలు, వంటగది నిర్వహణ మరియు ఇతర బాధ్యతలను పిల్లలు స్వయంగా నిర్వహిస్తారు. ఇటీవలే వాత్సల్య మందిరానికి చెందిన, జై, పవన్, సంధ్య 2000 మీటర్ల రేసులో పతకం సాధించి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు.

645 Views
अगली कहानी