सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

సమాజం పట్ల అంకితభావం ఆదర్శవంతమైన వ్యక్తిత్వం

డా. శాంతా ఠాకూర్ | మహారాష్ట్ర

parivartan-img

పదవీ విరమణ తరువాత మీ ప్రణాళిక ఏమిటి??? ఇంకా ఆలోచించలేదా? అయితే ఆలోచించండి! ఎందుకంటే సమాజానికి మరియు దేశానికి మీ అవసరం చాలా ఉంది. ఈ విషయాన్ని దృడంగా విశ్వసించే మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న సంఘ్ స్వయంసేవక్ శ్రీ రవి కర్వేని ఇప్పుడు కలుద్దాం. టి. జె. ఎస్. బి. కో-ఆపరేటివ్ బ్యాంక్ నుండి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసిన తరువాత, అతను తన నలుగురు సహచరులతో కలిసి, గత 10 సంవత్సరాలలో, మహారాష్ట్రలోని అనేక చిన్న గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లోని మురికివాడల నుండి సుమారు 2500 మంది పిల్లలకు విజయగాథలు రాయడానికి అవకాశం కల్పించడమే కాకుండా వారికి సమాజం నుండి తీసుకోవడం పాటు సమాజానికి ఇవ్వడం కూడా నేర్పించారు. విద్యార్థి వికాస్ యోజన కింద 2010 నుంచి 2022 వరకు 2500 మందికి పైగా పిల్లలకు ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను రూ.10 కోట్ల 95 లక్షల సాయంతో చెల్లించారు. ఇది మాత్రమే కాదు, రాయ్‌గఢ్ మరియు థానే జిల్లాల్లో 6 శిథిలమైన పాత పాఠశాల భవనాల పునర్నిర్మాణం కూడా జరిగింది. సంఘ్ స్వయంసేవక్ కార్వే జీ మరియు అతని బృందం ప్రతిభావంతులైన పేద పిల్లలకు మరియు సేవాభావం ఉన్న ధనిక కుటుంబాలకు మధ్య వారధిగా పనిచేశారు, తద్వారా డబ్బు లేకపోవడం ప్రతిభావంతులైన విద్యార్థుల పట్ల సంకెళ్లుగా మారదు.


మేఘాలు సూర్యుడిని ఎంతసేపు కప్పివేయగలవో, స్వాతి సింగ్‌ని కలిసిన తర్వాత మీరు కూడా అదే చెబుతారు. ఘట్కోపర్ దగ్గర బస్తీలో నివసించే స్వాతి జీ ఇల్లు వర్షాకాలం లో 3 నెలల పాటు చెరువుగానే ఉండేది. కానీ చదువులో ఆమె ఎప్పుడూ టాపర్‌గానే కొనసాగింది మరియు 12వ తరగతి తర్వాత విద్యార్థి వికాస్ యోజన సహాయంతో బి.యస్ సి. మరియు ఎం యస్ సి., పూర్తి చేసి ఈ రోజు ఏడాదికి 19 లక్షల ప్యాకేజీతో బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు షోలాపూర్‌లో తన ఒంటరి తల్లి కష్టానికి మరియు సంకల్పానికి సజీవ ఉదాహరణగా మారిన అంజలి లోఖండే జీ ని కలుద్దాం. టిన్ షేడ్ లోని చిన్న గుడిసెలో తన మెడల్స్, అవార్డులను ఒక బుట్టలో దాచుకునే అంజలి, నేడు మెకానికల్ ఇంజినీరింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి, పెద్ద ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ తన తల్లితో కలిసి నాగపూర్‌లో నివసిస్తోంది. అంజలి తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేయడమే కాకుండా, తన గురించి తన తల్లి ఊహించిన భవిష్యత్తును కూడా గడుపుతోంది. ఇదంతా విద్యార్థి వికాస్ యోజనలో చేరడం ద్వారా ఆమె ఇంజనీరింగ్ ఫీజును ఒక పెద్దాయన చెల్లించినందున ఆమె దీన్ని చేయగలిగింది.

చిన్న చిన్న గ్రామాలు, పల్లెటూర్లు, మురికివాడల నుంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీ, మెడికల్, ఇంజినీరింగ్ సెక్టార్లలో తమ గుర్తింపును నమోదు చేసుకున్న ఈ చిన్నారుల అద్భుత పరివర్తనకి ఆధారం ఏమిటి??? పిల్లలను ఎలా ఎంపిక చేస్తారు?? విద్యార్థి వికాస్ యోజన అంటే ఏమిటి ??? మీరందరూ అదే ఆలోచిస్తున్నారు, కాదా?

మొదటి నుండి ఈ పనిలో ఉన్న స్వయంసేవక్ అరుణ్ కుమార్ జీ మాట్లాడుతూ, 2010లో, మొదటగా, ప్రతిభావంతులైనప్పటికీ, వారి కలలపై రాజీ పడుతున్న 5 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎందుకంటే ఆ విద్యార్థుల తల్లితండ్రులు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు కట్టలేకపోయారు. ఈ ఐదుగురు పిల్లల ఫీజులను రవి జీ ని బ్యాంకులో సంప్రదించిన కొందరు దాతలు చెల్లించారు. అది చూసి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చారు, ఇలా మొదలైనది ఈ ప్రయాణం. 2017లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా నడుస్తున్న "సేవా సహయోగ్ సంస్థ" ఈ పనికి ఒక సంస్థాగత రూపం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.

ఈ సహాయం పేదవారికే కాకుండా దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా కల్పించారు. ఈ రోజు, ఈ పనికి సంబంధించి దాదాపు 80 మంది వాలంటీర్లు అలాంటి విద్యార్థుల కోసం వెతుకుతూ వుంటారు, ముందుగా 10 వ తరగతిలో 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చి తదుపరి రుసుములు చెల్లించుకోలేకపోతారో అలాంటివారి గురించి తెలుసుకొని, వారిని సంప్రదించి ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బాగా అర్థం చేసుకుని,  10, 12 తర్వాత 4 సంవత్సరాల కాలేజీ, హాస్టల్, ట్రైనింగ్ మొదలైనవాటికి వారు కోరుకున్న వృత్తి విద్య కోసం ఎప్పటికప్పుడు ఫీజులు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థి వికాస్ యోజన తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసే పొదుపుకు మరియు మంచి కళాశాలలో 4 సంవత్సరాలు చదివేందుకు అవసరమైన విద్యా రుసుము మధ్య వ్యత్యాసాన్ని పూరిస్తుందని ఇక్కడ తెలుసుకోవడం చాలా ముఖ్యం.


విద్యార్థి వికాస్ యోజన వల్ల అనేక మంది దాతల ద్వారా వేలాది మంది చిన్నారులకు అందమైన భవిష్యత్తు రూపుదిద్దుకోవడమే కాకుండా రానున్న కాలంలో ఆదర్శవంతమైన సమాజం కూడా రూపుదిద్దుకోనుందని సేవా సహయోగ్ ముంబై డైరెక్టర్ల బోర్డులో ఒకరైన కిషోర్ మోఘే చెప్పారు.  ఎందుకంటే ఈ రోజు సమాజ సహకారంతో ముందుకు సాగుతున్న ఈ పిల్లలు రేపు క్రమంగా దాతల జాబితాలో చేరడం ప్రారంభిస్తారు. దీనికి గొప్ప ఉదాహరణ శాస్త్రవేత్త సచిన్ సూర్యవంశీ. ప్రస్తుతం ఫార్మసీ రంగంలో సచిన్‌కు మంచి పేరుంది. విద్యార్థి వికాస్ యోజన సహాయంతో చదివిన సచిన్, బ్యాంకులో 1.4 లక్షల రుణం తీసుకుని ఇద్దరు పిల్లల చదువుకు పూర్తి బాధ్యత తీసుకుని తన జీతం నుంచి ఈ రుణాన్ని బ్యాంకుకు తిరిగి ఇచ్చాడు.

సచిన్‌లా సమాజ రుణం తీర్చుకోవాలనే భావన ఇక్కడితో అనుబంధం ఉన్న ప్రతి విద్యార్థిలో ఉంటుంది. అందుకే ఈ పిల్లలకు ఫీజులు కట్టేది ఎవరో తెలియదు కానీ ఈ రోజు సమాజం వారికి సహాయం చేయడానికి వారికి అండగా నిలుస్తుందని మరియు భవిష్యత్తులో వారు ఈ పాత్రను పోషించాలి అని మాత్రం తెలుసు.

ఒక వ్యక్తి ఆలోచనపై వయస్సు పరిమితి ఎప్పుడూ ఉండదు, జీవితపు మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి తన బాధ్యతలు, ఇల్లు, కుటుంబం మరియు సంబంధాలను చూసుకుంటాడు, మరోవైపు, జీవితంలోని రెండవ అధ్యాయంలో, అతను సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే, మనం సమాజం నుండి ఏమి తీసుకున్నామో, దానిని కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలి అని అనుకుంటే, ఇది అంత కష్టం కాదు. ఈ రోజు, 2500 మంది పిల్లల భవిష్యత్తు రూ. 10 కోట్లతో మెరుగుపడింది, ఎందుకంటే జీవితంలో రెండవ అధ్యాయంలో, సమాజానికి మరియు దేశానికి మీ ముఖ్యమైన సహకారాన్ని అందించడానికి మీకు చాలా సామర్థ్యం మరియు అనుభవం ఉంటుంది. భావితరాలకు బంగారు కలాన్ని అందించిన రవీంద్ర కార్వే జీ, అరుణ్ కర్మాకర్ జీ, శరద్ గంగల్ జీ, రాజు హెంబర్డే జీ, అభిజీత్ ఫన్నీస్ జీ ఇలా నిరూపించారు.

506 Views
अगली कहानी