सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

కిశోరీ వికాసమే సమాజ వికాసము కిశోరీ వికాస్ కేంద్రం

కిషన్ జీ మర్ల | తెలంగాణ

parivartan-img

నిత్యం రద్దీగా వుండే హైదరాబాద్ అమీర్ పేట కూడలి వద్ద ఒక తల్లి కూతురు దీన అవస్థలో ఉండడాన్ని గమనించి ఒక మాతృమూర్తి హృదయం కరిగి తల్లిని పలకరించగా, ఒక ఆటో డ్రైవర్ తన కూతురుని ఎత్తుకుపోయి కొన్ని రోజుల తరువాత ఇక్కడ వదిలేసాడని దీనంగా తల్లి చెప్పగా, చెవులు భయంకరమైన అన్యాయాన్ని విన్నాయి, దానితో కళ్ళు మబ్బులు కమ్మాయి, ఏమి చెయ్యాలో తెలియక కాళ్ళు సేవాభారతి కార్యాలయం వద్దకు పరుగులు తీశాయి, చేతులు సహాయాన్ని అర్ధించాయి. అప్పటికే తెలంగాణ ప్రాంతంలో తల్లి తండ్రులు లేని బాలికలకు అన్నీ తానై చూసుకుంటున్న వైదేహి ఆశ్రమం, నగరంలో ఉన్న బస్తీలలో నివసిస్తూ చదువు మధ్యలో ఆపేసిన  అమ్మాయిలను చేరదీసి వారిలో ఆత్మ స్థైర్యం నిoపి వారికీ కాలేజి ఫీజులు చెల్లిoచి పై చదువులకు సహకరిoచడoతొ పాటు వారికి వృత్తి విధ్య, యోగ, కరాటే, oస్కారo ,దేశభక్తి నిoపుతూ ముందుకు సాగుతున్న వదేహి కిశోరీ వికాస్ కేంద్రాల గురించి తెలుసుకుని, ఆశ్రమ నిర్వహణకు సంబందించిన ముఖ్యులు ఆనాటి ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సంఘచాలకులు టి.వీ దేశముఖ్ గారు, దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ పట్లోళ్ల రామిరెడ్డి గారు, తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారిని సంప్రదించగా, ఇలాంటి పరిస్థితి వేరే అమ్మాయికి మరియు తల్లి తండ్రులకు రాకూడదు అంటే సంపూర్ణ వికాసమే శరణ్యమని ప్రకల్పించిన కార్యక్రమమే కిశోరీ వికాస్ కేంద్రం.


కిశోరీ అనగా యువతి అని అర్ధం. కిశోరీల సంపూర్ణ వికాసము అంటే సమాజ వికాసమే, ఇది ముందుగా బస్తీ నుండి ప్రారంభం కావాలి అంటే బస్తీ కేంద్రం గా ఒక కార్యక్రమం ప్రారంభం కావాలని సంకల్పించిన యజ్ఞమే కిశోరీ వికాస్ కేంద్రం. కానీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నిరంతర పరిశ్రమ కావలి, ఎన్నో అవరోధాలు దాటాలి, సామర్ధ్యం తల్లులకే ఉంటుంది అని గ్రహించి అప్పటికే సేవాభారతి ద్వారా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న జయప్రదగారికి , కిరణ్మయిగారికి , శంభుని కుమార్ గారికి , ఏరుకొండ నర్సింలు గారికి , అంబాదాస్ గారికి   బాధ్యతలను అప్పగించారు.

కేంద్రం పారంభించిన తరువాత ఎదురైన ఒడిదుడుకులను పరిగణలోకి తీసుకుంటే, కిశోరీ వికాస్ కేంద్రం అనేది మొదట ఒక వృత్తి విద్యా కేంద్రం గా రూపు దిద్దుకుంది. బస్తీలలో వృత్తి విద్యా శిక్షణ లో భాగంగా ఆడపిల్లలకు, మహిళలకు కుట్లు, అల్లికలు, హోలీ పండుగ లో వాడే సహజ రంగులు, మట్టి గణేష్ ప్రతిమలు, ప్రమిదలు తయారీ, గోమయ ఉత్పత్తుల లో శిక్షణ ఇస్తారు అందువలన వారు స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. యుక్త వయసులో ఉన్న యువతులకు యోగ, కరాటే, కర్రసాము లాంటి ఆత్మసంరక్షణకు సంబందించిన విషయాలు నేర్పిస్తారు. కానీ ఎక్కడో చిన్న కొరత, ఆలోచించి, అందరి అభిప్రాయాలు సేకరించి చర్చించగా ఒక పరిష్కారం లభించింది, అదే ట్యూషన్ సెంటర్స్ ప్రారంభించేందుకు బీజమైనది. ప్రతి బస్తీలో వృత్తి విద్యతో పాటు ఒక ట్యూషన్ సెంటర్ ప్రారంభించుట తద్వారా బస్తీలో నివసిస్తున్న పిల్లకు చదువు, సంస్కారం మరియు పిల్లల ద్వారా బస్తీలో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన  పెంపొందించడం కార్యక్రమం యొక్క లక్ష్యం.


ఆలోచనే ఆలస్యం అన్ని అంతలోనే సమకూరిపోయాయి. కార్యక్రమం ముందుకు తీసుకు వెళ్ళడానికి జయప్రదగారికి కిశోరీ కేంద్రాల నిర్వాహకులుగా పనిచేసిన ఆండాళ్ళు, రమ, కల్పన, కవిత, మమత, గిరిజ, మీనా తోడయ్యారు. కొర్రవాని తండాలో బాల్యవివాహాలు సర్వ సాధారణం, కవిత తల్లి తండ్రులు కూడా 10-12 వయసులో కవిత కు పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు. సేవా భారతి కార్యకర్తలు మాట్లాడి అమ్మాయి కిశోరీ వికాస్ సెంటర్ నడుపుతూ చదువు కొనసాగించే విధంగా చేయడం వలన ఇప్పుడు తాను పీజీ చదివి ఒక స్కూల్ లో యోగ మరియు డాన్స్ టీచర్ గా చేస్తోంది, ఇప్పటికీ కిశోరీ కేంద్రాల నిర్వహణలో చురుకుగా పాల్గొంటోంది. " ఒక్క సెంటర్ వలన తండాలో సుమారు 20 బాల్య వివాహాలను ఆపగలిగాము" అని మీనా గారు అన్నారు. చిన్నప్పుడే తండ్రి చనిపొయి, అన్న కుటుంబం తో ఉంటూ అమ్మను చూసుకుంటూ అన్న పిల్లలతో సహా 30 మంది పిల్లలకు ఒక కిశోరీ కేంద్రం నడుపుతూ ఉన్న శ్రావణి పట్టుదలతో B.Tech పూర్తి చేసి ఒక MNC కంపెనీ లో IT ఉద్యోగం సంపాదించింది, ఇప్పటికీ బస్తీలో మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తోంది. సరిత తండ్రి వాచ్ మాన్ మరియు తనకు కంటికి సంబందించిన వైకల్యం వుంది, స్నేహితుల ద్వారా సేవాభారతి గురించి తెలుసుకుని తన బస్తీలో ఒక కేంద్రం ప్రారంభించి చదువు కొనసాగించింది, ఇప్పుడు IT ఉద్యోగం చేస్తోంది. సేవాభారతి కార్యకర్తలు అనురాధ గారు మరియు సేవాభారతి ట్రెజరర్ హరీష్ గారు IT లో కావలసిన శిక్షణ ఇస్తూ ఇప్పటికే 8 మంది IT ఉద్యోగం సంపాదించడానికి కారణం అయ్యారు. ఇలా చాలామంది అమ్మాయిలు బస్తీలలో వికాసం వైపు అడుగులు వేస్తున్నారు.

భాగ్యనగరం లో షేక్ పేట దగ్గర మహాత్మా గాంధీ నగర్ లో చాలా మంది దూరాలవాట్లకు బానిసలయ్యి అసాంఘిక కార్యకలాపాలు సాగించేవారు. చెట్టుపొదల్లో చిన్నారుల సవాలు దొరికిన కొన్ని సంఘటనలు అక్కడ పరిస్థితులకు అద్దం పడుతుంది. బస్తీలో ఒక చెట్టు క్రింద కిశోరీ వికాస్ సెంటర్ ప్రారంభించాక చాలా మందిలో మార్పు వచ్చింది. పిల్లలు బాగా చదువుకుంటున్నారని తల్లితండ్రులు చెడు అలవాట్లకు దూరం కాగా , తల్లి తండ్రులలో వచ్చిన మార్పు చూసి పిల్లలు ఇంకా బాగా చదవడం ప్రారంభించారు. ఇది చూసి కొంతమంది యువకులు దురలవాట్లు మానుకుని కొంత డబ్బుతో చెట్టుకింద వున్న హనుమంతుని మందిరమునకు ఒక షెడ్ వేసి అక్కడ కిశోరీ సెంటర్ నిర్వహణకు సహాయం చేశారు. విధంగా బస్తీలో మార్పు ప్రారంభం అయి పక్కనే వున్న అన్ని బస్తీలలో సెంటర్స్ ప్రారంభమునకు కారణం అయినది, ప్రస్తుతం ప్రదేశంలో 80 కి పైగా కేంద్రాలు నడుస్తున్నాయి.


ఇలా దినదిన ప్రవర్తమానంగా వృద్ధి చెందుతూ కిశోరీ వికాస్ కేంద్రాలు పిల్లలకు విద్య, క్రమశిక్షణ, వ్యాయామము, పౌష్ఠిక ఆహార అలవాట్ల అవగాహన, ఉల్లాసము, ఉత్సాహము, వివేకము, మరియు మహిళలకు స్వావలంబన, మహిళా సాధికారత, ఆరోగ్య భద్రత మొదలగు వాటికి కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. ఇప్పటికి తెలంగాణ ప్రాంతం లో సుమారు 263 సెంటర్స్ లో 8000 మంది ఆడపిల్లలు ప్రత్యక్షంగా మరియు అనేకమంది పిల్లలు , పెద్దలు, మహిళలు పరోక్షణం గా లాభపడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి కావలసిన నిదిని ప్రతి సంవత్సరం, కిశోరీలు, నిర్వాహకులు మరియు స్వయంసేవకులు కలిసి 'రన్ ఫర్ గర్ల్ చైల్డ్' అనే కార్యక్రమం ద్వారా సమకూరుస్తారు. ఇది హైదరాబాద్ లో నిర్వహించే అతి పెద్ద ఫిట్ నెస్ కార్యక్రమాలలో ఒకటి కావడం కార్యకర్తల కార్యసాధనకు నిదర్శనం.

కిశోరీ కేంద్రాలు వ్యక్తిగత, బస్తీ మరియు గ్రామ వికాసమే కాకుండా సామాజిక బాధ్యత అయినా సేవలో కూడా తమవంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి, దానికి ఉదాహరణ కరోనా మహమ్మారిలో కిశోరీల ద్వారా బస్తీలలో జరిగిన సేవా కార్యక్రమాలు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వంవారు కానీ , సేవా కార్యాలు నిర్వహిస్తున్నవారు కానీ ప్రత్యక్షంగా బస్తీలలోకి వెళ్లలేని పరిస్థితి. మహమ్మారి సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరికయినా మహమ్మారి సోకితే ఏమిచేయాలో తెలియని పరిస్థితి. సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పిలుపుమేరకు స్వయంసేవకులు బస్తీ సేవకు నడుం బిగించారు. బస్తీలలో ఉన్న కిశోరీలతో సమన్వయము చేసుకుంటూ ప్రజలకు భోజనం, కిరాణా, మందులు, హాస్పిటల్ మరియు ఐసొలేషన్ సెంటర్ సదుపాయము, ఆక్సిజన్ సమకూర్చడము మొదలైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయగలిగారు. వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు సంబందించిన నియమాలనుండి వాక్సిన్ పై అవగాహన వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంత పెద్ద మహమ్మారిని ఎదుర్కోవడంలో కిశోరీల సేవ అనిర్వచనీయం.

1616 Views
अगली कहानी