सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

తన గతి ని తానే మార్చుకున్న గ్రామం

ఆనంద్ కందుకుర్తి | మహారాష్ట్ర

parivartan-img

తన భాగ్యాన్ని తానే తిరగ రాసుకున్న ఓ గ్రామం కథ ఇది. మహారాష్ట్రలోని ధులియా జిల్లాలోని సక్రి తాలూకాలో కేవలం 94 కుటుంబాలతో కూడిన ఈ గిరిజన గ్రామం, మానవుడు ప్రకృతితో స్నేహం చేస్తే, గ్రామ వనరుల కొరతను శాశ్వతంగా తొలగించవచ్చని నిరూపించింది. ఒకప్పుడు చుక్క నీటి కోసం తహతహలాడిన బరిపాడ గ్రామస్తులు, తమ క్రమబద్ధమైన కృషి ఫలితంగా నేడు సమీపంలోని ఐదు గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు.

ఒకప్పుడు కేవలం 15 హెక్టార్ల భూమి మాత్రమే సాగుచేయబడిన ఈ గ్రామంలో, నేడు 120 హెక్టార్ల భూమిలో మూడు కాలాల పంటలు సాగు చేస్తున్నారు. ఉల్లి, పప్పులు మరియు స్ట్రాబెర్రీ వంటి వాణిజ్య పంటల సేద్యం కారణంగా ఈ గ్రామంలో ఇప్పుడు ఏ కుటుంబమూ పేదవారు కాదు. గ్రామానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ యువకుడు చైత్రం పవార్ ఈ మార్పుకు రూపశిల్పి. వనవాసి కళ్యాణ్ ఆశ్రమ స్ఫూర్తి, సహకారంతో ఈ మార్పు అటవీ సంరక్షణ కార్యక్రమం తో ప్రారంభమైంది. గ్రామస్తులు మరియు అటవీ శాఖ, సంయుక్తంగా బరిపాడ గ్రామం చుట్టూ 450 హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవిని, దాని పచ్చదనాన్ని పునరుద్ధరించారు. ఈ ఒక్క ప్రయత్నమే ఈ గ్రామానికి అభివృద్ధి మార్గం తలుపులు తెరిచింది. పేరు మరియు కీర్తితో పాటుగా భారతదేశ బయో డైవర్సిటీ మరియు 2003లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అవార్డులతో అభినందించబడినది. మొత్తంగా ఈ గ్రామం 33 అవార్డులతో గౌరవించబడింది.

కోకనా మరియు భిల్ తెగలకు చెందిన ప్రజలు నివసించే ఈ గ్రామంలో, పంతొమ్మిది వందల ఎనభైల నాటి నుండి ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత నీటి కొరత ఏర్పడేది. అప్పట్లో బరిపాడలో కేవలం రెండే రెండు బావులు ఉండేవి. అవి ప్రతి డిసెంబర్ నెల నాటికి పూర్తిగా ఎండిపోవడంతో ఆ ఊరి ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ ఆరు నెలలు వలసలు వెళ్లేవారు. ఒకవేళ ఊరిలోనే ఉంటే ఒక్క వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవించ లేక పోయేవారు. ఈ కారణంగా అడవి కలప నరికి అక్రమ రవాణా చెయ్యడం, మహువ మద్యం అమ్మడం వంటి అక్రమ వ్యాపారాలు వారికి ఆదాయ దారులు అయ్యాయి. మహిళల లో ఎక్కువమంది ఈ వ్యాపకాలలో పాల్గొనేవారు.

బరిపాడ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని వార్సా గ్రామంలో ఉన్న వనవాసి కళ్యాణ్ ఆశ్రమం యొక్క వైద్య కేంద్రాన్ని ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న సంఘ్ ప్రచారక్ డాక్టర్ ఆనంద్ పాఠక్ మాట్లాడుతూ, "వాస్తవానికి గ్రామంలోని ఏ పిల్లవాడు ఎప్పుడూ నిరంతరం చదువుకోలేడు, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఆరు నెలలు మాత్రమే గ్రామంలో నివసిస్తారు. ఆహారాన్ని వండుకోడానికి వంట కలపను గ్రామ మహిళలు మైళ్ల దూరం నుండి తీసుకురావల్సి ఉండేది, నీటి కోసం గ్రామస్తులు ఎంతో శ్రమ పడి ఎండిపోయిన నదీ గర్భంలో గుంతలు తవ్వి మాత్రమే నీటిని సేకరించాల్సి వచ్చేది".

చైత్రంజీ మరియు డా. ఆనంద్ గార్లు, కళ్యాణ్ ఆశ్రమ కార్యకర్తలతో కలిసి పోడు భూమిపై, ఆధార పడితే, అభివృద్ధి అనే పంట పండదని గ్రామస్థులను ఒప్పించగలిగినప్పుడు ఈ మార్పు సంభవించింది. వనవాసి గ్రామస్తులు అటవీ సంపదను కాపాడటానికి అటవీ శాఖతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. చైత్రం జీ మాట్లాడుతూ, "గ్రామంలోని వృద్ధులు అడవిని రక్షించే బాధ్యతను వంతులవారీగా తీసుకున్నారు. అక్రమంగా చెట్లను నరికివేయడాన్ని అరికట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు మరియు అటవీ కలపను తలపై, ఏడ్ల బండ్లపై అక్రమ రవాణా చేసే వారి నుండి వివిధ జరిమానాలను వసూలు చేయడం ప్రారంభించారు.


ఇది ఒక మొదలు మాత్రమే! ఆ తర్వాత ఊరి ప్రజలు వెనుదిరిగి చూడలేదు. తర్వాత గ్రామానికి నీటి వసతి ఏర్పాటు వంతు వచ్చింది. అటవీ శాఖ సహకారంతో వనవాసి గ్రామస్తులు శ్రమదానం ద్వారా నీటి సంరక్షణ కోసం చిన్న చిన్న చెక్డ్యామ్లను నిర్మించారు. గత 30 ఏళ్లలో సుమారు 600 వాటర్షెడ్ నిర్వహణ పనులను గ్రామస్తులు పూర్తి చేశారు. దీని ఫలితంగా నేడు గ్రామంలో, ఏడాది పొడుగునా నీరు అందించే బావులు 40 ఉన్నాయి,. ఇది మాత్రమే కాదు, గ్రామ కమిటీ ప్రతి కుటుంబం వారి పిల్లలను తప్పని సరిగా పాఠశాలకు పంపాలని, లేకుంటే జరిమానా చెల్లించాలని నిర్ణయించింది. జరిమానాలను తప్పించుకోవడానికి, పిల్లలు, ప్రభుత్వం ప్రారంభించిన పాఠశాలల్లో చేరడం ప్రారంభించారు.

మహిళలను స్వావలంబన కలిగి ఉండేలా తీర్చిదిద్దేందుకు వనవాసి కళ్యాణ్ ఆశ్రమ కార్యకర్తల ఆధ్వర్యంలో పదిహేను గ్రామ మహిళల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రారంభించారు. పండించిన ప్రఖ్యాత బరిపాడ బియ్యాన్ని అమ్ముకునేందుకు రైతు ఉత్పాదన సంస్థ ఏర్పడి, దానీ ద్వారా ఇప్పుడు ఈ బియ్యాన్ని పరిసర జిల్లాలకు సరఫరా చేస్తోంది. ఒకప్పుడు నాలుగో తరగతి చదువు కూడా దాటని ఆ గ్రామం నుండి, సునీల్ పవార్, మరియు అభిమత్ పవార్ లాంటి యువకులు చదువుకుని ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్నారు.


బరిపాడ యొక్క "వనభాజీ మహోత్సవం" అనే ఒక ప్రత్యేకమైన పండుగ, గత 18 సంవత్సరాలుగా తరచుగా స్థానిక పత్రికల ముఖ్యాంశాలలో ఉంటుంది. ఒక తరం నుండి మరో తరానికి జ్ఞాన సంపద బదిలీకి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. కెనడాలో పీ హెచ్ డీ ని అభ్యసించి ఇక్కడకు పరిశోధన కి వచ్చిన శైలేష్ జీ శుక్లా ఈ వన మహోత్సవ్ ఆలోచనను అభివృద్ధి చేశారు. ఇందులో వంటల పోటీ నిర్వహించి, పోటీలో పాల్గొనే మహిళలు ఆ వంటకం తయారీలో అడవిలో పండించి, ఉపయోగించిన కూరగాయలలోని ఔషధ గుణాల గురించి చెప్పాల్సి ఉంటుంది. 

ఈరోజు చైత్రం పవార్ గ్రామస్తుల మధ్య నిలిచి " మీరు ఎన్నో కోట్లకు యజమానులు" అని గర్వంగా చెప్పడం ఆశ్చర్యంగా అనిపించినా, వందలాది టేకు చెట్లతో కూడిన ఈ విశాలమైన బరిపాడ అడవి సంపద నిజంగా ఇంత విలువైనదే! నేడు టేకు కలపను కత్తిరించడం నిషేధించబడింది, అయితే భవిష్యత్తులో వారు చెట్లను నరికివేస్తే, నిబంధనల ప్రకారం గ్రామస్తులకు 50% కలప ధర లభిస్తుంది. అవును, డా. ఆనంద్ పాఠక్ మరో విషయం గర్వంగా చెప్పుకోవడం మరచిపోలేదు,- నేటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి మగవాళ్ళు వెనుకాడే దేశంలో, ఈ గ్రామంలో, చాలా మంది పురుషులు ఈ ఆపరేషన్ చేయించుకున్నారు.

978 Views
अगली कहानी