सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ఈ ఇల్లు ఆనంద ధామము

కిషన్ మర్ల | భోపాల్ | మధ్యప్రదేశ్

parivartan-img

మిల మిలా మెరిసే కళ్ళు , ముఖం లో చిరునవ్వు ఇక్కడ నివసిస్తున్నవారి గుర్తింపు. ఆనందం తో నిండిన వీరిని చూస్తుంటే వారు ఎంతోకాలం గా ఇక్కడ వుంటున్నారు అనుకోము. నేను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మధ్యలో ఉన్న "ఆనందధామ్ వరిష్ఠ జన సేవా కేంద్రం" గురించి మాట్లాడుతున్నాను. సేవా భారతి మధ్యభారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో వృద్ధులు కుటుంబ సమేతంగా సంతోషంగా జీవిస్తున్నారు.


అప్పటి సేవాభారతి అధికారులు, కార్యకర్తల దూరదృష్టి తో సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకల్పాన్ని (ప్రాజెక్ట్) ప్రారంభించారు. తులసి రామాయణం అనర్గళంగా చెప్పగలిగే శ్రీ రాజేంద్ర ప్రసాద్  గుప్తా గారు కుటుంబ కారణాలవల్ల పదిహేనేళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి డిప్యూటీ డైరెక్టర్ పదవి నుండి పదవీ విరమణ చేసిన గుప్తాజీ, అక్కడ జరిగే కార్యక్రమాలలో సొంత కవితలతో అందరి హృదయాలను ఎప్పుడూ గెలుచుకుంటారు. క్యాంపస్‌లోని పేద పిల్లలకు మూడు షిఫ్టుల్లో శిక్షణ జరుగుతుండగా, 150 మందికి పైగా పిల్లలు లబ్ధి పొందుతున్నారు.

 

ఈ కేంద్రం 18 డిసెంబర్ 2005న స్థాపించబడిందని కమిటీ కార్యదర్శి శ్రీ రవీంద్ర సురంగే చెప్పారు. ఇక్కడ పదిహేను మంది మహిళలు మరియు పదమూడు మంది పురుషులు నివసిస్తున్నారు. ఇది కాకుండా, ఈ సంస్థ ద్వారా యోగా సెంటర్, ఫిజియోథెరపీ, న్యూరో థెరపీ సెంటర్, పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్‌తో పాటు ఉచిత న్యాయ సలహా కేంద్రం కూడా ఈ క్యాంపస్ లో అందుబాటులో వున్నాయి. ఇక్కడికి వచ్చే హోమియోపతి వైద్యులు ప్రతినెలా 500 మందికి పైగా ఇక్కడ ఓపీడీ ద్వారా వయోవృద్ధులతో పాటు అందరికీ వైద్యం అందజేస్తున్నారు.


ఉదయం యోగా నుండి మొదలుకుని సాయంత్రం పూజ వరకు ఒక క్రమపద్ధతి గల దినచర్య తో పాటు,  పెద్ద వారి కోసం ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి, ఇందులో సమాజంలోని సేవాభావం ఉన్నవారు కూడా వారితో కొంత సమయం గడుపుతారు. కొంతమంది తమ పిల్లల పుట్టినరోజులను మరియు కొంతమంది జంటలు తమ వార్షికోత్సవాలను ఈ పెద్దలతో జరుపుకుంటారు.


క్యాంపస్‌లో పురుషులకు మరియు మహిళలకు ప్రత్యేక భవనాలు ఉన్నాయి, వీటితో పాటు వైద్యానికి, ధ్యానానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు గదులు, ఆలయం, ఉద్యానవనం, రిఫ్రెష్‌మెంట్ గది అలాగే లైబ్రరీ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. రిటైర్డ్ టీచర్ గాయత్రీ జీ, లేదా క్లాస్ వన్ ఆఫీసర్ దివంగత అధికారి మెహ్రోత్రా జీ భార్య ప్రేమ మెహ్రోత్రా అయినా, లేదా ప్రభా షా (బెంగాలీ అమ్మ) అయినా, ప్రతి ఒక్కరికీ వారి వారి సొంత కథలు ఉన్నాయి. గాయత్రీ జీ తన జీవితమంతా తన సామాజిక బాధ్యతలను నెరవేర్చారు కానీ ఆమె పెళ్లి చేసుకోలేదు, ఆమె ఇటార్సీలోని తన ఇంటిని దానం చేసి ఒంటరితనాన్ని అధిగమించడానికి ఇక్కడకు వచ్చారు. రోజూ హారతి అయ్యాక అందరికీ బొట్టు పెట్టి ప్రసాదం పంచే నందకిషోర్ శర్మ గారి సంతోషం ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఆయన తన సూట్‌కేసుల దుకాణం మూసేసి కూతురు, అల్లుడితో కలిసి జీవించడమే కాకుండా ఆనంద్‌ని తన కుటుంబంగా చేసుకున్నాడు.


రు ఈ సంస్థ తో ఎంత అనుబంధంగా మారారు అంటే, పెళ్లైన జంటలు నివసించడానికి ప్రాంగణంలో కొత్త భవనం నిర్మాణం ప్రారంభించినప్పుడు, ప్రేమా జీ తన పెన్షన్ నుండి లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇక్కడ మేము ఎవరికీ ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అన్ని సౌకర్యాలు, ప్రేమ మరియు ఆప్యాయతలతో 24 గంటల సంరక్షణ ఇచ్చేవారు సొంత కుటుంబంలో కూడా కనిపించడం లేదని ఆమె చెప్పారు.

మొదటి నుంచి ఈ కేంద్రంతో అనుబంధంతో ఉంటూ గతంలో క్షేత్ర సేవా ప్రముఖ్ గా ఉన్న గోరేలాల్ జీ మాట్లాడుతూ.. ఇక్కడ 60 ఏళ్లు పైబడిన వారినే ఉంచుతాం. ఫారమ్ నింపే సమయంలో, మేము కుటుంబ నేపథ్యం గురించి సమాచారాన్ని తీసుకుంటాము మరియు మొదట వారికి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం కనుగొని వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళటానికే ప్రయత్నిస్తాము. కేంద్రంలో నివసించే వారు తమ కుటుంబ సభ్యులను నిర్ణీత సమయంలో కలుసుకోవచ్చు. సేవా భారతి పూర్తికాల సభ్యుడు శ్రీ కైలాష్ కుష్వాహ మాట్లాడుతూ, ఇక్కడ నిర్వహణ కమిటీ కృషి ఫలితంగా, చాలా మంది తమ వారిని ఇంటికి తిరిగి తీసుకెళ్లారు.

చాలా బరువెక్కిన హృదయంతో, కైలాష్ జీ దివంగత ముక్తా సెహగల్ అమ్మను గుర్తు చేసుకుంటూ, ఆమెకు ఎవరూ లేరని, ఆమె ఇంట్లో పడిపోవడం వల్ల నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, సేవాభారతి ఆమెకు చికిత్స చేసి మరణించే వరకు ఆమెకు సేవ చేసింది. మరణించేముందు, ముక్తా జీ అరేరా కాలనీలో ఉన్న తన భవనాన్ని పేద బాలికల హాస్టల్ కోసం సేవా భారతికి విరాళంగా ఇచ్చారు. ముక్తాజీలాగే ఇక్కడ కూడా ప్రతి వృద్ధుడి అంత్యక్రియలు వారి కుటుంబ సభ్యులు చేసే విధంగానే జరుగుతాయి. ఈ ఆనంద్ ధామ్ తమ సొంత ఇల్లు అని అందరూ భావిస్తారు. సేవాభారతి క్షేత్ర సంఘటనా మంత్రి రామేంద్రజీ మాట్లాడుతూ..15 ఏళ్లుగా ఎలాంటి ప్రభుత్వ సాయం లేకుండా, సమాజం యొక్క సహకారంతో ఈ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.

256 Views
अगली कहानी