सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

సేవాభావంతో కూడిన సాహసం ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి నిదర్శనం

కిషన్ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

జీవితాన్ని మరియు మరణాన్ని దగ్గరనుండి చూసే వైద్యులకు ప్రతిరోజూ కొత్త పరీక్షే మరియు పరీక్షలో ఉత్తీర్ణత సాదించాల్సిందే. అయితే ఈరోజు డాక్టర్ రిషి జీవితంలో అతిపెద్ద పరీక్ష. 23 మంది పసిపిల్లల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఆసుపత్రి వార్డులో మంటలు చెలరేగాయి, అగ్నిమాపక సిలిండర్లోని గ్యాస్తో మంటలను ఆర్పే ప్రయత్నం కూడా విఫలమైంది. మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ వార్డులోని ఏసీలో మంటలు చెలరేగడంతో నవజాత శిశువులందరి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. సమయంలో సంఘ్లో ప్రధమ వర్ష పూర్తిచేసిన స్వయంసేవక్ డా. రిషి ద్వివేది, డ్యూటీలో ఉండి, తన ప్రాణాలను పణంగా పెట్టి , తన అమితమైన ధైర్యం మరియు సమయస్ఫూర్తితో, పసి పాపలు కాలిపోకుండా కాపాడారు.


ఛతర్పూర్ జిల్లా ఆసుపత్రిలో జూలై 11 తేదీ రాత్రి 7 గంటల వరకు అంతా బాగానే ఉంది. చిన్నపిల్లల వార్డులోంచి అప్పుడప్పుడు పిల్లల రోదనలు కూడా వినిపించాయి. అంతలోనే వార్డులోని ఏసీలో మంటలు చెలరేగాయి. ఏసీలో మంటలు చెలరేగడంతో కరెంటు పోయి అంధకారం అలుముకుంది. మంటలు తీవ్ర రూపం దాల్చకముందే అక్కడే ఉన్న వైద్యాధికారి డాక్టర్ రిషి ద్వావేది మంటలను ఆర్పే సిలిండర్తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిలిండర్లోని గ్యాస్అయిపోయినా మంటలు ఆరిపోకపోవడంతో వార్డులో పొగలు వ్యాపించాయి. డ్యూటీలో ఉన్న నర్సులు సంగీత మరియు జయల ధైర్యం కూడా సమాధానం చెప్పడం ప్రారంభించింది మరియు వారు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి దారులు వెతుకుతున్నారు. కానీ రిషిలోని స్వయంసేవకత్వము పిల్లలను ప్రమాదంలో వదిలేయడానికి సిద్ధంగా లేదు. శాఖలో పదే పదే పాడిన పాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి, నర్సుల సహాయంతో, వారు పిల్లలను చేతుల్లోకి ఎత్తుకుని వేరే వార్డుకు మార్చడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు కూడా వచ్చి అప్పుడే పుట్టిన పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీశారు.

సంఘ్ సంస్కారాల ప్రభావం వల్లనే క్లిష్ట పరిస్థితిలో అతను ఇలా చేయగలగడం సాధ్యమైనదని రిషి నమ్మకం. తన తండ్రి విపిన్ బిహారీజీ మహోబాలో బౌద్దిక్ ప్రముఖ్ గా ఉన్నారని, అన్నయ్య రజనీష్ ఐదేళ్లపాటు ప్రచారక్ గా ఉన్నారని ఆయన చెప్పారు

749 Views
अगली कहानी