सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ఇలాంటి జీవితం గెలుస్తూనే ఉంటుంది

కిషన్ మర్ల | మహారాష్ట్ర

parivartan-img

ఒక రోజు ఒకాయన కృష్ణ మహాదిక్ జీ ని (RSS యొక్క స్వయం సేవక్ మరియు నానా పాల్కర్ స్మృతి సమితి యొక్క సీనియర్ అసోసియేట్) వారి అబ్బాయి పెళ్ళికి ఆహ్వానించడానికి ఫోన్ చేయగా కృష్ణ జీ ప్రతిస్పందన పసిగట్టి తాను సిలుగురికి చెందిన వికాస్ చక్రవర్తి అని పరిచయం చేసుకుని ఆయన వివాహ వేడుకకి రావడానికోసం విమాన టిక్కెట్లు కూడా పంపుతున్నానని చెప్పాడు.


 

ఫోన్ లో సంభాషణను గుర్తుపట్టి , కృష్ణ జీ ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు, సిలిగురికి చెందిన ఒక జంట తమ తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఐదేళ్ల పిల్లవాడితో మెరుగైన చికిత్స పొందాలనే ఆశతో  ముంబైకి వచ్చారు. టాటా మెమోరియల్ హాస్పిటల్లో పిల్లవాడికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, జంట ఆశలన్నీ సన్నగిల్లినట్లు అనిపించే పరిస్థితిలో ఉన్నారు. వ్యాధికి అందుబాటులో ఉన్న ఏకైక చికిత్స బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ (BMT) మరియు ప్రక్రియ ఖర్చు 13 లక్షలు అవుతుందని వికాస్ చకర్వర్తి మరియు అతని భార్యకు డాక్టర్ చెప్పారు. 


చాలా కష్ట సమయంలో, జంట నానా పాల్కర్ స్మృతి సమితి యొక్క రుగ్న సేవా కేంద్రంలోకి పిల్లవాడితో పాటు వచ్చారు, ఇక్కడ రోగులకు మరియు వారి సహాయకులకు కేవలం 5 రూపాయలలో అల్పాహారం మరియు 10 రూపాయలలో వసతి సౌకర్యంతో పాటు భోజనం అందించబడుతుంది. అంత కష్ట సమయంలో, జంట నానా పాల్కర్ స్మృతి సమితి యొక్క రుగ్న సేవా కేంద్రంలోకి పిల్లవాడితో పాటు వచ్చారు, ఇక్కడ రోగులకు మరియు వారి సహాయకులకు  5 రూపాయలలో అల్పాహారం మరియు 10 రూపాయలలో భోజనం తో ఒక నెల వసతి సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది. కేంద్రంలో వారి కుటుంబం ఆప్యాయత, ఒక్కగానొక్క బిడ్డ బిదురిన్ చికిత్సలో సంరక్షణ మరియు సహాయంతో పాటు కృష్ణ జీతో వ్యక్తిగత బంధాన్ని పెంచుకుంది. రక్తసంబంధం కలిగిన తోబుట్టువులు మాత్రమే పిల్లవాడికి ఎముక మజ్జను దానం చేయగలరని వైద్యాధికారులు వారికి చెప్పడంతో, బిదురిన్ తల్లి కోసం భవనం పుట్టినిల్లుగా మారిపోయింది, ఆమె 9 నెలల పాటు అక్కడే ఉండి, బిదురిన్ చికిత్సతో పాటు ఆమె మహాలక్ష్మి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఒక అడ్డంకిని అధిగమించారు, కానీ మరొకటి ఇప్పటికీ ఉంది అది 13 లక్షల భారీ మొత్తం. 

సంకల్పం ఉన్న చోట, ఒక మార్గం ఉంటుంది- భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 4 లక్షల రూపాయలు విరాళం అందించారు మరియు శ్రేయోభిలాషుల సహాయంతో సమితి ద్వారా 2 లక్షల రూపాయల మొత్తాన్ని ఏర్పాటు చేశారు. చివరగా టాటా మెమోరియల్ హాస్పిటల్లోని అగ్రశ్రేణి వైద్యుల బృందం బిదురిన్కు శస్త్రచికిత్స చేసే రోజు రానే వచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, శస్త్రచికిత్స విజయవంతం కావడమే కాకుండా వైద్య శాస్త్రంలో ఒక చారిత్రక మైలురాయి గా నిలిచింది. తర్వాత బిదురిన్కి జరిగిన శస్త్రచికిత్సను అధ్యయనం చేసేందుకు అమెరికాకు ఆహ్వానించారు. 

ఇప్పుడు, 20 సంవత్సరాల తర్వాత, బిదురిన్ పూర్తి ఆరోగ్యంతో వున్నాడు. "భగవంతుని దయ మరియు సమితి సహాయంతో మా బిదురిన్ మాతో ఉన్నాడు" కీలక సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ తమ కుటుంబంలో భాగంగా భావిస్తాను అని వికాస్ చక్రవర్తి అన్నారు. బిదురిన్, ప్రస్తుతం బెంగుళూరులోని యాక్సెంచర్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అతను ఇప్పటికీ తనకు ఏంటో ఇష్టమైన ముంబైకర్ చాచా (మామ) కృష్ణ జీని గుర్తు తెచ్చుకుంటాడు. కృష్ణ జీ లేకుండా బిదురిన్ పెళ్లి జరగదని చకరవర్తి కుటుంబం కోరింది. కృష్ణ జీ మరియు కొంతమంది స్వయంసేవకులు వివాహానికి హాజరయ్యేందుకు సిలిగురి వెళ్లారు. 


పేద రోగులకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నానా పాల్కర్ జ్ఞాపకార్థం 1968లో ప్రారంభమైన నానా పాల్కర్ స్మృతి సమితితో అనుసంధానించబడిన అనేక భావోద్వేగ కథనాలను చూడవచ్చు. ప్రారంభంలో చాలా చిన్నగా మొదలై, ఇప్పుడు సమితి పది అంతస్తుల అత్యాధునిక భవనంలో 14 డయాలసిస్ మెషీన్లు కలిగిన ఆధునిక డయాలసిస్ సెంటర్, T.B. చికిత్స కేంద్రం, పాథాలజీ ల్యాబ్ మరియు పేషెంట్ కేర్ యూనిట్ వున్నాయి. సమితి 24 గంటల అంబులెన్స్ సర్వీస్ను నిర్వహిస్తుంది మరియు అవసరమైన రోగులకు వారి శస్త్రచికిత్సలను చేయడానికి ప్రతి నెలా 6.5 లక్షలు ఖర్చు చేస్తుంది. సమితి కేంద్రంలో 2014 నుండి 2017 వరకు మొత్తం 110000 డయాలసిస్లు జరిగాయి. డయాలసిస్ ఖర్చు కేవలం 350 రూపాయలు, ఇది బయట మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ. ప్రసవం కోసం వాడియా ఆసుపత్రిలో చేరిన మహిళల ఆహార అవసరాన్ని కూడా సమితి చూస్తుంది.

311 Views
अगली कहानी