सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

మహిళా సంవృద్ధి యోజన – ఉద్యోగ వర్ధిని

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

జీవితంలో విజయాలు అనేవి అదృష్టం వల్ల కలిసిరావువిజయాన్ని సాధించాలంటే కృషి మరియు పట్టుదల అవసరంఅలాంటి కొందరు మహిళల విజయగాధలను మనం ఇప్పుడు చూద్దాం

సులోచన అనే ఒక మహిళ తన మాతృత్వాన్ని నిలుపుకోవటం కోసం చాలా చోట్ల పని కోసం వెతికిందిఅలాంటి మహిళ ప్రస్తుతం షోలాపూర్ లోని గణేష్ మార్కెటింగ్ అనె హోల్సేల్ ఏజెన్సీ ని ప్రారంభించి లక్షల ఆదాయాన్ని గడుస్తుంది.   అల్పన అనే మరో మహిళ అప్పడాల తయారీలో శిక్షణ పొంది మరో 500 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది.         రూపాయి సంపాదించడం కోసం కష్టపడిన వైష్ణవి అనే మహిళ నేడు నూతన హంగులతో కూడిన ఫ్యాషన్ బొతీక్ ప్రారంభించింది.

ఇలాంటి ఎందరో మహిళలు కనీస అవసరాలు తీర్చుకునే క్రమంలో వారికి సహాయ పడాలనే సత్సంకల్పంతో రాష్ట్రీయసేవాభారతి,ధర్మకర్త అయిన చంద్రిక అనే మహిళఆధ్వర్యంలో ఉద్యోగ వర్ధిని అనే సంస్థని మహారాష్ట్రలోని సోలాపూర్ లో 2004లో స్థాపించింది.చంద్రిక చౌహాన్ గారు 600 స్వయం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 10 వేల మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు.

            చంద్రిక చౌహాన్ గారు పూర్వ సంఘ ప్రచారకులు అయినటువంటి శంభూ సింగ్ చౌహాన్ గారి శ్రీమతివీరు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సమాజహితం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారువీరు స్థాపించిన ఉద్యోగ వర్ధిని సంస్థ బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ (Best Women Entrepreneurship Program) అవార్డుని పొందింది.

           భక్రిజొన్న రొట్టె పల్లి పచ్చడి మహారాష్ట్ర వారి పసందైన వంటకం. ఉద్యోగ వర్ధిని  వంటకాన్ని తమ ఉపాధి గా మార్చుకుని దాదాపు 800 మంది  పనిలో నిమగ్నమయ్యారు.వృద్ధులకి,రోగులకి పరిశుభ్రమైన ఆహారాన్ని ఒకటిన్నర రూపాయలకే అందజేస్తున్నారుటైలరింగ్క్యాటరింగ్,కుండల తయారీ,పాత బట్టల తో బ్యాగుల తయారీ,సంప్రదాయ పిండి వంటలు తయారీ మొదలైనవి ఉద్యోగ వర్ధిని మహిళల యొక్క ముఖ్యమైన పనులు సంస్థకు సంబంధించిన మహిళలు స్వయం ఉపాధి బృందంలో సభ్యులుగా ఉంటారుఅందులో చాలామంది వారి ఇంటి నుండి లేదా మార్కెట్ ద్వారా వారి ఉత్పత్తులను విక్రయిస్తారుఇతరుల ఇళ్లల్లో పాచీ పని చేసుకునే సులోచన ఉద్యోగ వర్ధిని లో చేరిన తరువాత చంద్రిక జీ ప్రభావంతో సెలూన్ షాపుకు పనిముట్లను అందించే దుకాణం తెరిచింది.ఉద్యోగ వర్ధిని ఆమెకు అండగా నిలిచి వ్యాపారాన్ని పెంచే దిశగా తోడ్పడింది దుకాణం సోలాపూర్ లోని ఒక హోల్సేల్ ఏజెన్సీ గా ఎదిగింది. ప్రస్తుతం సులోచన ఉద్యోగ వర్ధిని మార్కెటింగ్ టీం ప్రముఖులు గా వ్యవహరిస్తున్నారు


              చంద్రిక జి అహ్మదాబాద్ నుంచి సోలాపూర్ వచ్చినప్పుడు సామాన్య గృహిణి. ఆమె భర్తకి గుండె శస్త్ర చికిత్స వలన వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదిఅప్పుడు ఆమె కుటుంబం గడవడం కోసం టైలరింగ్ నేర్చుకుందిడాక్టర్ కుకాడె గారి ప్రేరణతో తనతో పాటుగా ఇతర మహిళలను వారి కాళ్లపై నిలబడేలా చేసింది.  దిశగా ఆమె ప్రయాణం సోలాపూర్ లో ఘొటేకర్ కాలనీలో చిన్న కుటీరంలో మొదలై అంచెలంచెలుగా ఎదిగిందిప్రస్తుతం ఉద్యోగ వర్ధిని లో రోజుకు 5000 రొట్టెలు తయారు చేసే రోటి మెషినరీ ఉన్నది రొట్టెలను స్కూల్స్ మరియు హాస్పిటల్కు పంపిస్తారు. నెలకు 2క్వింటాల పల్లి చట్నీ ని తయారు చేస్తారువీరి పిండి వంటలను విదేశాలకు కూడా పంపిస్తారుఅంధులు తయారుచేసిన వస్తువులను కూడా  సంస్థ ద్వారా విక్రయింపచేస్తోంది.

          సమాజం పట్ల సున్నితత్వం ఉద్యోగ వర్ధిని యొక్క ముఖ్య ఉద్దేశంఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా సమాజం పట్ల అవగాహనసంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఉద్యోగ వర్ధిని యొక్క ముఖ్య ఉద్దేశంజాతీయ సేవా సంస్థ సీనియర్ ప్రచారకులు అయిన ఉదయ్ జోగెల్కర్ గారు వారి మాటల్లో ఉద్యోగ వర్ధిని విజయం వల్ల “వైభవ శ్రీ” అనే కొత్త కార్యక్రమం మహిళా అభ్యుదయం కొరకు సేవాభారతి లో ప్రారంభించబడినది.చంద్రిక జి చిన్న ప్రాంతాలలో ఉన్న వేలాది మంది మహిళలకు ఆర్థికంగా ఎదుగుతూ స్వయంశక్తితో సంపన్నులను చేసే దిశగా ప్రోత్సహిస్తున్నారు.

892 Views
अगली कहानी