सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

5 mins read

గణితమే గర్వపడేలా చేసిన సంఘ్ స్వయంసేవకులు

అలోక్ రెడ్డి | మధ్యప్రదేశ్

parivartan-img

చైనా సరిహద్దులో మంచుతో కప్పబడిన తవాంగ్ నుండి 56 కి.మీ. దూరంగా, 8000 అడుగుల దుర్గమమైన ఎత్తులో, ఒక ప్రదేశం ఉంది - బొమ్డిలా. రాజేష్ జీ మహారాష్ట్ర నుంచి సంఘ ప్రచారక్‌గా అరుణాచల్‌కు వచ్చినప్పుడు ఇక్కడి బస్టాండ్‌లో దిగగానే ఓ వింత దృశ్యం కనిపించింది. చుట్టూ 70-80మంది యువతీ యువకులు గందరగోళంగా గుంపులుగా కూర్చున్నారు. కొంతమంది అమ్మాయిలు ఏడ్చారు..... రాజేష్ జీ నోరు మెదపలేదు. ఒక్క బొమ్మిడిలాలోనే 300 మంది విద్యార్థులు గణితంలో ఫెయిల్!

ఆందోళనకరమైన విషయమేమిటంటే, వీరంతా ఇప్పుడు తమ చదువులను వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. గణిత భయం కారణంగా, చాలా మంది యువకులు తమ భవిష్యత్తును నాశనం చేసుకునే అంచున ఉన్నారు - ఈ బాధ అరుణాచల్ సేవా భారతికి కొత్త సేవా మార్గాన్ని చూపింది.

ఈ పిల్లల మనస్సుల్లోంచి గణితంపై ఉన్న భయాన్ని తొలగించేందుకు, ఈ పరిమిత వ్యవధిలో విద్యార్థుల గణిత సిలబస్‌ను పూర్తి చేసేలా 70 రోజుల క్రాష్ కోర్సును రూపొందించారు. సేవలో నిమగ్నమైన యువ వాలంటీర్లు మారుమూల గ్రామాలకు వెళ్లి ఎంతో అంకితభావంతో తరగతులు తీసుకుంటూ ఈ పిల్లలకు గణితాన్ని ఆసక్తికరంగా, సరళంగా బోధించడం ప్రారంభించారు. 2009లో ప్రారంభించిన ఈ విశిష్ట ప్రయోగం వల్ల పిల్లల్లో గణిత భయం పోవడమే కాకుండా ఇప్పటి వరకు 12వ తరగతిలో 8000 మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై ఉన్నత చదువుల వైపు మళ్లారు. వారిలో చాలా మంది నేడు మంచి స్థానాల్లో ఉన్నారు.

ఈశాన్యంలోని దుర్భరమైన జీవన పరిస్థితులను మనం ఊహించడం కూడా కష్టం. బొమ్డిలా వంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 12 నెలలు గడ్డకట్టే చలి,సంవత్సరంలో ఏడు నెలల వర్షం కారణంగా చెట్లు, మొక్కలు చనిపోతుంటాయి. వరి, ఇతర ఆహారాన్ని పండించడం కూడా కష్టం. చిన్నచిన్న వస్తువులను కొనాలంటే కూడా అత్యంత కష్టమైన పర్వతారోహణ చెయ్యాల్సిందే. బుఖారీ (పొయ్యి) వేడి సహాయంతో వెదురు ఇళ్లలో జీవించే, ఈ ప్రజల పిల్లల కోసం ప్రభుత్వం పాఠశాలలయితే తెరిచింది, కానీ కొన్నిసార్లు ఉపాధ్యాయులు రారు,కొన్నిసార్లు విద్యార్థులు రారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అరుణాచల్ సేవాభారతి ఈ చిన్నారులకు చదువు చెప్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చొరవ తీసుకుంది.


B.Tech చేసిన తర్వాత మొదటిసారిగా ఒక యువకుడు, పూనా లో ఉద్యోగానికి 40 రోజులు సెలవు పెట్టి ఈ పిల్లలకి గణితంలో క్రాష్‌కోర్సు చేద్దామని బొమ్మిడిలా వచ్చినప్పుడు, , ఈ పని ఒక రోజు అతని జీవిత లక్ష్యం అవుతుందని కూడా అతనికి తెలియదు. 2009 లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత, సంఘానికే  అంకితమైన ఈ స్వయంసేవక్, అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాలలో గణితాన్ని బోధిస్తున్నాడు. ప్రతి సంవత్సరం 5 -8 చోట్ల తరగతులు నిర్వహిస్తారు, గణిత సిలబస్‌ను 70 రోజుల్లో పూర్తి చేస్తున్నారు.  సేవాభారతి పిలుపు మేరకు కొంతమంది సేవాతత్పరులైన యువకులు 6 నెలల నుంచి ఏడాది వరకు సమయం తీసుకుని ఇక్కడ బోధించేందుకు వస్తారు. పూణే నుంచి ఆర్కిటెక్చర్ డిగ్రీ తీసుకున్న హర్షద, బయో మెడికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాధిక, ఎంఎస్సీ తర్వాత స్నేహ లాంటి అమ్మాయిలు అరుణాచల్ లోనే ఉంటూ ఈ పిల్లలకు 6 నెలల పాటు చదువు చెప్తుంటారు.ఇప్పుడు చాలా మంది సేవ చేయగల యువత ఇంగ్లీష్ గ్రామర్ మరియు APSC పరీక్షల మార్గదర్శకత్వం కోసం ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల అనుమతితో నిర్వహిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులను సంస్కారవంతులుగా, దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.వారానికోసారి దేశభక్తి గీతాలు ఆలపించడంతోపాటు మహానుభావుల కథలు కూడా చెబుతారు. ఎప్పటికప్పుడు కెరీర్ కౌన్సెలింగ్ క్యాంపులను కూడా సంస్థ నిర్వహిస్తోంది. ప్రముఖ విజయవంతమైన వ్యక్తులు మార్గదర్శకత్వం కోసం ఆహ్వానించబడ్డారు.

ఈ దుర్గమమైన పర్వత ప్రాంతంలో జ్ఞానం, సైన్స్ మరియు టెక్నాలజీని వ్యాప్తి చేయడానికి, సేవాభారతి అరుణాచల్‌తో పాటు పూణేకు చెందిన జ్ఞానప్రబోధిని సంస్థ కూడా ఈ పనికి సహకరిస్తోంది. హర్షద, స్నేహ వంటి బాలికలే కాకుండా ఇప్పటి వరకు 450 మంది సేవాతత్పరత కల్గిన ఉన్నత విద్యావంతులైన యువకులు అరుణాచల్‌కు వచ్చి ప్రతీ బస్తీ లో సైన్స్ ప్రయోగాలను కూడా చూపుతున్నారు.

1232 Views
अगली कहानी