सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

కేరళ: విచ్ఛిన్నమైన దేవభూమి

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

దేవ భూమి: అతి సుందర ప్రకృతి అందాలతో ప్రపంచం నలుమూలల నుండి లక్షల సంఖ్యల్లో యాత్రికులను ఆకర్షించే కేరళ కి గల మరో పేరు ఇది! అయితే 2018 జూలై నెల మొదట్లో దేవ భూమి వరదలు అనే భూతగణం గుప్పిట విలవిల లాడడం ప్రపంచానికి తెలిసినదే! గత శతాబ్ద కాలంలో కేరళ వాసులు చూడని భయానక వరద భీభత్సం అది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 483 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు! ఎవరూ కూడా ఖచ్చితంగా ఇంత మంది కనపడకుండా పోయారు అని చెప్పలేక పోయారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం వివరించిన దాని ప్రకారం సుమారు మూడవ వంతు రాష్ట్ర ప్రజలు వరదల వల్ల, దాని పర్యవసానంగాను నష్ట పోయారు. 

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు వాసుకి అనే సర్పాన్ని ప్రదేశాన్ని కాపాడేందుకు నియమించాడు అని ప్రసిద్ధి. అందుకే దీనిని పరశురామ క్షేత్రం అని కూడా అంటారు. భయానక ప్రకృతి భీభత్సం నుండి దేవ భూమిని బయట పడేయడానికి వాసుకి లాగానే వేలమంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క స్వయంసేవకులు వరదలతో ప్రాణాలు పణంగా పెట్టి నిలిచారు. ఇంత పెద్ద నివారణ చర్యల ప్రక్రియలో కొంత మంది స్వయంసేవకులు వీరమరణం పొందారు. మీకు చెప్పబోయే కథలోని విశాల్ నాయర్ అట్లాంటి వారిలో ఒకరు. నంగనల్లుర్ అనే సంఘ జిల్లా, మతిలిబాగం, తిరువల్లకు చెందిన 24 సంవత్సరాల యువ స్వయం సేవక్, తన తల్లిదండ్రులైన శ్రీ వేణుగోపాల్ నాయర్, శ్రీమతి జయశ్రీ గార్ల ఒక్కగానొక్క కుమారుడు. అతని తోబుట్టువు అతిర నాయర్ ఇలా చెప్పారు , " వరదలు తిరువల్లను తాకే వరకు మేమంతా ఎంతో సంతోషంగానే వున్నాం. వరద నుండి కాపాడేందుకు విశాల్ మా కుటుంబం అంతటినీ చాలా వేగంగా ఒక సుస్థిర ప్రదేశానికి చేర్చాడు. వెంటనే తను ఆర్ స్ స్ చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయాడు." 


సేవాభారతి త్రివేండ్రం జోనల్ వ్యవహారాల కార్యదర్శి శ్రీ ఎస్ జయకృష్ణ గారు తెలిపిన దేమంటే  - "ఆగస్టు 16 తేదీ సుమారు ఉదయం నాలుగు గంటల సమయంలో, వరద నీటిలో చిక్కుకు పోయిన 50 కుటుంబాలను రక్షించే పనిలో వున్న సేవాభారతి జట్టులో విశాల్ ముఖ్య సేవక్ లలో ఒకడుగా వున్నాడు ఇంతలో మురియప్ప వంతెన వద్ద ఒక వ్యక్తి వరద నీటిలో చిక్కుకు పోయి వుండడం విశాల్ గమనించాడు. అతన్ని రక్షించ డానికి బయల్దేరిన విశాల్ ను, ఒక పెద్ద వరద ప్రవాహం ముంచేసింది. అక్కడి గ్రామస్థులు వ్యక్తిని రక్షించ గలిగారు కానీ, విశాల్ ను దక్కించుకో లేక పోయారు ". ప్రాంత సేవా ప్రముఖులు శ్రీ వినోద్ గారు " ఘటన జరిగిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో వరదనీటి అడుగున విశాల్ విగత శరీరం దొరికింది" అని తెలిపారు. విశాల్ సోదరి అతిరా నాయర్, " మా కుటుంబం వున్న ఒక్క కుమారుడిని కోల్పోయింది, నేను నాకున్న ఒక్కగానొక్క సోదరుడిని కోల్పోయాను, అర్ ఎస్ ఎస్ అంకిత భావం గల ఒక స్వయం సేవక్ ను కోల్పోయింది. కానీ విశాల్ జ్ఞాపకాలు మాలో మరియు తన సహసేవక్  మనసుల్లో  ఎప్పటికీ సజీవంగానే వుంటాయి " అని గర్వంగా చెప్పారు. 

కథనం కూర్చే వేళకే కనీసం ఒక పది లక్షల మందిని చెంగన్నుర్, పందనాడ్, ఎదనాడ్, అరన్ముల, కోషెంచేరీ, అయిరూర్, రాన్ని, పండలం, కుట్టనాడ్, అలువా, మరియు చాలకుడి లలో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. భారత ప్రభుత్వం దీన్ని 3 శ్రేణి విపత్తు  (తీవ్ర ప్రకృతి విలయం) గా ప్రకటించింది. 1924 లో కేరళలో వచ్చిన అతి భయంకర ప్రకృతి విపత్తు తర్వాత వచ్చిన తీవ్ర వరద భీభత్సం ఇదే. వాయనాడ్, ఇడుక్కి లలో కలిగిన భారీ వర్షాలు, భూపాతం  వలన గిరి  ప్రదేశాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. భారత దేశ చరిత్రలో జరిగిన అతిపెద్ద సంరక్షణ ప్రక్రియలో సామాన్య ప్రజల జీవితాలను కాపాడడంలో ఎప్పటిలాగే ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు ముందు వరుసలో నిలబడి సేవలు చేశారు. 


రాష్ట్రీయ సేవా భారతి తో అనుసంధానమైన దేశీయ సేవా భారతి ఆధ్వర్యంలో 85000 మంది ఐచ్ఛిక సేవకులు కేరళ రాష్ట్రం మొత్తం తిరిగి మామూలు పరిస్థితులను  కల్పించడంలో పాలుపంచుకున్నారు. వరద తాకిడికి విపరీతంగా నష్టపోయిన అలపుజ జిల్లాలోని కుట్టలనాడు ప్రాంతంలో, దేశీయ సేవ భారతి 25 వైద్య శిబిరాలను, 150 పునరావాస కేంద్రాల్లో ఆహార, వసతి, మరియు వైద్య సదుపాయాలను చేకూర్చింది. వరద బాధితులను రక్షించడం లో 150 పడవలను, 70 అంబులెన్స్ లను రాత్రి పగలు అన్నది లేకుండా స్వయం సేవకులు వినియోగించారు. సేవా భారతి కార్యకర్తలు లు స్వయంగా 70 వేల మంది ప్రాణాలను కాపడగలిగారు. రాష్ట్ర స్థాయి కేంద్రీయ సేవ కేంద్రాన్ని (Centralized Help Desk) త్రిస్సుర్ జిల్లా లో సేవా భారతి స్థాపించింది.

909 Views
अगली कहानी