सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

ఆర్ఎస్ఎస్ కోవిడ్-యోధులు సైలెంట్ సేవా విప్లవానికి నాంది పలికారు-పార్ట్ 2

కిషన్ జీ మర్ల | మధ్యప్రదేశ్

parivartan-img

కేవలం 1.5 సంవత్సరాల వయస్సు గల గీత మరియు ఆమె తమ్ముడు ఆయుష్ ఇంకా 6 నెలల శిశువు సరిగ్గా నాలుగు నెలల క్రితం తల్లిని కోల్పోయారు. ఇప్పటికే వారు తల్లి ప్రేమ మరియు రక్షణ లేని కఠినమైన జీవితం జీవిస్తుండగా, వారి తండ్రి ఒక రిక్షా డ్రైవర్, కోవిడ్ కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత పిల్లలకు అవసరమైన పోషకాహార భద్రతా కూడా కోల్పోయారు. రాంచీలోని పహన్కోచా ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబం, ఆయుష్కు పాలు ఇవ్వడానికి కూడా కష్టపడుతోంది మరియు అతని అమ్మమ్మ అతనిని పోషించడానికి పొరుగువారి నుండి బియ్యప్పిండి అప్పుగా తీసుకుంటోంది. సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబం ఇదొక్కటే కాదు, రాంచీలోని లోహరా కోచా, భాభా నగర్, చాధారి, రవిదాస్ మొహల్లా వర్ధమాన్ కాంపౌండ్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితిలో 300 మంది పిల్లలు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ శివాజీ నగర్ కార్యవాహ, విజయ్ జీకి విషయం తెలియగానే, అతను మరియు అతని స్వయంసేవకుల బృందం కుటుంబాలందరికీ రెండు నెలల పాటు వారి ఇళ్ల వద్ద పాలు అందించేలా చూసుకున్నారు.


కోవిడ్ కారణంగా మరణించిన వారి కొడుకు లేదా కుమార్తె తుది వీడ్కోలు చెప్పడానికి కూడా రాలేకపోయిన చాలా మంది వ్యక్తులు ఉన్నారు, అప్పుడు సంఘ్ స్వయంసేవకులు బాధ్యత తీసుకున్నారు. నాసిక్, జిల్లా కార్యవాహ, మంగేష్ భాయ్ మరియు అతని బృందం కోవిడ్ కారణంగా మరణిస్తున్న వ్యక్తులకు సరైన అంత్యక్రియలు జరిగేలా చూసింది. స్వయంసేవకులకు చాలా మంది ప్రజలు అపరిచితులే, అయితే ఆర్ఎస్ఎస్ ప్రయత్నాల కారణంగా వారి బంధువులు వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయగలిగారు. సోనాలి దబక్, శుభదా దేశాయ్, దిపాలి గడఖ్ లాంటి మహిళా కోవిడ్ యోధులు PPE కిట్లు ధరించి అంత్యక్రియలలో భాగంగా చితికి నిప్పంటిచాడంలో సహాయం చేశారు. మరణించిన వారి బంధువులు అంత్యక్రియల కోసం స్థానిక RSS స్వయంసేవక్లను సంప్రదించమని ఒక బోర్డు కూడా పెట్టారు.

జాతీయ సహ-సేవా ప్రముఖ్, రాజ్కుమార్ మాతాలే జీ మాట్లాడుతూ, సమస్యలు పెరుగుతున్న కొద్దీ ఆర్ఎస్ఎస్ కృషి కూడా పెరిగింది అని అన్నారు. ఆసుపత్రులకు రక్త సరఫరా కొరత ఏర్పడకుండా చూసేందుకు 60,000 మందికి పైగా స్వయంసేవకులు రక్తదానం చేశారు (జూన్ 5 వరకు గణాంకాలు). వ్యాధులు మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మురికివాడలు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి కేరళ నుండి హర్యానా వరకు RSS శానిటైజేషన్ డ్రైవ్లను నిర్వహించింది. మీరట్ జిల్లాలోని అమ్రోహాలో రోగులు మరియు వారి బంధువులకు సహాయం చేయడానికి సేవాభారతి యొక్క 24 గంటల పాన్-ఇండియా మెడికల్ హెల్ప్లైన్ అమలు చేయబడింది.


కార్మికుల వలసలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు, భారతదేశంలోని 1778 ప్రదేశాలలో 44 లక్షల మందికి పైగా కూలీలకు ఆహారం, నీరు, మందులు మరియు ఇతర నిత్యావసరాలు అందించబడ్డాయి. అలాంటి కథ ఒకటి సూరత్లోని నూర్ మహమ్మద్ ది, అతను అమేథీ (U.P) కి చెందినవాడు, రోడ్డు పక్కన బట్టలు అమ్మే ఉద్యోగం చేసేవారు. కోవిడ్ కారణం గా ఉద్యోగం పోయింది, అతని కుటుంబం ఆకలితో వున్నారు అప్పుడు తన గర్భవతి అయిన భార్య మరియు 3 సంవత్సరాల పిల్లవాడితో కలిసి 1300 కిమీ దూరం నడవాలని నిర్ణయించుకున్నాడు. అతని భార్య ఇష్రత్, జల్గావ్ హైవే వెంట మధ్యలో ప్రసవ నొప్పిని అనుభవించింది మరియు తీవ్ర రక్తస్రావం ప్రారంభమైంది. కవి కాసర్ మరియు సమీపంలోని ఆహారం పంపిణీ చేస్తున్న ఇతర ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు దీనిని గమనించినప్పుడు, వారు శిశువును సురక్షితంగా ప్రసవించడంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. తర్వాత వారు ఆమెను RSS నగర మాజీ అధిపతి డాక్టర్ వికాస్ భోలే ఆసుపత్రిలో చేర్చారు.

కోవిడ్, భయం మరియు నిస్సహాయ వాతావరణాన్ని సృష్టించింది. RSS స్వయంసేవకులు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతిసారీ, వారు ప్రతికూల భావాలను నిర్వీర్యం చేస్తూ ఆశాజనకమైన మరియు సహాయకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు

కథలోని భాగంలో అంతే. ఇలాంటి మరిన్ని కథల కోసం చూస్తూనే ఉండండి....

704 Views
अगली कहानी