सब्‍सक्राईब करें

क्या आप ईमेल पर नियमित कहानियां प्राप्त करना चाहेंगे?

नियमित अपडेट के लिए सब्‍सक्राईब करें।

కర్మయోగి-నానాజీ దేశముఖ్

కిషన్ జీ మర్ల | భరత్ | భరత్

parivartan-img

ప్రముఖ పారిశ్రామికవేత్త ఘనశ్యామ్దాస్ బిర్లా 77 ఏళ్ల క్రితం యువకుడిని తన వ్యక్తిగత కార్యదర్శిగా చేసుకోవాలనుకున్నాడు. మంచి జీతం, వసతి మరియు ఆహారం ఉచితం. 21 ఏళ్ల యువకుడు రాజస్థాన్లోని ఫేమస్ బిర్లా కాలేజ్ ఆఫ్  ప్లానీలో ఫుట్బాల్ నుండి డిబేట్ వరకు మరియు చదువు కు సంబందించిన ప్రతి రంగంలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అప్పుడు కూడా చండికాదాస్ దేశ్ముఖ్, బిర్లా ప్రతిపాదనను తిరస్కరించి, డాక్టర్ హెడ్గేవార్జీ నుండి దీక్షను స్వీకరించి సంఘ్ ప్రచారకుడయ్యాడు. మహారాష్ట్ర లో పర్భాని జిల్లా హింగోలి తాలూకాలోని కడోలి అనే చిన్న గ్రామానికి చెందిన అమృతరావు మరియు రాజాబాయి దేశ్ముఖ్ ఐదవ మరియు ఆఖరి సంతానం. పేదరికం మరియు నిరక్షరాస్యతల మధ్యలో పుట్టి తన దృఢ సంకల్పం, కఠోర శ్రమ, విపరీతమైన దేశభక్తితో ప్రతి జీవితంలోనూ విజయ పతాకాన్ని ఎగురవేశారు. చిత్రకూట్ వంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 500 గ్రామాల్లో గ్రామాభివృద్ధి గంగను ప్రవహింపచేసి, దేశంలోని మొట్టమొదటి గ్రామీణ పాఠశాలకు పునాది వేసిన నానాజీ దేశ్ముఖ్ గారి జీవితమంతా సేవా రంగంలో పనిచేస్తున్న ప్రజలకు ఒక మంచి ప్రేరణ.


నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు మరియు పేదరికం మధ్య పెరిగిన నానాజీ 11 తరగతి వరకు చదువుకునే అవకాశం కూడా రాలేదు. తర్వాత కూడా చదువు కొనసాగించేందుకు చిన్నతనంలో కూరగాయలు అమ్మడం నుంచి వార్తాపత్రికలు పంచడం వరకు ఎన్నో పనులు చేశారు. చాలా రాత్రులు ఆకలి ఆయనను నిద్ర పోనివ్వకుండా చేసేది. బహుశా అందుకే 1934లో హెగ్డేవార్ జీ తో సంఘ్ ప్రతిజ్ఞ చేసిన 17 మంది స్వయంసేవకులలో 18 ఏళ్ల చండికాదాస్ దేశ్ముఖ్ కూడా ఉన్నారు. ప్రచారక్ అయిన తర్వాత, నానాజీ సేవా విభాగంలో మొదట అవకాశం వచ్చిన వెంటనే పనిలో లీనమైపోయారు. అది 1944 నాటి విషయం, చిటౌలి గ్రామంపై నారాయణి నది పొంగి, గ్రామం మొత్తం నీటిలో మునిగిపోయినప్పుడు, నానాజీ తన తోటి స్వయంసేవకులతో కలిసి చాలా రోజులు వరద బాధితుల సేవలో నిమగ్నమయ్యారు.

గాంధీజీ హత్య తర్వాత సంఘ్ నిషేధించబడినప్పుడు, అయన 6 నెలలు జైలులో ఉండవలసి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నానాజీ తన శక్తినంతా సంఘ్ ఆదేశాల మేరకు జనసంఘ్ నిర్మాణానికి పూనుకున్నారు. నాటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, సంఘ్ 1951లో జాతీయ వాద పార్టీ జనసంఘ్ను ఏర్పాటు చేసి, దానిని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నానాజీ మరియు దీన్దయాల్ జీ కి అప్పగించింది.

జనసంఘ్ ఆవిర్భావం నుంచి ఇందిరాగాంధీ పతనం వరకు నానాజీ రాజకీయ పాత్ర అందరినీ విస్మయానికి గురి చేసింది. భిన్నమైన వ్యక్తులను ఒకచోట చేర్చడంలో విజయం సాధించడమే కాకుండా, జాతీయవాద పార్టీలకు విజయాన్ని అందించిన జె. పీ. ఉద్యమానికి కూడా నానాజీ వ్యూహ రచన చేశారు.

1975లో సంఘ్పై నిషేధం విధించి మరోసారి 17 నెలలు జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్నప్పుడు నానాజీ పరిస్థితులు తలుచుకొని అధ్యయనం చేస్తూ, వికృత రాజకీయ సంస్కృతి దేశానికి సంక్షేమాన్ని తీసుకురాదని, అందుకు దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క  పునాది అయిన గ్రామాల్లోనే అభివృద్ధి చెందాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత నానాజీ రాజకీయాలకు దూరమై సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. రాజ్యాధికారం ద్వారా కాకుండా ప్రజాశక్తి ద్వారా దేశం పునర్నిర్మించబడుతుందనే నమ్మకంతో, నానాజీ క్యాబినెట్ మంత్రి పదవిని తిరస్కరించడం ద్వారా రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. పని కోసం, అయన మొదట ఉత్తరప్రదేశ్లోని అత్యంత వెనుకబడిన జిల్లా గోండాను ఎంచుకున్నారు. 'హర్ హాథ్ కో కామ్, హర్ ఖేత్ కో పానీ' అనే నినాదంతో పని చేస్తూ, సాంప్రదాయ పద్ధతుల ద్వారా గోండాలోని గ్రామాన్ని అభివృద్ధి చేశాడు.

సమాజంలోని నిరుపేదలను ఆర్థిక స్వతంత్రత దిశగా సిద్ధం చేయడం ద్వారానే మనం దేశాన్ని అభివృద్ధి చేయగలం. నానాజీ యొక్క ఆలోచన దీనదయాళ్ పరిశోధనా సంస్థకు జన్మనిచ్చింది. విద్య, ఆరోగ్యం, స్వావలంబన మరియు నైతికత నాలుగు అంశాల ఆధారంగా, సంస్థ చిత్రకూట్ మరియు చుట్టుపక్కల 500 వెనుకబడిన గ్రామాలలో అభివృద్ధికి పునాది వేసింది. సంప్రదాయ పరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి అభివృద్ధితో గ్రామాల పరిస్థితి, దిశ క్రమంగా మారిపోయింది. దీని కోసం, నానాజీ పిలుపుతో, చాలా మంది విద్యావంతులైన దంపతులు గ్రామాలలో సేవ కోసం తమ జీవితాన్ని చాలా సంవత్సరాలు వెచ్చించారు, నానాజీ గ్రామస్తులను స్వతంత్రులుగా చేయడమే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా చేశారు.

నానాజీ జీవితమంతా త్యాగం మరియు నిస్వార్ధానికి ఒక ఆదర్శవంతమైన ఉదాహరణ. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, చిత్రకూట్లో గ్రామాభివృద్ధికి తన పార్లమెంటు నిధిలోని ప్రతి పైసా ఖర్చు చేసిన నానాజీ, వైద్య పరిశోధన కోసం తన శరీరాన్ని దానం చేశారు.

359 Views
अगली कहानी